ETV Bharat / offbeat

ఆకుకూరలతో అద్దిరిపోయే "మటన్ కర్రీ" - ముక్క మెత్తగా ఉడికి పిల్లలకూ నచ్చుతుంది!

- పాలకూర, మెంతికూర కాంబోలో సూపర్ రెసిపీ - తిన్నారంటే మైమరచిపోతారు

Methi Mutton Curry Preparation
Methi Mutton Curry Preparation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : December 7, 2025 at 1:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

Methi Mutton Curry Preparation : మార్కెట్లో ఎన్ని రకాల నాన్​వెజ్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నా అందులో మటన్​కు ఉండే క్రేజ్ వేరు. ధర ఎక్కువైనా సరే కనీసం వారంలో ఒక్కసారైనా రుచి చూడాలనుకుంటారు కొంతమంది. అయితే, ఎంత ఇష్టమైనప్పటికీ మటన్ కర్రీని ఎప్పుడూ ఒకేలా తినాలన్నా బోర్ కొట్టేస్తుంది. అందుకే, మీకోసం ఆకుకూరల కాంబినేషన్​లో ఒక అద్దిరిపోయే రెసిపీని తీసుకొచ్చాం. అదే, ఘుమఘుమలాడే "మేథీ మటన్ కర్రీ". ముక్క మెత్తగా ఉడికి సూపర్ టేస్టీగా ఉంటుంది.

మనలో చాలా మంది ఆకుకూరలను తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఇలా మెంతికూర, పాలకూరతో కలిపి మటన్ కర్రీ వండి పెట్టారంటే లొట్టలేసుకుంటూ తింటారు. భలే భలే రుచిగా ఉండే ఈ కర్రీ పిల్లలకూ చాలా బాగా నచ్చుతుంది. అలాగే, ఈ రెసిపీ ప్రిపరేషన్​కు పెద్దగా శ్రమించాల్సిన పని లేదు. తక్కువ పదార్థాలతో ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి, నోరూరించే ఈ మేథీ మటన్​ను ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

Methi Mutton Curry
Methi Mutton Curry (Getty Images)
Methi Mutton Curry
Methi Mutton Curry (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ముప్పావుకిలో - మటన్ ముక్కలు
  • మూడు - ఉల్లిపాయలు
  • ఒక టేబుల్​ స్పూన్ - వెల్లుల్లి తరుగు
  • పావు కప్పు - నూనె
  • ఒక టేబుల్​ స్పూన్ - అల్లం తరుగు
  • ఒక చెంచా - పసుపు
  • ఒక చెంచా - ధనియాలపొడి
  • ఒక చెంచా - గరంమసాలా
  • రుచికి తగినంత - కారం
  • టేస్ట్​కి సరిపడా - ఉప్పు
  • మూడు - టమాటాలు
  • పెద్ద కప్పు - మెంతికూర
  • అర కప్పు - పాలకూర తరుగు

పచ్చిమిర్చి​తో పసందైన "చికెన్ కర్రీ" - ఇలా చేస్తే ఇంట్లో పండగే!!

Methi Mutton Curry
Methi Mutton Curry (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా తాజా మెంతికూరను తీసుకుని ఒక పరిమాణంలో కాడల నుంచి తుంచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
  • తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి జల్లిగిన్నెలో వేసి పక్కనుంచాలి. అలాగే, అర కప్పు పరిమాణంలో పాలకూర తరుగును రెడీ చేసుకుని పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయ, టమాటాలను నీట్​గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. అదే విధంగా, ఒక గిన్నెలో మటన్ తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.
Methi Mutton Curry
Methi Mutton Curry (Getty Images)
  • ఇప్పుడు కర్రీ తయారీకి స్టవ్ మీద కడాయిని ఉంచి తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకోవాలి.
  • ఆనియన్స్ వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి తరుగు, పసుపు, ధనియాలపొడి, గరంమసాలా, రుచికి తగినంత ఉప్పు, కారం వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా కలపాలి.
  • అనంతరం అందులో శుభ్రంగా కడిగి పెట్టిన మటన్ ముక్కలు, రెడీ చేసి పెట్టుకున్న టమాటా తరుగు వేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్​లో బాగా వేయించాలి.
  • ఆ తర్వాత ఒకటిన్నర కప్పుల వరకు వేడి నీళ్లు పోసి కలిపి మూతపెట్టి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
Methi Mutton Curry
Methi Mutton Curry (Getty Images)
  • పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలిపి రెడీ చేసి పెట్టుకున్న పాలకూర తరుగు, మెంతికూర వేసి మరోసారి మంచిగా కలిపి మూతపెట్టి ఉడికించుకోవాలి.
  • ఇలా ఉడికించుకునే క్రమంలో మధ్యమధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. మటన్ పూర్తిగా ఉడికి, నీళ్లన్నీ ఆవిరై, కూర బాగా వేగిందనుకున్నాక స్టవ్ చేసి దింపేసుకుంటే చాలు.
  • అంతే, మెంతికూర-పాలకూర కాంబినేషన్​లో ఘుమఘుమలాడే "మటన్ కర్రీ" మీ ముందు ఉంటుంది!
  • మరి, నచ్చితే మీరూ ఓసారి ఆకుకూరల కాంబినేషన్​లో ఇలా మటన్ కూర వండి చూడండి. ఇంటిల్లిపాదీ కమ్మగా, కడుపునిండా తినేస్తారు.

వహ్వా అనిపించే "ఉలవచారు - చికెన్" - ఆల్​ టైమ్​ ఫేవరెట్​ రెసిపీ అయిపోద్ది!

"టమాటా కోడిగుడ్డు కర్రీ" ఇలా వండండి - సరికొత్త రుచిలో అదుర్స్ అనిపిస్తుంది!