"అనకాపల్లి-సోలాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఇక రెగ్యులర్" - రైలు వేళలు, ఆగే స్టేషన్ల వివరాలివే!
అనకాపల్లి-సోలాపూర్ వీక్లీ రెగ్యులర్ చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్! - మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ ప్రజలకు మేలు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 21, 2026 at 4:29 PM IST
Anakapalle To Solapur Express : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో రైల్వే మంత్రిత్వ శాఖ 'సోలాపూర్ - అనకాపల్లి - సోలాపూర్' వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులర్ చేస్తూ ఆమోదం తెలిపింది. దీంతో ఇన్నాళ్లూ వారాంతంలో ప్రయాణిస్తున్న ఈ ప్రత్యేక రైలు ఇకపై రెగ్యులర్ కానుంది. ఈ ట్రైన్ పాత నంబర్ 01477/01478 కాగా, కొత్తగా 'సోలాపూర్ -అనకాపల్లి - సోలాపూర్' వీక్లీ ఎక్స్‌ప్రెస్ నం. 11313/11314 గా నడపనున్నారు. రెగ్యులర్ చేసిన నేపథ్యంలో స్టేషన్లు, వేళల వివరాలను ప్రకటించింది. ఈ రైలు కలబురగి, గుంతకల్, అనంతపూర్, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి వంటి ప్రధాన స్టేషన్లతో పాటు మరికొన్ని స్టేషన్లలో నిలవనుంది.
ట్రైన్ నంబర్ 11313 'సోలాపూర్ టు అనకాపల్లి' ప్రతి శుక్రవారం సోలాపూర్ (మహారాష్ట్ర)లో ఉదయం 9.20 గంటలకు బయల్దేరుతుంది. మహారాష్ట్రలోని అకల్ కోట్ రోడ్, దుధాని స్టేషన్ల మీదుగా ప్రయాణించి కర్ణాటకలోని గణగాపూర్ రోడ్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్ మీదుగా మధ్యాహ్నం 2.28 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయం రోడ్ స్టేషన్ చేరుకుంటుంది. 2 నిమిషాల అనంతరం తిరిగి అక్కడ బయల్దేరి ఆదోని, గుంతకల్, అనంతపూర్, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల మీదుగా రాత్రి 11.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి మీదుగా ప్రయాణించి ఉదయం 7గంటలకు విజయవాడ జంక్షన్ చేరుతుంది. ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామల్కోట్, అన్నవరం, ఎలమంచిలి మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 2.40గంటలకు అనకాపల్లి చేరుతుంది.
'వందే భారత్ స్లీపర్' వచ్చేస్తోంది! - విశాఖ టు బెంగళూరు మధ్య ప్రయాణం!
ట్రైన్ నంబర్ 11314 'అనకాపల్లి టు సోలాపూర్' ప్రతి శనివారం అనకాపల్లిలో సాయంత్రం 5.35 గంటలకు బయల్దేరుతుంది. అర్ధరాత్రి విజయవాడ, ఉదయం 7 గంటలకు తిరుపతి, మర్నాడు అర్ధరాత్రి 11.50గంటలకు సోలాపూర్ చేరుతుంది. ఈ రైలులో 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయి.
చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ వీక్లీ
ఇక ఈ నెల 25న చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ వారాంతపు రైలును నడపనున్నట్లు సీపీఆర్ఓ వెల్లడించారు. 25న రాత్రి 8.30గంటలకు చర్లపల్లిలో బయల్దేరి మర్నాడు ఉదయం 12.45గంటలకు శ్రీకాకుళం రోడ్ స్టేషన్ చేరుకుంటుందని తెలిపారు. ఇక 26న మధ్యాహ్నం 1.30గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి మర్నాడు ఉదయం 8.30గంటలకు చర్లపల్లి స్టేషన్ చేరుకుందని వెల్లడించారు.
రైళ్లలో లగేజీ ఎంత తీసుకెళ్తున్నారు? - "రైల్వే కొత్త రూల్" మీకు తెలుసా?
దేశంలోనే అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఇదే! - ఈ ట్రైన్ స్పీడ్ తెలిస్తే షాక్ అవుతారు!

