ETV Bharat / offbeat

సిసలైన "మిరియాల చారు"! - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోవాల్సిందే!

- ఈ పద్ధతిలో 'మిరియాల చారు' చేయండి - ఘాటు ఘాటుగా, భలే రుచిగా!

Miriyala Charu Recipe
Miriyala Charu Recipe (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : October 23, 2025 at 3:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

Miriyala Charu Recipe : వెదర్ కూల్​గా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఘాటుఘాటుగా ఏదైనా రసం పోసుకుని తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ సూపర్​గా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్​లో ఎక్కువ మందిని జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తరుచూ ఇబ్బంది పెడుతుంటాయి. దాంతో ఏమి తిన్నా నోటికి అంత టేస్టీగా అనిపించదు. ఈ క్రమంలోనే చాలా మంది రకరకాల రసం రెసిపీలు ట్రై చేస్తుంటారు. అందులో భాగంగానే కొంతమంది "మిరియాల రసం" చేసుకుంటుంటారు.

కానీ, అంత పర్ఫెక్ట్​గా కుదరదు. అలాంటి వారు ఓసారి ఈ పద్ధతిలో మిరియాల చారు చేసుకుని చూడండి. మంచి రుచికరంగా ఉండి వేడివేడిగా అద్దిరిపోతుంది. చల్లని వేళ ఘాటు ఘాటుగా గొంతులోకి పోతుంటే ఆ కిక్కే వేరబ్బా అనుకోవాల్సిందే! రుచి మాత్రమే కాదు.. జలుబు, దగ్గు, గొంతునొప్పి సమస్యల నుంచి కూడా రిలీఫ్ లభిస్తుంది. పైగా దీన్ని చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు సింపుల్​గా రెడీ చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారైనా ఈ కొలతలతో కమ్మగా చేసుకోవచ్చు. మరి, ఈ హెల్దీ అండ్ టేస్టీ మిరియాల చారుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Miriyala Charu Recipe
మిరియాలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • మిరియాలు - ఒక చెంచా
  • వెల్లుల్లి రెబ్బలు - పది
  • జీలకర్ర - ఒక చెంచా
  • చింతపండు - నిమ్మకాయంత
  • టమాటా - ఒకటి
  • నూనె - చెంచా
  • పసుపు - పావుచెంచా
  • ఎండుమిర్చి - మూడు
  • ఆవాలు - పావుచెంచా
  • కరివేపాకు - రెండు రెబ్బలు
  • కొత్తిమీర తరుగు - రెండు చెంచాలు
  • ఉప్పు - రుచికి తగినంత
  • ఇంగువ - పావుచెంచా

చల్లని వేళ కరకరలాడే "పనీర్-కార్న్ వడలు" - తక్కువ టైమ్​లో అప్పటికప్పుడు రెడీ!

Miriyala Charu Recipe
టమాటాలు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ సింపుల్ అండ్ టేస్టీ చారు తయారీకి ముందుగా ఒక గిన్నెలో చింతపండును తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆపై అందులో అరలీటర్ మంచి నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి.
  • చింతపండు నానేలోపు మిక్సీ జార్ తీసుకుని అందులో మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసుకుని వీటన్నింటిని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
  • ఇప్పుడు మంచిగా నానిన చింతపండు నుంచి రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
Miriyala Charu Recipe
చింతపండు (Getty Images)
  • అనంతరం చారు తయారీకి స్టవ్ మీద కాస్త మందంగా ఉండే గిన్నె పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత అందులో ఆవాలు, పసుపు, ఎండుమిర్చి వేసి వేయించాలి.
  • అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి మెత్తగా మగ్గనివ్వాలి. టమాటాలు మంచిగా మగ్గిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసి బాగా కలిపి మరిగించుకోవాలి.
  • ఆ మిశ్రమం బాగా వేడెక్కి మరుగుతున్నప్పుడు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరియాలు-వెల్లుల్లి మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
Miriyala Charu Recipe
మసాలా దినుసులు (Getty Images)
  • అలాగే, రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు, సన్నని కొత్తిమీర తరుగు, ఇంగువ వేసి కలిపి బాగా మరిగించి దింపేసుకుంటే చాలు.
  • అంతే, ఘాటు ఘాటుగా ఘుమాయించే కమ్మని "మిరియాల చారు" నిమిషాల్లోనే రెడీ అవుతుంది!
  • మరి, నచ్చితే మీరు ఎప్పుడూ చేసుకునే టమాటా రసం, చింతపండు రసం వంటివి కాకుండా ఓసారి ఇలా 'మిరియాల రసం' చేయండి. చల్లని వేళ ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు.
Miriyala Charu Recipe
వెల్లుల్లి (Getty Images)

కమ్మని "ఉసిరికాయ రోటి పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అమృతమే - అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

చింతపండు రసంతో "ఉల్లిపాయ కర్రీ" - వేడివేడి అన్నంలోకి అదుర్స్!