కమ్మని "నువ్వుల బొబ్బట్లు" - నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయి!
నువ్వులతో సింపుల్‌గా చేసుకునే బొబ్బట్లు - ఇలా చేసే అద్భుతంగా ఉంటుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 5:12 PM IST
Instant Nuvvula Bobbatlu in Telugu : బొబ్బట్లు లోపల స్టఫింగ్తో సాఫ్ట్‌గా ఉంటాయి. వీటిపైన కొద్దిగా నెయ్యి వేసి తింటే అమృతంలా ఉంటుంది! వీటినే పూరన్‌పోలీ, భక్ష్యాలు, ఒబ్బట్టు, పోలె అంటూ ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తారు. దీన్ని ఒక్కొక్కరు ఓ స్టైల్లో ప్రిపేర్ చేస్తారు. వీటిని ఎక్కువగా పెసరపప్పు, శనగపప్పు వంటి వాటితో తయారు చేస్తారు. అలా కాకుండా ఈసారి నువ్వులతో ఇలా ట్రై చేయండి. మామూలు వాటి కంటే ఎంతో టేస్టీగా ఉంటాయి. బిగినర్స్ కూడా ఈ పద్ధతిని పాటిస్తూ సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి నోరూరించే నువ్వుల బొబ్బట్లు ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
బ్రేక్‌ఫాస్ట్‌లోకి, సాయంత్రం స్నాక్ కోసం - మీల్మేకర్తో కరకరలాడించండి!

కావాల్సిన పదార్థాలు :
- గోధుమపిండి - 6 కప్పులు
- నువ్వులు - 4 కప్పులు
- బెల్లం తురుము - 4 కప్పులు
- నెయ్యి - 14 టీ స్పూన్లు
- యాలకులు - 8
- ఉప్పు - కొద్దిగా

తయారీ విధానం :
- ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో నాలుగు కప్పుల నువ్వులు వేయాలి. నువ్వులు దోరగా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి.
- అనంతరం మిక్సీజార్‌లో వేయించిన నువ్వులు, ఎనిమిది యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులోనే నాలుగు కప్పుల బెల్లం తురుము యాడ్ చేసి మధ్యమధ్యలో కలుపుతూ బాగా గ్రైండ్ చేయాలి.

- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఆరు కప్పుల గోధుమపిండి, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి. ఇందులోనే కొద్దికొద్దిగా నీళ్లను పోస్తూ పిండిని చపాతీ పిండి మాదిరిగా సాఫ్ట్‌గా కలపాలి. ఆపైన ఎనిమిది టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి మరోసారి బాగా మిక్స్ చేయాలి. అనంతరం మూతపెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కనుంచాలి.
- 15 నిమిషాల తర్వాత పిండిని మరోసారి బాగా కలిపి చిన్న చిన్న ఉండల్లా చేయాలి. అనంతరం చపాతీ పీటపై ఒక్కో ఉండను ఉంచి చపాతీ మాదిరిగా రోల్ చేయాలి. ఆపై దాని మధ్యలో ముందుగా రెడీ చేసుకున్న నువ్వులుబెల్లం ముద్దను ఉంచి సైడ్స్ మూయాలి. ఆ తర్వాత నెమ్మదిగా మరోసారి వీలైనంత పల్చగా కర్రతో చపాతీలాగా చేసుకోవాలి.

- అనంతరం స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చేయాలి. పాన్ వేడయ్యాక తయారు చేసుకున్న బొబ్బట్టును వేసి ఒక నిమిషం పాటు కాల్చుకోవాలి. ఆ తర్వాత మరోవైపు టర్న్ చేసి నెయ్యి అప్లై చేసి కాల్చుకోవాలి.
- రెండు వైపులా బాగా కాలిన అనంతరం బొబ్బట్లను ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.

- ఇక అంతే టేస్టీటేస్టీ నువ్వుల బొబ్బట్లు సిద్ధంగా ఉంటాయి!
- మీరు ఈ బొబ్బట్లను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకంటే గోధుమపిండి, నువ్వులతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకుంటే సరి.
శనగపిండితో "దోసెలు" - పప్పు రుబ్బే పని లేకుండానే అప్పటికప్పుడు రెడీ!
మసాలా ఘాటుతో అద్దిరిపోయే "మటన్ దో ప్యాజా" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

