బూందీ గరిటె లేకుండా "మోతీచూర్ లడ్డూలు" - దీపావళికి చేసుకోండి, ఇట్టే నచ్చేస్తాయి!
-స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ - చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు!

Published : October 14, 2025 at 8:41 PM IST
Motichur Laddu Recipe : "మోతీచూర్ లడ్డూ" పేరు చెప్పగానే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది స్వీట్ లవర్స్‌కు. బర్త్‌డే, మ్యారేజ్ డే వంటి రోజుల్లో తినాలనిపించినప్పుడు స్వీట్ షాప్స్‌కు వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా దీపావళి పండక్కి చాలా మంది స్వీట్ షాప్స్‌కు వెళ్లి ఈ స్వీట్‌ను కొనుగోలు చేస్తుంటారు. కానీ మీకు తెలుసా స్వీట్‌షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూని ఇంట్లోనే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా బూందీ గరిటెతో పని లేకుండా చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా స్వీట్ షాప్‌లో అమ్మే దానికి ఏమాత్రం తీసిపోదు. మరి, లేట్ చేయకుండా అందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:
- శనగపప్పు - 2 కప్పులు
- నెయ్యి - సరిపడా
- జీడిపప్పు పలుకులు - కొన్ని
- కిస్మిస్లు - కొన్ని
- పుచ్చపప్పు - కొన్ని
- పంచదార - 2 కప్పులు
- యాలకుల పొడి - అర టీస్పూన్
- ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు

తయారీ విధానం:
- మిక్సింగ్ బౌల్లోకి శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా వాటర్ పోసి సుమారు మూడు నాలుగు గంటల పాటు నానబెట్టాలి.
- పప్పు నానిన తర్వాత నీటిని పూర్తిగా వంపేసి జల్లి గిన్నెలో వేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి.
- 5 నిమిషాల తర్వాత నానిన పప్పును మిక్సీజార్‌లోకి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత గ్రైండ్ చేసిన పిండిని చిన్న చిన్న బాల్స్‌గా వేసుకోవాలి.
- కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి లైట్‌గా కలర్ మారే వరకు వేయించుకోవాలి.

- పునుగులు వేగి నూనె మీద బుడగలు తగ్గిన తర్వాత తీసేసి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండి మొత్తాన్ని ఇలానే వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి.
- ఈ పునుగులు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీజార్‌లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన బూందీని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి పాన్ పెట్టి 1 టేబుల్‌స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కాగిన నెయ్యిలో జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి.
- జీడిపప్పులు లైట్‌గా కలర్ వేగిన తర్వాత కిస్మిస్లు వేసి రెండింటిని దోరగా వేయించుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
- అదే పాన్‌లోకి పంచదార వేసి అరకప్పు వాటర్ పోసి కరిగించుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత జిగురు పాకం వచ్చేవరకు మరిగించుకోవాలి.

- పాకం వచ్చిన తర్వాత ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. పాకంలోకి గ్రైండ్ చేసిన బూందీ మిశ్రమం వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం మంటను సిమ్‌లో పెట్టి బూందీ మొత్తం పాకాన్ని పీల్చుకుని దగ్గరపడే వరకు కలుపుతూ ఉడికించాలి. ఈ క్రమంలో యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి కుక్ చేసుకోవాలి.
- లడ్డూ మిశ్రమం చక్కగా పాకంలో కలిసి దగ్గరపడి పాన్‌కు అంటుకోకుండా సెపరేట్ అయిన తర్వాత వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచాలి.
- బూందీ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఓసారి కలిపి చేతికి నెయ్యి రాసుకుని కొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. తర్వాత వీటిని తేమలేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండి, నోట్లో వేసుకోగానే కరిగిపోయే మోతీచూర్ లడ్డూలు రెడీ.

చిట్కాలు:
- గ్రైండ్ చేసిన శనగపప్పును బాల్స్‌లాగా నూనెలో వేసినప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. కాస్త లైట్‌గా కలర్ మారి నూనెలో బుడగలు తగ్గినప్పుడు తీసేయాలి.
- వేయించుకున్న బాల్స్‌ను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే వేడి మీద గ్రైండ్ చేస్తే మిశ్రమం ముద్దలాగా అవుతుంది. చల్లారిన తర్వాత అయితే పొడిపొడిగా ఉండి లడ్డూలు చూడటానికే కాదు, తినడానికీ బాగుంటాయి.
- గ్రైండ్ చేసుకున్న బూందీ మిశ్రమాన్ని మరీ ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. ఎందుకంటే చాలా సేపు ఉడికిస్తే డ్రైగా అయిపోతుంది. దాంతో మనకి మోతీచూర్ లడ్డూ సాఫ్ట్‌గా రావని గుర్తుంచుకోవాలి.
చుక్క నూనె లేకుండానే - కరకరలాడే "పోహా కట్లెట్స్" - పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి!
దీపావళి స్పెషల్ "డ్రైఫ్రూట్స్ బర్ఫీ" - పంచదార, బెల్లం అవసరం లేదు - టేస్ట్ వేరే లెవల్!

