ETV Bharat / offbeat

రెండు ఉల్లిపాయలతో క్రిస్పీ "కట్​ లెట్స్​" - 5 నిమిషాల్లో ఈవెనింగ్​ స్నాక్​ రెడీ​!

- ఈవెనింగ్ టైమ్​కి అద్దిరిపోయే 'స్నాక్' రెసిపీ - పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు!

Onions Cutlets Recipe
Onions Cutlets Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 7, 2026 at 5:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

Onions Cutlets Recipe : పిల్లలు స్కూల్​ నుంచి రాగానే స్నాక్స్​ పెట్టమని గోల చేస్తుంటారు. దీంతో వాళ్ల పోరుపడలేక చాలా మంది అమ్మలు నూడుల్స్​, పాస్తా, బ్రెడ్​ రోల్స్​, శాండ్​విచ్​ వంటివి ప్రిపేర్​ చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ ఒకటే రకం కాకుండా కేవలం ఐదు నిమిషాల్లో తయారయ్యే ఓ అద్భుతమైన రెసిపీ తీసుకొచ్చాం. అదే ఆనియన్​ కట్​లెట్స్​. ఇంట్లో ఉన్న పదార్థాలతో అతి తక్కువ సమయంలో చాలా సింపుల్​ అండ్​ టేస్టీగా చేసుకోవచ్చు. పైగా వీటి కోసం డీప్​ఫ్రై అవసరం లేదు. తక్కువ నూనెతో తయారు చేసుకోవచ్చు. పిల్లలకు స్నాక్స్​లాగానే కాకుండా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా వీటిని పెడితే మస్త్​ ఖుష్​ అవుతారు. మరి, లేట్​ చేయకుండా ఆనియన్​ కట్​లెట్స్​ ఎలా చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

Onions Cutlets Recipe
Onions Cutlets Recipe (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • ఉల్లిపాయలు - 2 (పెద్దవి)
  • పచ్చిమిర్చి - 3
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 1 టీస్పూన్​
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • బియ్యప్పిండి - అర కప్పు
Onions Cutlets Recipe
Onions Cutlets Recipe (Getty Images)

తయారీ విధానం:

  • పెద్ద సైజ్​లో ఉన్న ఉల్లిపాయలు తీసుకుని శుభ్రంగా పొట్టు తీసి చివర్లు కట్​ చేసి సన్నగా, పొడుగ్గా కట్​ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. అదే విధంగా పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • మిక్సింగ్​ బౌల్​లోకి ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర తరుగు వేసి పదార్థాలు మొత్తం కలిసేలా ఆనియన్స్​ను ప్రెస్​ చేస్తూ మిక్స్​ చేయాలి.
Onions Cutlets Recipe
Onions Cutlets Recipe (Getty Images)
  • పదార్థాలు అన్నీ కలిసి ఉల్లిపాయల్లో నుంచి రసం వచ్చాక బియ్యప్పిండిని వేసి మరోసారి అంతా కలిసేలా మిక్స్​ చేసుకోవాలి.
  • అనంతరం పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ కట్​లెట్స్​ షేప్​లో చేసుకుని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని కట్​లెట్​ షేప్​ వచ్చేలా చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి వెడల్పాటి పాన్​ పెట్టి షాలో ఫ్రై కోసం అంటే 3 లేదా 4 టేబుల్​స్పూన్ల వేసి స్ప్రెడ్​ చేసుకుని హీట్​ చేసుకోవాలి.
Onions Cutlets Recipe
Onions Cutlets Recipe (Getty Images)
  • కాగిన నూనెలో ప్రిపేర్​ చేసుకున్న కట్​లెట్స్​ను కాస్త గ్యాప్​ ఇచ్చి సెట్​ చేయాలి. ఇలా కడాయికి సరిపడా వేసినాక మంటను లో టూ మీడియం ఫ్లేమ్​లో పెట్టి కాల్చుకోవాలి.
  • ఓవైపు ఎర్రగా కాలినాక మరో వైపుకు తిప్పి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా చక్కగా ఫ్రై అయినాక తీసి ప్లేట్​లోకి వేసుకోవాలి.
  • మిగిలిన వాటిని కూడా ఇలానే వేయించుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసినాక సర్వింగ్​ ప్లేట్​లోకి తీసుకుని టమాటా కెచప్​ లేదా గ్రీన్​ చట్నీతో తింటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్​ కట్​లెట్స్​ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Onions Cutlets Recipe
Onions Cutlets Recipe (Getty Images)

చిట్కాలు:

  • ఉల్లిపాయలు పెద్దవి తీసుకోవాలి. అదే మీడియం సైజ్​లో ఉన్నవి అయితే మూడు తీసుకోవాలి.
  • మీరు కావాలనుకుంటే వీటిని డీప్​ ఫ్రై ద్వారా కూడా వేయించుకోవచ్చు.
  • ఇవి మరింత టేస్టీగా ఉండాలంటే ఆలూపై పొట్టు తీసుకుని తురుముకుని ఉల్లిపాయల్లో యాడ్​ చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది.
Onions Cutlets Recipe
Onions Cutlets Recipe (ETV Bharat)

కాల్చిన వంకాయతో కమ్మని "పెరుగు పచ్చడి" - సూపర్​ టేస్టీగా ఉంటుంది - అన్నం, దోసెల్లోకి అదుర్స్​!

బ్రేక్​ఫాస్ట్​లోకి అద్దిరిపోయే "సేమియా పులిహోర" - పావుగంటలోనే రెడీ! - టేస్ట్ సూపర్!