ETV Bharat / offbeat

ఎన్నడూ ట్రై చేయని కొత్తరకం "టమాటా పచ్చడి" - తక్కువ టైమ్​లో ఎక్కువ రుచికరంగా!

- రెగ్యులర్ పచ్చళ్లను మించిన టేస్ట్ - ఒక్కసారి తింటే వన్స్​మోర్ అంటారంతే!

Tomato Pachadi New Style
Tomato Pachadi New Style (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 19, 2026 at 12:26 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tomato Pachadi New Style : వేడి వేడి అన్నంలో "టమాటా పచ్చడి" వేసుకుని తింటుంటే ఆ టేస్ట్​ నెక్ట్స్ లెవల్​లో ఉంటుంది. ఈ పచ్చడిని ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా ప్రిపేర్ చేస్తుంటారు. అయితే, ఎప్పుడూ చేసేవిధంగా కాకుండా ఈసారి కాస్త పద్ధతి మార్చి చూడండి. ఈ స్టైల్​లో "​టమాటా పచ్చడిని" ట్రై చేయండి. ఎన్నడూ తినని రుచిలో వావ్ అనిపిస్తుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ మళ్లీ మళ్లీ చేయమంటారు. అంతేకాదు, ఈ పచ్చడితో పక్కన ఎలాంటి కూరలూ లేకపోయినా నాలుగు ముద్దలు ఎక్కువే లాగిస్తారు. ఇది అన్నం, రోటీ, చపాతీతో పాటు టిఫెన్స్​లోకీ మంచి​ టేస్ట్​నిస్తుంది. మరి, లేట్ చేయకుండా ఘుమఘుమలాడే ఈ కొత్తరకం టమాటా పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Tomato Pachadi
టమాటాలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • టమాటాలు - కిలో
  • చింతపండు - 20 గ్రాములు
  • పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
  • కొత్తిమీర - రెండు చిన్నకట్టలు
  • వెల్లుల్లి రెబ్బలు - 15 నుంచి 20
  • జీలకర్ర - ఒక టీస్పూన్
  • మెంతులు - అర టీస్పూన్
  • ఆవాలు - రెండు టీస్పూన్లు
  • మినప్పప్పు - రెండు టేబుల్​స్పూన్లు
  • ధనియాలు - రెండు టీస్పూన్లు
  • తెల్ల నువ్వులు - రెండు టేబుల్​స్పూన్లు

పొడి పొడిగా జిగురు లేని "బెండకాయ వేపుడు" - క్యాటరింగ్ స్టైల్లో అద్దిరిపోతుంది!

Tomato Pachadi
చింతపండు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా ఒక చిన్న గిన్నెలో చింతపండును తీసుకుని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో నాలుగైదు చెంచాల నీళ్లు పోసి కాసేపు నానబెట్టుకోవాలి.
  • ఇక్కడ చింతపండును ఎక్కువ నీళ్లు వేసి నానబెట్టుకోవద్దు. ఎందుకంటే ఎక్కువ నీళ్లు వేసి నానబెడితే పచ్చడి పలుచగా అవుతుంది. అందుకే, వేసి వేయనట్టు కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి.
  • అది నానేలోపు తాజా టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో రెండు టేబుల్​స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మెంతులు, ఆవాలు, మినప్పప్పు, ధనియాలు వేసి వేయించుకోవాలి.
Tomato Pachadi
నువ్వులు (Getty Images)
  • అవి వేగాక తెల్లనువ్వులు వేసి వాటిని ఒక నిమిషం పాటు వేయించాలి. నువ్వులు వేగిన తర్వాత అందులో మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని పచ్చిమిరపకాయలను ముక్కలుగా తుంచి వేసుకుని కలుపుతూ బాగా ఫ్రై చేయాలి.
  • పచ్చిమిర్చి వేగి వాటిపై తెల్లని మచ్చలు ఏర్పడ్డాక ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • అనంతరం అదే పాన్​లో శుభ్రంగా కడిగి కాడలతో సహా లైట్​గా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి లో-ఫ్లేమ్​లో ఒక నిమిషం వేయించి ప్లేట్​లోకి తీసుకోవాలి.
Tomato Pachadi
పచ్చిమిర్చి (Getty Images)
  • నెక్ట్స్ అదే కడాయిలో మరో ఒకట్రెండు టేబుల్​స్పూన్ల నూనె వేసి కాస్త వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, రుచికి తగినంత రాళ్ల ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపి మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ నాలుగైదు నిమిషాలు మగ్గించుకోవాలి.
  • ఇక్కడ టమాటాలను మరీ మెత్తగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. కాస్త మెత్తబడే వరకు వాటర్ ఉండేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ విధంగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని కాస్త చల్లారినివ్వాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
Tomato Pachadi
కొత్తిమీర (Getty Images)
  • తర్వాత అందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న కొత్తిమీర, నానబెట్టుకున్న చింతపండు, ఉడికించుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకుని మరీ మెత్తగా కాకుండా రోట్లో రుబ్బినట్లుగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఈ పచ్చడిని పోపు లేకుండా అలాగే తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది.
  • ఒకవేళ పోపు కావాలనుకునే వారు స్టవ్ మీద చిన్న కడాయిలో రెండు టేబుల్​స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్ కాగిన తర్వాత అందులో ఒక టీస్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
Tomato Pachadi
వెల్లుల్లి (Getty Images)
  • అవి కాస్త వేగాక కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఇక చివరగా అరటీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు.
  • అంతే, సింపుల్ పద్ధతిలో సరికొత్త ఫ్లేవర్​తో నోరూరించే "టమాటా పచ్చడి" అప్పటికప్పుడు రెడీ అవుతుంది!
  • ఒకవేళ తక్కువ క్వాంటిటీలో పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలనుకునేవారు టమాటాలతో పాటు ఇతర పదార్థాలను తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.

పిల్లల లంచ్​ బాక్స్​ ఖాళీ అవ్వట్లేదా? - ఇలా "పొటాటో రైస్​" పెట్టండి - సూపర్​గా తింటారు!

పచ్చికొబ్బరి, పాలతో పసందైన "సొరకాయ కర్రీ" - తక్కువ మసాలాలతో నెవ్వర్ బిఫోర్ టేస్ట్!