పచ్చిమిర్చితో సింపుల్‌గా చేసుకునే "కారం పొడి" - కూరలు పక్కనపెట్టి తినేస్తారు!
మీరు ఎప్పుడూ తినని కారం పొడి - రుచి అంతకు మించి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 10:00 AM IST
Green Chilli Powder in Telugu : సాధారణంగా కర్రీ, పులుసు, రోటి పచ్చడి ఇలా ఏ వంటలోనైనా పచ్చిమిర్చి తప్పనిసరిగా ఉండాల్సిందే! ఎందుకంటే ఇది వంటలకు మంచి ఫ్లేవర్‌తో పాటు కమ్మదనాన్ని ఇస్తుంది. అయితే వీటితో రుచికరమైన కారం పొడి చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది సరికొత్తగా ఉండడమే కాకుండా టేస్ట్ కూడా అంతకు మించి అనేలా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పొడితో పాటు కాస్త నెయ్యి వేసి తింటే వావ్ అనాల్సిందే. అంతేకాక టిఫిన్స్‌లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. పైగా దీన్ని చాలా తక్కువ పదార్థాలతో నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ సూపర్ టేస్టీ పచ్చిమిర్చి కారంపొడికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
"చికెన్ ఫ్రై కావాలి, సెమీ గ్రేవీ ఉండాలంటే" ఇలా ట్రై చేయండి! - ప్రతి ముక్క నోరూరిస్తుంది!

కావాల్సిన పదార్థాలు :
- పుట్నాలు - ముప్పావు కప్పు
- పల్లీలు - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- ధనియాలు - 1 టీ స్పూన్
- ఎండుకొబ్బరి ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
- ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
- పచ్చిమిర్చి - 25
- కరివేపాకు - ఒక కప్పు
- దొడ్డు ఉప్పు - రుచికి సరిపడా
- ఇంగువ - పావు టీ స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 15

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా 25 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి పొడి క్లాత్‌తో తుడిచి సన్నగా పొడువుగా కట్ చేసి పక్కనుంచాలి.
- అలాగే స్టవ్ ఆన్ చేసి పాన్‌లో ముప్పావు కప్పు పుట్నాలు వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి రెండు నిమిషాల పాటు వేయించి ఓ ప్లేట్లో వేయాలి.

- ఇదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేగనివ్వాలి. పల్లీలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ధనియాలు యాడ్ చేసి ఫ్రై చేసి గిన్నెలో వేయాలి. ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల ఎండుకొబ్బరి వేసి వేగనించి ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇదే పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేయాలి.

- పచ్చిమిర్చి వేగిన తర్వాత కప్పు కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించాలి. ఇందులోకి రెండు టీ స్పూన్ల చింతపండు యాడ్ చేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్‌లో పల్లీలుఎండుకొబ్బరి మిశ్రమం, ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, రుచికి సరిపడా దొడ్డు ఉప్పు, పావు టీ స్పూన్ ఇంగువ వేసి కాస్త బరకగా గ్రైండ్ చేయాలి.

- ఇందులోకి వేయించిన పుట్నాలు వేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా 15 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసి కాస్త బరకగా మిక్సీ పట్టి పొడిని గిన్నెలో సర్వ్ చేసుకోవాలి.
- అంతే నోరూరించే పచ్చిమిర్చి కారం పొడి తయారైనట్లే!
- వేడివేడి అన్నంలో ఈ పొడి కాస్త నెయ్యి వేసి తిన్నారంటే ఇంకో రెండు ముద్దలు ఎక్కువగానే లాగిస్తారు!
పండక్కి కరకరలాడే "రిబ్బన్ పకోడీ" - ఇలా ట్రై చేస్తే నూనె తక్కువ పడుతుంది!
కొబ్బరితో కమ్మని "మురుకులు" - ఈ సంక్రాంతి పండక్కి కరకరలాడించండి!

