పాలకూరతో ఇలా ట్రై చేయండి - తక్కువ రైస్, ఎక్కువ కర్రీ తినేయొచ్చు!
అన్నం, చపాతీల్లోకి సరైన పాలకూర - ఇలా సింపుల్‌గా ట్రై చేయండి!
palak_curry_recipe (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 4:19 PM IST
Palak Curry : పాలకూర ఉల్లికారం, పాలకూర ఫ్రై, పాలకూర పప్పు ఎప్పుడూ ట్రై చేసే వంటకాలే. వాటికి బదులు ఇలా గ్రేవీ కర్రీ ట్రై చేశారంటే అన్నం, చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది. తక్కువ చపాతీలు లేదా అన్నం తింటూ ఎక్కువ ఆకుకూరలు తీసుకోవాలనుకునే వారికి ఈ కర్రీ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
టమోటాలు ఎండబెట్టకుండానే - అప్పటికప్పుడు చేసుకునే నిల్వ పచ్చడి!

కావల్సిన పదార్థాలు :
- పాలకూర - 3 లేదా 4 కట్టలు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - అర స్పూన్
- వెల్లుల్లి తరుగు - 6నుంచి 8 వరకు
- ఎండు మిర్చి - 3
- పచ్చి మిర్చి - 4
- ఉల్లిపాయ - 1
- పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు
- ధనియాలు - 1 స్పూన్
- నువ్వులు - 2 స్పూన్లు
- కారం - 2 స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :
- ముందుగా పాలకూర కట్టలు తెచ్చుకుని కాడలతో సహా కట్ చేసుకుని తీసుకోవాలి. కట్ చేయడానికి ముందుగానే శుభ్రం చేసుకుని తీసుకోవాలి. ఇపుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. వేడెక్కగానే జీలకర్ర, వెల్లుల్లి తరుగు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. అదే విధంగా కారానికి సరిపడా పచ్చి మిర్చి చీలికలు వేసుకోవాలి. పచ్చిమిర్చి లేకుండా ఎండుకారం వాడుకోవచ్చు. లేదా రెండింటినీ వాడుకోవచ్చు.

- ఇపుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు రంగు మారే వరకు వేయించుకుని కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. ఇపుడు ఓ సారి బాగా కలిపి మూతపెట్టుకుని లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మూతపెట్టకుండానే మధ్య మధ్యలో కలుపుతూ పాలకూర ఆకును ఉడికించుకోవాలి. మూతపెట్టి కుక్ చేస్తే పాలకూర రంగు మారుతుంది కాబట్టి. మూత పెట్టకుండా ఉడికించుకుంటే చూడడానికి బాగుంటుంది.

- ఇపుడు పక్కన స్టవ్ పై మరో ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేసుకుని సన్నటి మంటపై దోరగా వేయించాలి. ఆ తర్వాత ధనియాలు, నువ్వులు వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇపుడు మిక్సీజార్‌లోకి తీసుకుని గ్రైండ్ చేసుకోవాలి.

- ఐదు నిమిషాల పాటు పాలకూర ఉడికించుకుని పాలకూరలోకి కారం, ఉప్పు వేసుకుని కలపాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని ఆ తర్వాత గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు! ఘుమఘుమలాడే కర్రీ రెడీగా ఉంటుంది.
పాతకాలం నాటి "కంద కోడిగుడ్డు పులుసు" - ఈ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "షీర్ కుర్మా" - రంజాన్ మాసంలో ఇలాగే చేస్తుంటారు!

