ETV Bharat / offbeat

నోటికి కొత్త రుచినిచ్చే "టమోటా మెంతి సోయా కర్రీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్​గా చేసేయొచ్చు!

మెంతికూర, టమోటా, సోయాతో సింపుల్​గా చేసుకునే కర్రీ - రోటీ, చపాతీ, రైస్​లోకి అదుర్స్!

tomato-methi-soya_recipe
tomato-methi-soya_recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 16, 2026 at 11:59 AM IST

|

Updated : February 16, 2026 at 4:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tomato Menthi Soya Curry : టమోటాలను వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. వీటితో పచ్చడి లేదా పప్పు, రసం చేస్తారు. అలాగే ఇతర పదార్థాలతో కలిపి కాంబినేషన్ కర్రీలు చేస్తుంటారు. అందుకే ఇవాళ మీకోసం ఓ కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే టమోటా మెంతి సోయా కర్రీ. ఇప్పుడు చెప్పబోయే పద్ధతిని పాటిస్తూ దీనిని చేశారంటే తిన్నవారు సూపర్ అనాల్సిందే. కొత్తగా చేసేవారు కూడా ఈ స్టెప్స్​ పాటిస్తే ఫర్పెక్ట్​గా వస్తుంది. అంతేకాక రైస్​, పులావ్, చపాతీ, రోటీల్లోకి అద్దిరిపోతుంది. మరి ఈ రెసిపీ చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఘుమఘుమలాడే "మెంతికూర పచ్చడి" - కమ్మగా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది!

Tomato Methi Soya Curry
సోయా గ్రాన్యూల్స్ (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • సోయా గ్రాన్యూల్స్ - పావు కప్పు
  • ఆయిల్ - 5 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర - అర టీ స్పూన్
  • కరివేపాకు - కొద్దిగా
  • పచ్చిమిర్చి - 2
  • ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
  • మెంతికూర - 2 కప్పులు
  • టమోటాలు - 5
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
  • కారం - 1 టేబుల్ స్పూన్
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్
  • పసుపు - అర టీ స్పూన్
  • జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
  • కొత్తిమీర - కొద్దిగా
  • గరం మసాలా - పావు టీ స్పూన్
Tomato Methi Soya Curry
మెంతికూర (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా గిన్నెలో పావు కప్పు సోయా గ్రాన్యూల్స్​, సరిపడా వేడి నీళ్లు పోసి 15 నిమిషాల పాటు ఉడికించాలి. పదిహేను నిమిషాల తర్వాత సోయా గ్రాన్యూల్స్​ను నీరు లేకుండా గట్టిగా పిండి ప్లేట్​లో వేయాలి.
  • అలాగే కావాల్సిన పరిమాణంలో మెంతికూర, ఉల్లిపాయలు, ఐదు టమోటాలు, రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీజార్​లో కొన్ని టమోటా ముక్కలు వేసి మిక్సీ పట్టాలి.
Tomato Methi Soya Curry
టమోటాలు (Getty Images)
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత సోయా గ్రాన్యూల్స్​ వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత వీటిని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇదే కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయిన అనంతరం అర టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి.
  • ఇందులోనే కప్పు ఉల్లిపాయ తరుగు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఆనియన్స్​ను ఎనిమిది నిమిషాల పాటు మగ్గించాలి.
Tomato Methi Soya Curry
అల్లంవెల్లుల్లి, ఉల్లిపాయలు (Getty Images)
  • ఆనియన్స్ మగ్గాక రెండు కప్పుల మెంతికూర తరుగు యాడ్ చేసి 8 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఎనిమిది నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
  • ఈ మిశ్రమం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి. అదేవిధంగా అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు కప్పు నీరు పోసి కలుపుతూ ఆయిల్ సేపరెట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
Tomato Methi Soya Curry
కారం (Getty Images)
  • ఆయిల్ పైకి తేలిన తర్వాత గ్రైండ్ చేసుకున్న టమోటా పేస్ట్ వేసి కలిపి ఎనిమిది నిమిషాల పాటు వేగనివ్వాలి. అనంతరం వేయించిన సోయా గ్రాన్యూల్స్, ఒక కప్పు నీళ్లు, కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసి కలపాలి. అనంతరం మూతపెట్టి 8 నిమిషాల పాటు మగ్గించాలి.
  • ఎనిమిది నిమిషాల అనంతరం కొద్దిగా కొత్తిమీర తరుగు, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే ఘుమఘుమలాడే టమోటా మెంతి సోయా కర్రీ సిద్ధంగా ఉంటుంది!

రాగిపిండితో పసందైన "అప్పాలు" - పాకం పట్టకుండానే పావు గంటలో రెడీ!

ఆలూ కాంబో​లో అద్దిరిపోయే "బ్రోకలీ కర్రీ" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

Last Updated : February 16, 2026 at 4:47 PM IST