మసాలా ఘాటుతో అద్దిరిపోయే "మటన్ దో ప్యాజా" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!
నోరూరించే మటన్ కర్రీ - ఇలా వండారంటే ముక్క మిగలదు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 10:28 AM IST
Mutton Do Pyaza : నాన్‌వెజ్ వంటకాల్లో మటన్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దీనితో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అందుకే మీకోసం ఇవాళ ఓ కొత్త రెసిపీని పరిచయం చేస్తున్నాం. అదే మటన్ దో ప్యాజా. ఇది స్పైసీ స్పైసీగా, కారంకారంగా ఉండి అన్నం, రోటీ, చపాతీ, పులావ్ ఇలా ఎందులోకైనా నెక్ట్స్ లెవల్ టేస్ట్‌నిస్తుంది. ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ ఒక మంచి రెసిపీని తిన్నామనే ఫీలింగ్ కలుగుతుంది. అలాగే దీని తయారీకి పెద్దగా టైమ్ కూడా పట్టదు. మరి నోరూరించే ఈ మటన్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?
పసందైన "పనీర్ పాయసం" - ఇంట్లోనే ఇలా తియ్యని వేడుక చేసుకోండి!

కావాల్సిన పదార్థాలు :
- మటన్ - ఒక కేజీ
- పెరుగు - ఒక కప్పు
- పచ్చిమిర్చి - 6
- ఉల్లిపాయలు - 8
- ఉప్పు - రుచికి సరిపడా
- టమోటా ప్యూరీ - 4 టేబుల్ స్పూన్లు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 4 స్పూన్లు
- కారం - 2 స్పూన్లు
- ధనియాల పొడి - 4 స్పూన్లు
- పసుపు - 1 స్పూన్
- గరం మసాలా - 1 స్పూన్
- జీలకర్ర పొడి - 1 స్పూన్
- బిర్యానీ ఆకులు - 4
- లవంగాలు - 8
- యాలకులు - 6
- ఆయిల్ - 6 టేబుల్ స్పూన్లు
- దాల్చినచెక్క - 1
- కొత్తిమీర తరుగు - అర కప్పు

తయారీ విధానం :
- ముందుగా గిన్నెలో కేజీ మటన్ వేసి శుభ్రంగా కడగాలి. అలాగే ఎనిమిది ఉల్లిపాయలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కావాల్సిన పరిమాణంలో కొత్తిమీరను తరిగి ఉంచాలి.
- ఇప్పుడు మ్యారినేట్ కోసం మిక్సింగ్ బౌల్లో కడిగి పెట్టుకున్న మటన్, రెండు స్పూన్ల కారం వేయాలి. అలాగే కప్పు పెరుగు, ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. అనంతరం మూతపెట్టి 30 నిమిషాల పాటు పక్కనుంచాలి.

- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్‌లో ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. నూనె వేడైన తర్వాత నాలుగు బిర్యానీ ఆకులు, ఒక దాల్చినచెక్క, ఆరు యాలకులు, ఎనిమిది లవంగాలు వేసి వేయించాలి.
- మసాలా దినుసులు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ వేగాక రెండు స్పూన్ల అల్లంవెల్లుల్లి పేస్ట్, ఆరు పచ్చిమిర్చి, నాలుగు టేబుల్ స్పూన్ల టమోటా ప్యూరీ వేసి బాగా మిక్స్ చేయాలి.
- అనంతరం మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మ్యారినేట్ చేసుకున్న మటన్ మిశ్రమం యాడ్ చేసి ఆరు నిమిషాల పాటు కలుపుతూ వేగనివ్వాలి.

- ఆరు నిమిషాల అనంతరం ఒక స్పూన్ జీలకర్ర పొడి, నాలుగు స్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి కలపాలి. అనంతరం మూతపెట్టి ఉడికించాలి.
- ఈ మిశ్రమం చక్కగా ఉడికాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, అర కప్పు కొత్తిమీర తరుగు యాడ్ చేసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- అంతే మటన్ దో ప్యాజా సిద్ధంగా ఉంటుంది!
- ఈ కర్రీ వేడివేడి అన్నంతో పాటు నాన్, కుల్చా, రోటీల్లోకి అద్దిరిపోతుంది.
చింతపండు లేకుండానే "చేపల పులుసు" - ఇలా చేసి తింటే జిందగీ ఖుష్ అయిపోద్ది!
కరకరలాడే "రవ్వ మురుకులు" - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

