ETV Bharat / offbeat

నోటికి కొత్త రుచినిచ్చే "పాలక్ సోయా బుర్జీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్​గా చేసేయొచ్చు!

పాలకూర, సోయాతో సింపుల్​గా చేసుకునే కర్రీ - రోటీ, చపాతీ, రైస్​లోకి అదుర్స్!

Palak Soya Bhurji
Palak Soya Bhurji (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 7, 2026 at 1:47 PM IST

2 Min Read
Choose ETV Bharat

Soya Palak Bhurji Recipe : పాలకూర, సోయా (మీల్​మేకర్​)ను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. అయితే ఓసారి ఇలా ఈ రెండింటిని ఉపయోగించి ఈ విధంగా పాలక్ సోయా బుర్జీ కర్రీ చేశారంటే సూపర్​గా వస్తుంది. బిగినర్స్​తో పాటు బ్యాచిలర్స్​ కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ ఈజీగా చేసేయోచ్చు. ఇది అన్నం, చపాతీ, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.

అన్నం, కర్రీ చేయాల్సిన అవసరం లేదు - ఇలా చేస్తే లంచ్ బాక్స్ కళకళ!

Palak Soya Bhurji
పాలకూర (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • సోయా గ్రాన్యూల్స్ - ఒక కప్పు
  • ఆయిల్ - 5 టేబుల్ స్పూన్లు
  • వెల్లుల్లి తరుగు - 3 టేబుల్ స్పూన్లు
  • ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
  • పచ్చిమిర్చి - 3
  • పాలకూర సన్నని తరుగు - 4 కప్పులు
  • పసుపు - పావు టీ స్పూన్
  • జీలకర్ర పొడి - అర టీ స్పూన్
  • కారం - అర టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ధనియాల పొడి - అర టీ స్పూన్
  • కసూరిమెంతి - కొద్దిగా
  • నెయ్యి - 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - పావు టీ స్పూన్
Palak Soya Bhurji
అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయలు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పరిమాణంలో పాలకూర, ఉల్లిపాయ, మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచాలి. అలాగే ఇంకో గిన్నెలో కప్పు సోయా గ్రాన్యూల్స్​, సరిపడా వేడి నీళ్లు పోసి 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
  • అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి తరుగు యాడ్ చేసి వేగనివ్వాలి.
Palak Soya Bhurji
సోయా గ్రాన్యూల్స్ (Getty Images)
  • వెల్లుల్లి వేగిన తర్వాత కప్పు ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తబడిన తర్వాత నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్​ను నీళ్లు లేకుండా గట్టిగా పిండి ఇందులో వేసి నాలుగు నిమిషాల పాటు వేయించాలి.
  • అనంతరం నాలుగు కప్పుల పాలకూర సన్నని తరుగు యాడ్ చేసి 8 నిమిషాల పాటు వేయించాలి. అదేవిధంగా పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, అర టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేయాలి.
Palak Soya Bhurji
పచ్చిమిర్చి (Getty Images)
  • ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి కలిపి మూతపెట్టాలి. ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్​లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
  • 5 నిమిషాల అనంతరం కొద్దిగా కసూరిమెంతి వేసి కలపాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Palak Soya Bhurji
జీలకర్ర (Getty Images)
  • అంతే ఘుమఘుమలాడే పాలక్ సోయా బుర్జీ కర్రీ రెడీ అయినట్లే!
  • వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసి తిన్నారంటే ఇంకో రెండు ముద్దలు ఎక్కువగానే లాగిస్తారు. అంతేకాక చపాతీ, రోటీల్లోకి అద్దిరిపోతుంది.

"కరకరలాడే గారెలు, చెక్కలు" - పక్కా కొలతల్లో చేస్తే క్రిస్పీగా వస్తాయి!

'వావ్' అనిపించే "ఉలవల కారం పొడి" - ఇడ్లీ, దోసెలతో పాటు వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!