ETV Bharat / offbeat

కరకరలాడే "పెసర పునుగులు" - ఇంట్లోనే స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ పక్కా!

పెసర్లతో సింపుల్​గా చేసుకునే స్నాక్ రెసిపీ - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

pesara-punugulu
pesara-punugulu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 10, 2026 at 5:23 PM IST

2 Min Read
Choose ETV Bharat

Pesara Punugulu Recipe : పెసర్లతో దోసె, గారెలు లాంటివి ప్రిపేర్ చేస్తుంటారు. ఇందులో పెసర పునుగులు కూడా ఒకటి. వీటిని బండ్ల మీద తిన్నప్పుడు చాలా రుచికరంగా ఉండి తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. కానీ ఇవి ఇంట్లో చేసినప్పుడు మాత్రం ఆ స్టైల్లో రావడం లేదని కొందరు మదన పడుతుంటారు. అలాంటివారు ఓసారి ఈ పద్ధతిలో పునుగులు చేశారంటే సేమ్ బయట తిన్నట్టుగానే వస్తాయి. కొత్తగా చేసే వారు కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ ఈజీగా చేయొచ్చు. ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ స్నాక్​గా మారుతుంది. మరి ఇక లేట్​ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో? ఇప్పుడు చూద్దాం.

హరియాణా స్టైల్ గరం గరం "బేసన్ మసాలా రోటీలు" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా!

Pesara Punugulu
పెసర్లు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • పొట్టు పెసరపప్పు - ఒక కప్పు
  • పచ్చిమిర్చి - 3
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • అల్లం ముక్కలు - కొద్దిగా
  • బేకింగ్ సోడా - అర టీ స్పూన్
  • కరివేపాకు - కొంచెం
  • ఆయిల్ - డీప్ ఫ్రైకి సరిపడా
Pesara Punugulu
పచ్చిమిర్చి (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా కప్పు పొట్టు పెసరపప్పును గిన్నెలో వేసి సరిపడా నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసి నాలుగు గంటల పాటు నానబెట్టాలి.
  • నాలుగు గంటల తర్వాత మిక్సీజార్​లో నానబెట్టిన పెసరపప్పు, మూడు పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు, ఒక అల్లం ముక్క, కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
Pesara Punugulu
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసుకున్న పెసరపిండి, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఆరు నిమిషాల పాటు బాగా కలపాలి.
  • అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయికి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె బాగా కాగిన తర్వాత చేతిని తడి చేసి పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ పునుగుల మాదిరిగా వేయాలి.
  • ఆ తర్వాత పునుగులను రెండు వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేగనివ్వాలి. అనంతరం వీటిని ప్లేట్​లో వేయాలి. పొట్టు పెసరపప్పును వాడడం వల్ల ఆయిల్ కూడా తక్కువగానే పీలుస్తాయి!
  • అంతే స్ట్రీట్ స్టైల్ పెసర పునుగులు సిద్ధంగా ఉంటాయి!
Pesara Punugulu
కరివేపాకు (Getty Images)
  • ఈ పునుగులను పల్లీ లేదా టమోటా చట్నీ లేదా అల్లం చట్నీతో తింటే సూపర్​గా ఉంటుంది.
  • మీరు ఈ పునుగులను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే పొట్టు పెసరపప్పుతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
  • మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఓసారి ట్రై చేయండి.

పక్కా కొలతలతో "దొండకాయ పచ్చడి" - గ్రైండ్ చేయకుండా మక్కలు కలపడమే!

కారంగా, కమ్మగా "ఎండు మిర్చి నిల్వ పచ్చడి" - చింతపండు, ఉప్పు, నూనె పక్కా కొలతలివే!