ETV Bharat / offbeat

పాలకూర, పనీర్​ కాంబోలో "రోటీలు" - సూపర్​ సాఫ్ట్​ అండ్​ టేస్టీ - లంచ్​ బాక్స్​లకు పర్ఫెక్ట్​!

-పాలకూరను నేరుగా తినడానికి మీ పిల్లలు సుముఖంగా లేరా? - ఓసారి ఇలా రోటీలు చేయండి, అద్భుతంగా ఉంటాయి!

Palak Paneer Roti
Palak Paneer Roti (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : December 22, 2025 at 2:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

Palak Paneer Roti: ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో పాలకూర ముందు వరుసలో ఉంటుంది. కేవలం ఆరోగ్యం విషయంలోనే కాదు రుచిలో కూడా ఈ ఆకు అద్భుతంగా ఉంటుంది. అయితే ఎంత టేస్టీగా ఉన్నా చాలా మంది పాలకూరను తినడానికి అంతగా ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలైతే వద్దని ముఖం మాడుస్తుంటారు. మరి మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితా?. అయితే ఓసారి పాలకూరతో రోటీలు చేయండి. సూపర్​గా ఉంటాయి. కేవలం పాలకూర మాత్రమే కాకుండా పనీర్​ కూడా యాడ్​ చేయడం వల్ల మరింత టేస్టీగా ఉంటాయి. తయారు చేసుకోవడం కూడా సులువే. ఇక వీటిని నేరుగా తిన్నా అద్దిరిపోతాయి. అంతేకాదు పిల్లలకు లంచ్​ బాక్స్​లలో పెడితే వద్దనకుండా ఇష్టంగా తినేస్తారు. మరి లేట్​ చేయకుండా పాలకూర, పనీర్​ కాంబినేషన్​లో రోటీలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

Palak Paneer Roti
పాలకూర (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • పాలకూర కట్ట - 1
  • కొత్తిమీర - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 3
  • అల్లం ముక్క - చిన్నది
  • పనీర్​ ముక్కలు - పావు కప్పు
  • గోధుమపిండి - 1 కప్పు
  • ఉప్పు - అర టీస్పూన్​
Palak Paneer Roti
పనీర్​ (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా ఓ జల్లి గిన్నెలోకి వేసుకుని కొద్దిసేపు పక్కన ఉంచాలి.
  • పాలకూరలోని నీరు మొత్తం పోయినాక మిక్సీజార్​లోకి వేసుకోవాలి. ఆపై అందులోకి కొత్తిమీర, అల్లం ముక్క, పచ్చిమిర్చి తుంపలు, పనీర్​ ముక్కలు వేసి అస్సలు నీళ్లు పోయకుండా వీలైనంత మెత్తని పేస్ట్​లా గ్రైండ్​ చేసుకుని పక్కన ఉంచాలి.
  • వెడల్పాటి మిక్సింగ్​ బౌల్​లోకి గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి పదార్థాలు మొత్తం కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.
Palak Paneer Roti
గోధుమపిండి (Getty Images)
  • నూనె పిండికి పట్టినాక గ్రైండ్​ చేసిన పాలకూర పేస్ట్​ వేసి సాఫ్ట్​గా, ముద్దలాగా కలుపుకోవాలి.
  • పిండిని పర్ఫెక్ట్​గా కలుపుకున్నాక ముద్దపై లైట్​గా నూనె అప్లై చేసి మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టాలి.
  • 10 నిమిషాలు ఆగాక పిండి ముద్దను మరోసారి కలిపి కొద్దికొద్దిగా తీసుకుంటూ బాల్​లాగా చేసుకోవాలి.
  • చపాతీ పీట మీద పొడి పిండి చల్లుకుని ఓ ఉండను ఉంచి కర్ర సాయంతో చపాతీ సైజ్​ వచ్చేలా రోల్​ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్​ చేసుకోవాలి.
Palak Paneer Roti
కొత్తిమీర - పచ్చిమిర్చి - అల్లం (Getty Images)
  • స్టవ్​ ఆన్​ చేసి దోశ పెనం పెట్టి హీట్​ చేసుకోవాలి. పెనం బాగా కాలాక ప్రిపేర్​ చేసుకున్న రోటీ వేసి అర నిమిషం పాటు మీడియం ఫ్లేమ్​లో కాల్చుకోవాలి. రెండో వైపుకు తిప్పి మరో అర నిమిషం కాల్చుకోవాలి.
  • ఇలా రెండు వైపులా లైట్​గా కాలాక రోటీని డైరెక్ట్​గా ఇంకో బర్నర్​ మీద పెట్టి రెండు వైపులా కాల్చుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలా కాల్చుకున్న రోటీపై లైట్​గా బటర్​ లేదా నెయ్యిని అప్లై చేసుకుంటే స్మూత్​గా ఉంటుంది.
  • ఈ విధంగా అన్నింటిని ప్రిపేర్​ చేసుకుని వేడివేడిగా నచ్చిన కూరతో లేదా నేరుగా సర్వ్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర, పనీర్​ రోటీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Palak Paneer Roti
పాలకూర పనీర్​ రోటీ (ETV Bharat)

చిట్కాలు:

  • పాలకూరను కాడలతో సహా మిక్సీజార్​లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • గోధుమపిండి అనేది పైన చెప్పినంతే తీసుకోవాలని లేదు. పాలకూర పేస్ట్​ను బట్టి క్వాంటిటీని పెంచి లేదా తగ్గించి తీసుకోవచ్చు.
  • రోటీ మొత్తాన్ని ఒకటే సైజ్ వచ్చేలా రోల్​ చేసుకోవాలి. అప్పుడే రోటీ మొత్తం పర్ఫెక్ట్​గా పొంగి మంచిగా కుక్​ అవుతుంది.
  • మీక డైరెక్ట్​గా బర్నర్​ మీద కాల్చుకోవడం ఇష్టం లేదనుకుంటే పెనం మీద రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంచిగా కాలాక బటర్​ లేదా నెయ్యి అప్లై చేసుకుంటే సరి.

క్రిస్మస్​, న్యూ ఇయర్​ స్పెషల్​ "చాక్లెట్​ కేక్​" - బీటర్​, ఓవెన్​తో పనిలేదు - అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

క్రిస్పీ క్రిస్పీ "క్యారెట్ ఫ్రైస్​" - ఫ్రెంచ్​ ఫ్రైస్​ను మించిన టేస్ట్​!