సాయంత్రం కాగానే ఇంట్లోకి దోమలు వస్తున్నాయా? - ఇలా చేస్తే ఒక్కటి కూడా రావు!
మీ ఇంట్లో దోమల సమస్య ఉందా? - ఈ నేచురల్ టిప్స్‌తో గుడ్ రిజల్ట్ అంటున్న నిపుణులు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 12, 2026 at 9:11 AM IST
Natural Ways to Avoid Mosquitoes: ఈవెనింగ్ అయితే చాలు దోమలు గుంపులుగా వస్తుంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా మనుషులను పీల్చి పిప్పిచేస్తాయి. అందుకే వీటి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే వాటి నుంచి విడుదలయ్యే కెమికల్ వల్ల దోమలు పోవడం అటుంచితే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. మరి ఇవి వాడకుండా దోమల నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇందుకోసం కొన్ని నేచురల్ టిప్స్‌ను నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
కలబంద: మెజార్టీ పీపుల్ ఇంటి ఆవరణాల్లో కలబంద మొక్కలను విరివిగా పెంచుతుంటారు. అయితే జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే అలోవెరా దోమ కాటుకి ఔషధంలా పని చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. దోమ కుట్టిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాస్తే వెంటనే రిలిఫ్ దొరుకుతుందని తెలియజేస్తున్నారు.
పెప్పర్‌మెంట్ ఆయిల్ : ఇంటి నుంచి దోమలను తరిమి కొట్టేందుకు పెప్పర్‌మెంట్ ఆయిల్ ఉపయోగపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఇందుకోసం ఓ స్ప్రే బాటిల్లో వాటర్ పోసి అందులో కొన్ని చుక్కలు పెప్పర్‌మెంట్ నూనె వేయాలని ఒకవేళ ఇష్టమైతే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా కలిపి బాగా షేక్ చేసి స్ప్రే చేస్తే దోమల బెడద ఉండదని పేర్కొంటున్నారు.
వెల్లుల్లి రెబ్బలు : కూరల రుచిని పెంచేందుకు ఉపయోగించే వెల్లుల్లి కూడా దోమలను నివారిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. కొన్ని వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి, నెయ్యి లేదా నూనెతో పాటు కాస్తంత కర్పూరం వేసి వెలిగించుకుంటే ఆ పొగకు దోమలు నశిస్తాయని వివరిస్తున్నారు.
లావెండర్ నూనె : లావెండర్ నూనె దోమలను తరిమికొట్టేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ఇంట్లోని అన్ని రూమ్స్, ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో లావెండర్ ఆయిల్ స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుందని సూచిస్తున్నారు. ఇక దోమలు ఎక్కువగా ఉంటే లావెండర్ ఆయిల్‌ని కాళ్లు, చేతులకు రాసుకుంటే, దోమలు కూడా కుట్టవని పేర్కొంటున్నారు.
కర్పూరం: దాదాపుగా అందరి ఇండ్లలో కర్పూరం తప్పనిసరిగా ఉంటుంది. దీనితో దోమలను ఈజీగా తరిమికొట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం సాయంత్రం పూట తలుపులు, కిటీకీలు క్లోజ్ చేయాలని వివరిస్తున్నారు. అనంతరం కర్పూరం, వేపాకులు కలిపి పదిహేను నిమిషాల పాటు పొగ వేయాలంటున్నారు. ఇలా చేయడం వల్ల ఈ పొగకు దోమలు ఇంట్లోకి రావని పేర్కొంటున్నారు. ఒకవేళ వేపాకులు దొరక్కపోతే కర్పూరంతో పొగ వేసినా సరిపోతుందని సూచిస్తున్నారు.
సాంబ్రాణి : చిన్న పిల్లలకు వేసే సాంబ్రాణితో కూడా దోమలను నివారించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అరోమాల్యాంప్స్‌లో సాంబ్రాణి, కర్పూరం సహా వేప నూనె, వేసి పెట్టుకుంటే దోమల బెడద ఉండదని చెబుతున్నారు. పైగా రూమ్ ప్రెషనర్గానూ సూట్ అవుతుందని సూచిస్తున్నారు. వేప నూనె లేకపోతే లెమన్ గ్రాస్ నూనె, యూకలిప్టస్ ఆయిల్, లావెండర్ నూనె ఇలా మిగిలినవి వాడొచ్చని తెలియజేస్తున్నారు.
వేప నూనె : నీమ్ ఆయిల్ సహజ క్రిమి సంహారణిగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అరలీటర్ నీళ్లలో రెండు టీ స్పూన్ల వేప నూనె, ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి స్ప్రే చేస్తే కొద్దిసేపటి తర్వాత దోమలు నశిస్తాయని చెబుతున్నారు.
ష్యూరిటీ లేకుండా "రూ.10 లక్షలు" - "పీఎం విద్యాలక్ష్మి" స్కీం గురించి తెలుసా?
"జీవితంలో ఒక్కసారైనా చార్ధామ్ యాత్ర" - 'IRCTC' ఫ్లైట్ జర్నీ ప్లాన్ ఇదే!

