Telangana Panchayat Elections Results2025

ETV Bharat / offbeat

ఇంటిల్లిపాదీ ఇష్టంగా తినే "దోసకాయ పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

నయా స్టైల్​లో నోరూరించే 'దోసకాయ పచ్చడి' - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా!

New Style Dosakaya Pachadi
New Style Dosakaya Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 17, 2025 at 5:42 PM IST

3 Min Read
Choose ETV Bharat

New Style Dosakaya Pachadi Recipe : కొన్ని రకాల పచ్చళ్లు ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే పచ్చడి కూడా అదే కోవకు చెందుతుంది. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ నెక్ట్స్​ లెవల్​లో ఉంటుంది. ఇది అన్నం, చపాతీ, రోటీల్లోకి మాత్రమే టిఫెన్స్​లోకి కూడా అద్దిరిపోయే రుచినిస్తుంది. అదే, కమ్మని "దోసకాయ పచ్చడి". మీరు ఇప్పటి వరకు అనేక విధాలుగా దోసకాయ పచ్చడిని ట్రై చేసి ఉంటారు. కానీ, ఓసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. ఒక్కసారి ఇలా చేశారంటే ఎప్పుడూ ఇదే స్టైల్​లో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ పచ్చడి పిల్లలకూ చాలా బాగా నచ్చేస్తుంది. అలాగే, ఈ రెసిపీని బిగినర్స్ కూడా పర్ఫెక్ట్ టేస్ట్​తో సింపుల్​గా రెడీ చేసుకోవచ్చు. మరి, తక్కువ పదార్థాలతో ఎక్కువ రుచికరంగా చేసుకునే ఈ దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

New Style Dosakaya Pachadi
దోసకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • దోసకాయలు - అరకిలో
  • నూనె - నాలుగైదు టీస్పూన్లు
  • మినప్పప్పు - రెండు టీస్పూన్లు
  • మెంతులు - అరటీస్పూన్
  • ఆవాలు - ఒక టీస్పూన్
  • ధనియాలు - రెండు టీస్పూన్లు
  • ఎండుమిర్చి - 30(రుచికి తగినన్ని)
  • వెల్లుల్లి రెబ్బలు - 15
  • జీలకర్ర - ఒక టీస్పూన్
  • చింతపండు - రెండు చిన్న నిమ్మకాయలంత

ఈ పద్ధతిలో "బీరకాయ పెసరపప్పు కూర" చేయండి - పిల్లలూ భలే ఇష్టంగా తింటారు!

New Style Dosakaya Pachadi
ఎండుమిర్చి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా తాజా దోసకాయలను పీలర్​తో చెక్కు తీసుకోవాలి. తర్వాత చెక్కు తీసిన వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నాలుగైదు టేబుల్​స్పూన్ల నూనె వేసుకోవాలి. ఆయిల్ లైట్​గా వేడయ్యాక మినప్పప్పు, మెంతులు, ఆవాలు, ధనియాలు వేసి లో ఫ్లేమ్​లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి.
  • అవి మంచిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చీలను వేసి వాటిని బాగా వేయించుకోవాలి.
New Style Dosakaya Pachadi
వెల్లుల్లి (Getty Images)
  • అవన్నీ చక్కగా వేగాయనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి అర నిమిషం కలుపుతూ వేయించాలి. తర్వాత పాన్​పై మూతపెట్టి ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • దోసకాయ ముక్కలను 60 నుంచి 70 శాతం వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి.
New Style Dosakaya Pachadi
చింతపండు (Getty Images)
  • అవి చల్లారేలోపు మిక్సీ జార్​లోకి తీసుకుని ఎండుమిర్చి మిశ్రమంలో రుచికి తగినంత ఉప్పు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, చింతపండును శుభ్రంగా కడిగి వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
  • తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆ మిశ్రమంలో మగ్గించి పెట్టుకున్న దోసకాయ ముక్కలను వేసి మరీ మెత్తగా కాకుండా రోట్లో రుబ్బకున్నట్లుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కనుంచాలి. అనంతరం పచ్చడిలోకి పోపును రెడీ చేసుకోవాలి.

ఘుమఘుమలాడే "గోంగూర వంకాయ కర్రీ" - ఇక విందు పసందే!

New Style Dosakaya Pachadi
ధనియాలు (Getty Images)

పోపు కోసం :

  • నూనె - నాలుగైదు టీస్పూన్లు
  • శనగపప్పు - ఒక టీస్పూన్
  • మినప్పప్పు - ఒక టీస్పూన్
  • ఆవాలు - ఒక టీస్పూన్
  • ఎండుమిర్చి - రెండు
  • కరివేపాకు - కొద్దిగా
  • పసుపు - అరటీస్పూన్
New Style Dosakaya Pachadi
పోపుదినుసులు (Getty Images)
  • తాలింపు కోసం స్టవ్ మీద దోసకాయలు వేయించుకున్న పాన్​నే ఉంచి నాలుగు టీస్పూన్ల నూనె వేసుకోవాలి.
  • ఆయిల్ వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి తుంపలు వేసి వేయించాలి.
  • అవన్నీ మంచిగా వేగాక చివర్లో పసుపు వేసి కలిపి, గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వి వేసి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు.
  • అంతే, సరికొత్త ఫ్లేవర్​తో నోరూరించే "దోసకాయ పచ్చడి" నిమిషాల్లోనే రెడీ అవుతుంది!
  • ఒకవేళ మీరు తక్కువ మొత్తంలో ఈ పచ్చడిని రెడీ చేసుకోవాలనుకుంటే దోసకాయలతో పాటు ఇతర పదార్థాలను తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.
  • అలాగే, ఎండుమిర్చి వద్దనుకుంటే వాటి ప్లేస్​లో రుచికి తగినన్ని పచ్చిమిర్చి తీసుకుని కూడా ఈ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు.

బెండకాయతో కరకరలాడే "ఫ్రైడ్ ఓక్రా" - పిల్లలకు సూపర్ స్నాక్!