ETV Bharat / offbeat

బ్రేక్​ఫాస్ట్​లోకి, సాయంత్రం స్నాక్ కోసం - మీల్​మేకర్​తో కరకరలాడించండి!

టిఫిన్​లోకి సూపర్ స్నాక్ - మీల్ మేకర్​తో ఈజీగా ఇలా చేయండి

meal_maker_recipes
meal_maker_recipes (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 27, 2026 at 4:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

MEAL MAKER RECIPES : ఉదయం అల్పాహారంతో పాటు సాయంత్రం స్నాక్ కోసం మీల్ మేకర్​తో సింపుల్​గా ఇలా ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది. చాలా టేస్టీగా కరకరలాడించొచ్చు. ఇక్కడ ఇచ్చిన పదార్థాలు, కొలతలతో సింపుల్ గా ట్రై చేయండి.

'జీడిపప్పు, కాకరకాయ కారం ఫ్రై' - ఇలా చేశారంటే పిల్లలూ ఇష్టంగా తింటారు!

కావల్సిన పదార్థాలు :

  • మీల్ మేకర్ - 1 కప్పు
  • వెల్లుల్లి - 6
  • అల్లం ముక్క - చిన్నది
  • పచ్చిమిర్చి - 3
  • టమోటాలు - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ధనియాల పొడి - 1 స్పూన్
  • గరం మసాలా - అర స్పూన్
  • నిమ్మరసం - అర చెక్క
  • లేదా పెరుగు - కొద్దిగా
  • ఉల్లిపాయలు - 1
  • క్యారెట్ తరుగు - కొద్దిగా
  • బియ్యం పిండి - అర కప్పు
  • గోధుమ పిండి - అర కప్పు
  • పసుపు - పావు స్పూన్
  • జీలకర్ర - అర స్పూన్
  • వంట సోడా - కొద్దిగా
  • నూనె - వేయించడానికి
  • నువ్వులు - అర స్పూన్

తయారీ విధానం :

  • ముందుగా ఒక గిన్నెలోకి మీల్ మేకర్ తీసుకుని అందులో వేడి నీళ్లు పోసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత నీళ్లు పిండుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన మీల్ మేకర్ ఓ మిక్సీలోకి తీసుకుని అందులోకి వెల్లుల్లి, అల్లం ముక్క, పచ్చిమిర్చి, టమోటా ముక్కలతో పాటు కొద్దిగా నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని రుచికి సరిపడా ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం లేదా పెరుగు వేసుకుని కలపాలి. ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు, క్యారెట్ తరుగు, బియ్యం పిండి, గోధుమ పిండి వేసుకుని బాగా మిక్స్ చేయాలి. అవసరమైనన్ని నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న మిక్స్ లోకి పసుపు, జీలకర్ర, కొద్దిగా వంట సోడా వేసుకుని మరో సారి కలుపుకోవాలి.
  • పిండి లూజుగా, గట్టిగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి. ఇపుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని నువ్వులు చల్లుకోవాలి. ఆపైన్ పిండి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. మూతపెట్టి లో టు మీడియం ఫ్లేమ్​లో ఓ వైపు కాల్చుకుని మరో వైపు టర్న్ చేసుకోవాలి. ఈ స్నాక్ రెసిపీ టమోటా కెచప్ లేదా టమోటా చట్నీతో తింటే అద్భుతంగా ఉంటాయి.

పుల్లగా, కమ్మగా "మెంతి ఆకు, టమోటా పచ్చడి" - వారం రోజులు నిల్వ ఉంటుంది!

టేస్టీ "పొటాటో కర్రీ"! - కొత్త వాళ్లు కూడా అద్భుతంగా చేసుకునే సింపుల్ రెసిపీ!