"చేపల కర్రీ" బాగా కుదరాలంటే ఈ టిప్స్ పాటించండి - మరుసటి రోజు ఘుమఘుమలాడుతుంది!
అద్దిరిపోయే చేపల పులుసు - ఈ పద్ధతిలో కుక్ చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 3, 2026 at 3:03 PM IST
MASALA FISH CURRY RECIPE : ఇవాళ తయారు చేసిన చేపల కర్రీ రేపటికి మరింత రుచిగా ఉంటుందంటారు. మీకు అలా అనిపించకపోతే కర్రీ సరిగ్గా కుదరనట్టే లెక్క!. అందుకే ఓ సారిలా ట్రై చేసి చూడండి. కచ్చితంగా కుదురుతుంది. కాస్త నూనె ఎక్కువగా వేసి కారం, చింతపండు గుజ్జు కూడా వేయించాక పులుసు పెట్టుకుని ముక్కలు వేసి చూడండి. రుచి మీరు ఆశించినట్టే ఉంటుంది.
చేపల పులుసులో ఏదైనాటేస్ట్ మిస్సవుతున్నారా? - కారం, చింతపండు వేసే టైం ఇంపార్టెంట్!

కావల్సిన పదార్థాలు :
- చేప ముక్కలు - కేజీ
- ఉల్లిపాయలు - 3 మీడియం సైజు
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - అర స్పూన్
- కారం - 3 స్పూన్లు
- నూనె - 6 టేబుల్ స్పూన్లు
- పచ్చి మిర్చి - 3
- కరివేపాకు - 1 రెమ్మ
- ధనియాల పొడి - 1 స్పూన్
- జీలకర్ర పొడి - అర స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- పెరుగు - అర కప్పు
లేదా
- చింతపండు - పెద్ద నిమ్మకాయ సైజు
- జీడిపప్పు - 12
- కసూరి మేతి - 1 స్పూన్
- కొత్తిమీర - 1 స్పూన్

తయారీ విధానం :
- ముుందుగా 3 మీడియం సైజు ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కట్ చేసుకుని మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇపుడు ఓ గిన్నెలోకి చేప ముక్కలు వేసుకుని ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా నూనె వేసుకుని ముక్కలకు బాగా పట్టించి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.

- ఇపుడు కడాయిలో నూనె వేసుకుని చేప ముక్కలను సెమీ ఫ్రై చేసి తీసుకోవాలి. నూనె తగ్గితే మరి కాస్త పోసుకుని అదే కడాయిలో ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల పాటు వేయించిన తర్వాత పచ్చి మిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ తరుగు రంగు మారిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి, కారం, పసుపు, జీలకర్ర పొడి వేసి కలిపి 2 నిమిషాలు వేయించాక నీళలు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి.

- మూతపెట్టి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు 3 నిమిషాలు ఉడికించుకున్నాక పెరుగు మిశ్రమాన్ని వేసుకోవాలి. లేదా చింతపండు గ్రేవీ, అర గ్లాసు నీళ్లు కూడా పోసుకుని బాగా కలుపుతూ ఉడికించుకోవాలి.

- ఇపుడు మిక్సీలో 12 జీడిపప్పపులు, కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసి కడాయిలో వేసుకోవాలి. మరో 3 నిమిషాల పాటు నూనె తేలే వరకు ఉడికించుకున్న తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. ఇపుడు గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. గ్రేవీ అడుగు పట్టకుండా బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకుని కలపాలి. ముక్కలు ముందుగానే ఫ్రై చేసుకోవడం వల్ల చెదిరిపోకుండా ఉంటాయి. మూతపెట్టుకుని 15 నిమిషాల పాటు లో ప్లేమ్‌లో ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసుకుని కొత్తిమీర కట్ చేసుకుని చల్లుకోవాలి. అంతే! ఘుమఘుమలాడే చేపల కర్రీ రెడీగా ఉంటుంది.
పచ్చిమిర్చి పేస్ట్‌తో "ఆంధ్రా చిల్లీ చికెన్ కర్రీ" - నోటికి సరికొత్త రుచిని ఇస్తుంది!
ఫారం చికెన్‌తో "నాటు కోడి టేస్ట్" - మసాలా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలు!

