ETV Bharat / offbeat

అద్దాలపై దుమ్ము, ధూళి పేరుకుపోయిందా? - ఈ టిప్స్​ పాటించి క్లీన్​ చేసుకుంటే కొత్తదానిలా!

-ఇంట్లో అద్దాలు వాడుతున్నారా? - ఇలా క్లీన్​ చేసుకుంటే ఇబ్బంది ఉండదంటున్న నిపుణులు!

Mirror Cleaning Tips in Telugu
Mirror Cleaning Tips in Telugu (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2026 at 5:21 PM IST

2 Min Read
Choose ETV Bharat

Mirror Cleaning Tips in Telugu: ప్రతి ఇంట్లో ఒక అద్దం కచ్చితంగా ఉంటుంది. ఇక నేటి రోజుల్లో అయితే చాలా మంది బెడ్​రూమ్​, బాత్‌రూమ్, లివింగ్ రూమ్ అంటూ ఆయా గదుల్లో ఒకటికి మించి అద్దాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటిని అమర్చిన కొత్తలో ఎంతో నీట్​గా ఉంటాయి. కానీ వాడుతున్న క్రమంలోనే దుమ్ము, ధూళీ చేరడంతో పాటు అక్కడక్కడ నీళ్ల మరకలూ ఉంటాయి. ఇక ఈ మరకలు తొలగించి వీటిని మెరిపించేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పెద్దగా ఫలితం ఉండదు. ఈ క్రమంలోనే అద్దాలను మెరిపించాలంటే కొన్ని చిట్కాలు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

షేవింగ్‌ క్రీమ్‌తో: వేడినీటితో స్నానం చేశాక బాత్‌రూమ్‌లోని అద్దంపై పొగమంచులా ఒక పొర ఏర్పడుతుంది. ఇలా క్రమక్రమంగా జరగడం వల్ల నీటి మరకలు ఏర్పడుతుంటాయి. అయితే ఈ మరకలు ఓ పట్టాన పోవంటున్నారు నిపుణులు. ఇలా జరగకుండా ఉండాలంటే గడ్డం తీయడానికి ఉపయోగించే షేవింగ్​ క్రీమ్​ పనికొస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే స్నానానికి ముందే బాత్రూమ్​లోని అద్దంపై షేవింగ్ క్రీమ్‌ను సన్నటి లేయర్​గా అప్లై చేయాలి. స్నానం చేసినాక పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచేస్తే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. ఈ టిప్ కేవలం స్నానాల గదిలో అద్దాలకు మాత్రమే కాకుండా కార్ల అద్దాలు, గ్లాస్ కిటికీలు వంటివి శుభ్రం చేయడానికీ ఉపయోగించవచ్చంటున్నారు నిపుణులు.

డిస్టిల్డ్ వాటర్: ఇంట్లోని అద్దాన్ని శుభ్రం చేయడానికి చాలా మంది నార్మల్​ నీటిని ఉపయోగిస్తుంటారు. అయితే వీటిపై ఏర్పడిన దుమ్మును పోగొట్టడానికి డిస్టిల్డ్ వాటర్‌ని ఉపయోగించడం మంచిదంటున్నారు. ఈ వాటర్​తో తుడవడం వల్ల అద్దంపై ఉండే మరకలు, దుమ్ము, ధూళి తొలగిపోతాయని.. దీంతో అద్దం కొత్తదానిలా మెరుస్తుందని చెబుతున్నారు.

బేకింగ్ సోడాతో: వంటల్లో వాడే బేకింగ్​ సోడాతో అద్దంపై పడిన జిడ్డు మరకలను ఈజీగా తొలగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం స్పాంజి లేదా ఒక శుభ్రమైన క్లాత్​ను బేకింగ్ సోడాలో ముంచి అద్దంపై నిధానంగా రుద్దాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు చల్లి మరో శుభ్రమైన గుడ్డతో తుడిచేస్తే అద్దంపై ఉన్న మొండి మరకలన్నీ తొలగిపోయి తళతళా మెరిసిపోతుందంటున్నారు.

తెల్లటి పేపర్‌తో: మూడు నాలుగు తెల్లటి పేపర్లను ఉండలుగా చుట్టి, నీటితో తడిపి.. అద్దంపై నెమ్మదిగా, గుండ్రంగా పై నుంచి కింది వరకు రుద్దుతుంటే అద్దంపై పడిన మరకలు తొలగిపోయే అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాకుండా వెనిగర్, నీరు కలిపిన మిశ్రమాన్ని ముందుగా అద్దంపై స్ప్రే చేసి.. తర్వాత దాన్ని పేపర్‌తో శుభ్రం చేసినా సరిపోతుందని చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు న్యూస్ పేపర్‌ని వాడుతుంటారు. కానీ తడి వల్ల న్యూస్​ పేపర్​కు ఉన్న ఇంక్ అద్దానికి అంటుకొని మరిన్ని మరకలయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి మిర్రర్​ క్లీనింగ్​ కోసం తెల్లటి పేపర్ ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే అద్దం మూలల్ని కాటన్‌ స్వాబ్స్‌, మృదువైన టూత్‌బ్రష్‌తో శుభ్రం చేయాలంటున్నారు నిపుణులు.

ఫ్రిడ్జ్​లో పాలు, పెరుగు నిల్వ చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే త్వరగా పాడైపోతాయి!

"ఐ లైనర్"​ పెట్టుకున్న కొద్దిసేపటికే చెరిగిపోతుందా? - ఈ టిప్స్​ పాటిస్తే గంటల పాటు నిలుస్తుంది!