ETV Bharat / offbeat

బార్లీతో పసందైన "తల్బినా" - నిమిషాల్లోనే రెడీ - టేస్ట్ అమోఘం!

బార్లీ గింజలతో సింపుల్​గా చేసుకునే రెసిపీ - నోటికి కొత్త రుచిని అందిస్తుంది!

Talbeena
Talbeena (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 1:58 PM IST

2 Min Read
Choose ETV Bharat

Talbeena Recipe Prepare in Telugu : ఇండ్లలో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అయినా పిల్లలు, పెద్దలు ఎదైనా కొత్తది చేయమని అడుగుతుంటారు. అందుకే ఇవాళ మీకోసం ఓ రెసిపీ తీసుకొచ్చాం. అదే మధ్య ప్రాచ్య దేశాల్లో ఫేమస్ అయినా తల్బినా. ఈ పద్ధతిని పాటిస్తూ దీనిని ఇంట్లో చేశారంటే సూపర్​గా వస్తుంది. అంతేకాక నిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ అవుతుంది.

ఇలా చేసి పెడితే ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. అదేవిధంగా బంధువులు లేదా స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి వారికి సర్​ప్రైజ్ ఇవ్వండి. ఇది బ్రేక్​ఫాస్ట్​గానూ, స్నాక్​గానూ, స్వీట్​గానూ అద్దిరిపోతూ నోటికి కొత్త రుచినిస్తుంది. మరి నోరూరించే టేస్టీటేస్టీ తల్బినా చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఇంట్లో "రాగి పిండి" ఉంటే చాలు - అప్పటికప్పుడు ఇలా మీకు నచ్చిన టిఫిన్ చేసేయండి!

Talbeena
బార్లీ గింజలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బార్లీ గింజలు - అర కప్పు
  • పాలు - 1 లీటర్
  • జీడిపప్పు - 1 టేబుల్ స్పూన్
  • బాదం - 1 టేబుల్ స్పూన్
  • ఖర్జూరం - 1 టేబుల్ స్పూన్
  • కుంకుమ పువ్వు - రెండు చిటికెడ్లు
  • తేనె - కొద్దిగా
Talbeena
పాలు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా గిన్నెలో అర కప్పు బార్లీ గింజలు వేసి కడగాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
  • మరుసటి రోజు ఉదయం స్టవ్ ఆన్ చేసి గిన్నెలో లీటర్ పాలు పోయాలి. మిల్క్ మరుగుతున్నప్పుడు నానబెట్టిన బార్లీని వేసి అర గంట సేపు ఉడికించాలి.
Talbeena
ఖర్జూరం (Getty Images)
  • బార్లీ గింజలు ఉడికిన తర్వాత రెండు చిటికెడ్ల కుంకుమపువ్వు వేయాలి. ఇందులో కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, ఖర్జూరం ముక్కలు వేసి ఒక నిమిషం పాటు మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మాషర్​తో ఈ మిశ్రమాన్ని మాష్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లో వేసి పైన బాదం, జీడిపప్పు ముక్కలు, ఆ పైన కొద్దిగా తేనె వేసి సర్వ్ చేసుకోవాలి.
Talbeena
డ్రైఫ్రూట్స్ (Getty Images)
  • ఇక అంతే టేస్టీటేస్టీ తల్బినా తయారైనట్లే!
  • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది! మరి మీకు ఈ రెసిపీని నచ్చితే ఓసారి ట్రై చేయండి.
  • మీరు తల్బినాను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే బార్లీ గింజలు పాలతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

గోధుమపిండితో "మైసూర్ బోండాలు" - ఒక్కసారి తింటే 'వన్స్​మోర్' అంటారంతే!

"చలికాలం స్పెషల్ రెసిపీ" - నోట్లో వేసుకోగానే కరిగిపోయే కట్టు పొంగలి!