ETV Bharat / offbeat

సండే స్పెషల్​ "మటన్​ కీమా దమ్​ బిర్యానీ" - సూపర్​ టేస్ట్​తో టమ్మీ ఫుల్​ హ్యాపీ! - ప్రిపరేషన్​ ఈజీ!

- చికెన్​, మటన్​ బిర్యానీలు రొటీన్​​ - ఇలా కీమాతో బిర్యానీ చేసుకుంటే టేస్ట్​కు మైమరచిపోతారు!

How to Make Mutton Keema Dum Biryani
How to Make Mutton Keema Dum Biryani (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2026 at 8:32 PM IST

4 Min Read
Choose ETV Bharat

How to Make Mutton Keema Dum Biryani : బిర్యానీకి ఫ్యాన్​ బేస్​ ఓ రేంజ్​లో ఉంటుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ దీనికి ఫ్యానే. అందుకే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు లాగించేస్తుంటారు. ఇక బిర్యానీ అంటే మెజార్టీ పీపుల్​ చికెన్​, మటన్​, ఫిష్​, ప్రాన్స్​తో చేసినవి​ మాత్రమే తింటుంటారు. కానీ కీమాతో కూడా అద్దిరిపోయే దమ్​ బిర్యానీ చేసుకోవచ్చు. రెగ్యులర్​ బిర్యానీలతో పోలిస్తే దీని టేస్ట్ మరింత అద్భుతంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. కేవలం తక్కువ పదార్థాలతో తయారు చేసుకునే ఈ రెసిపీ తింటే టమ్మీ కూడా హ్యాపీ అయిపోతుంది. మరి లేట్​ చేయకుండా కమ్మని, టేస్టీ కీమా దమ్​ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేయండి.​

కావాల్సిన పదార్థాలు:

కీమా ఉడికించడానికి:

  • మటన్​ కీమా - 300 గ్రాములు
  • పసుపు - అర టీస్పూన్​
  • ఉప్పు - 1 టీస్పూన్​
  • కారం - 1 టీస్పూన్​
  • యాలకులు - 3
  • దాల్చినచెక్క - చిన్న ముక్క
  • లవంగాలు - 2

రైస్​ కుక్​ చేయడానికి:

  • బాస్మతీ బియ్యం - 1 గ్లాస్​(300 గ్రాములు)
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పచ్చిమిర్చి - 1
  • బిర్యానీ ఆకు - 1
  • యాలకులు - 2
  • లవంగాలు - 2
  • దాల్చినచెక్క - కొంచెం
  • నిమ్మరసం - అర చెక్క
  • నెయ్యి - 1 టీస్పూన్​
  • కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - అర టీస్పూన్​
Mutton Keema Dum Biryani
Mutton Keema Dum Biryani (Getty Images)

బిర్యానీ కోసం:

  • నూనె - 4 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయలు - 3
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • టమాటా - 1(పెద్దది)
  • పెరుగు - 3 టేబుల్​స్పూన్లు
  • ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • కారం - 1 టీస్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • గరం మసాలా - 1 టీస్పూన్​
  • పచ్చిమిర్చి - 2
  • కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
  • బిర్యానీ మసాలా - 1 టీస్పూన్​
  • నెయ్యి - 1 టేబుల్​స్పూన్​
Mutton Keema Dum Biryani
Mutton Keema Dum Biryani (Getty Images)

తయారీ విధానం:

  • ఓ గిన్నెలోకి బాస్మతీ బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి సరిపడా వాటర్​ పోసి గంట సేపు నానబెట్టాలి. బాస్మతీ ఎంత తీసుకుంటే కీమా అంత తీసుకోవాలి.
  • ఇప్పుడు ప్రెషర్​ కుక్కర్​లోకి మటన్​ కీమా, పసుపు, ఉప్పు, కారం, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, అర కప్పు నీళ్లు పోసి మూత ఉంచి విజిల్​ పెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కుక్కర్​ ఉంచి మీడియం ఫ్లేమ్​లో మూడు విజిల్స్​ వచ్చే వరకు ఉడికించి స్టవ్​ ఆఫ్​ చేసి పక్కన ఉంచాలి.
  • ఈలోపు పదార్థాలను రెడీ చేసుకోవాలి. అందుకోసం ఉల్లిపాయలపై పొట్టు తీసేసి సన్నగా, పొడుగ్గా కట్​ చేసుకోవాలి. పచ్చిమిర్చిలను కూడా సగానికి పొడుగ్గా చీల్చుకోవాలి. కొత్తిమీర, పుదీనాను సన్నగా కట్​ చేసుకోవాలి. టమాటాను మీడియం సైజ్​లో ముక్కలుగా కట్​ చేసి మిక్సీజార్​లోకి వేసి మెత్తని పేస్ట్​లా చేసుకోవాలి.
Mutton Keema Dum Biryani
Mutton Keema Dum Biryani (Getty Images)
  • స్టవ్​ ఆన్​ చేసి బిర్యానీ చేసుకోవడానికి అనువుగా ఉండే గిన్నె పెట్టి అందులో నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • కాగిన నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి లో టూ మీడియం ప్లేమ్​లో ఎర్రగా వేయించాలి. అంటే ఫ్రైడ్​ ఆనియన్స్​ మాదిరి వేయించాలి.
  • ఉల్లిపాయలు చక్కగా వేగాక సగం తీసి పక్కన ఉంచాలి. మిగిలిన ఆనియన్స్​లో అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయే వరకు మగ్గించాలి.
  • అల్లం కూడా మగ్గినాక గ్రైండ్​ చేసిన టమాటా పేస్ట్​ వేసి కలుపుతూ మగ్గించాలి. టమాటా పేస్ట్​ మగ్గి నూనె పైకి తేలినాక పెరుగు వేసి లో ఫ్లేమ్​లో మిక్స్​ చేసుకోవాలి.
Mutton Keema Dum Biryani
Mutton Keema Dum Biryani (Getty Images)
  • పెరుగు కూడా వేగి ఆయిల్​ సెపరేట్​ అయ్యాక ఉడికించిన కీమాను నీళ్లతో సహా వేసి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి అంతా కలిసేలా మిక్స్​ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్​లో 10 నిమిషాల పాటు మధ్యమధ్యలో కలుపుతూ కుక్​ చేసుకోవాలి.
  • కీమా ఉడికి అంటే నూనె పైకి తేలి గ్రేవీలాగా ఉన్నప్పుడు మూత పెట్టి గిన్నెను పక్కన ఉంచాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వొద్దు.
  • అదే స్టవ్​ మీద మరో గిన్నె పెట్టి 2 లీటర్ల నీరు పోసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, పచ్చిమిర్చి చీలికలు, బిర్యానీ ఆకు, నిమ్మరసం, నూనె, కొత్తిమీర, పుదీనా తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి కలిపి మరిగించాలి.
  • వాటర్​ మరుగుతున్నప్పుడు జల్లి గరిటెతో మసాలా దినుసులు, కొత్తిమీర తరుగు మొత్తం తీసేసి నానబెట్టుకున్న బాస్మతీ బియ్యాన్ని వేసి కలిపి ఉడికించాలి.
  • రైస్​ 90 శాతం అంటే బియ్యం ఉడికి లైట్​గా పలుకు ఉన్నప్పుడు స్టవ్​ ఆఫ్​ చేయాలి.
Mutton Keema Dum Biryani
Mutton Keema Dum Biryani (Getty Images)
  • ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కీమాలో కొద్దిగా తీసుకుని ఓ గిన్నెలోకి వేసుకోవాలి. మిగిలిన కీమాను గిన్నె మొత్తం స్ప్రెడ్​ అయ్యేలా సెట్​ చేసుకోవాలి.
  • ఆ కీమా మీద ఉడికించిన అన్నాన్ని సగం మేర లేయర్​గా వేసుకోవాలి. అనంతరం రైస్​ మీద పక్కన తీసిన కీమా, కొన్ని ఫ్రైడ్​ ఆనియన్స్​, కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకోవాలి.
  • మరోసారి ఆ కీమా మీద మిగిలిన రైస్​ను వేసుకుని స్ప్రెడ్​ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా తరుగు, ఫ్రైడ్​ ఆనియన్స్​, బిర్యానీ మసాలా, నెయ్యిని స్ప్రెడ్​ చేసుకోవాలి. చివరగా రైస్​ ఉడికించిన నీటిని ఓ పావు కప్పు అన్ని పోసి గిన్నెను సిల్వర్​ ఫాయిల్​తో క్లోజ్​ చేసుకోవాలి. కావాలంటే నేతిలో వేయించిన జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. అలాగే బిర్యానీ మంచి కలర్​లో కనిపించడానికి చిటికెడ్​ ఎల్లో ఫుడ్​ కలర్​ను కొన్ని నీళ్లలో కలిపి పోసుకుంటే సరి.
  • చివరగా దాని మీద మూత ఉంచి స్టవ్​ మీద పెట్టి లో ఫ్లేమ్​లో 15 నిమిషాల పాటు కుక్​ చేసుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • కాసేపటి తర్వాత మూత తీసి చూస్తే పొడిపొడిగా ఉండి సూపర్​ టేస్టీ అయిన మటన్​ కీమా దమ్​ బిర్యానీ రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్​ చేసుకుంటే సరి. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Mutton Keema Dum Biryani
Mutton Keema Dum Biryani (ETV Bharat)

అద్దిరిపోయే "చికెన్-గోంగూర బిర్యానీ" - ఇలా ప్రిపేర్ చేసుకోండి!

అద్దిరిపోయే "పొట్లం బిర్యానీ"! - ఇలా ఈజీగా తయారు చేయండి