ETV Bharat / offbeat

మనసుదోచే మామిడితో "రవ్వ కేసరి" - అలా నోట్లోవేసుకోగానే కరిగిపోతుంది - రుచి వేరే లెవల్​!

-చాలా తక్కువ సమయంలో రుచికరమైన స్వీట్​! - ప్రిపేర్​ చేయడం వెరీ వెరీ ఈజీ!

Mango Rava Kesari Recipe
Mango Rava Kesari Recipe (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : June 2, 2026 at 8:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

Mango Rava Kesari Recipe: నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్స్​ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ ఎవ్వరైనా ఈజీగా, రుచికరంగా చేసుకునే రవ్వ కేసరి అంటే చెప్పక్కర్లేదు. అందుకే పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు, వ్రతాల సమయంలో చాలా మంది ఈ స్వీట్​ను తయారు చేస్తుంటారు. అయితే ఎంత రుచికరంగా ఉన్న రవ్వ కేసరి అయినా ఎప్పుడూ ఒకే రీతిలో చేసుకుంటే అంతగా నప్పదు. ఈ క్రమంలోనే మీకోసం వెరైటీగా చేసుకునే ఓ రెసిపీ తీసుకొచ్చాం. అదే మ్యాంగో రవ్వ కేసరి. సమ్మర్​లో విరివిగా దొరికే పండ్లలో రారాజైనా మామిడిపండ్లతో చాలా టేస్టీగా ఈ స్వీట్​ను ప్రిపేర్​ చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా ఈ స్వీట్​ను ఎలా చేసుకోవాలో చూసేయండి.

Mango Rava Kesari Recipe
Mango Rava Kesari Recipe (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • నెయ్యి - తగినంత
  • ఉప్మా రవ్వ - 1 కప్పు
  • మామిడిపండు గుజ్జు - 1 కప్పు
  • పంచదార - 2 కప్పులు
  • యాలకుల పొడి - అర టీస్పూన్​
  • జీడిపప్పు - గుప్పెడు
  • కిస్​మిస్​ - కొన్ని
Mango Rava Kesari Recipe
Mango Rava Kesari Recipe (Getty Images)

తయారీ విధానం:

  • బాగా పండిన మామిడి తీసుకొని శుభ్రంగా కడిగి తోలు తీసేసి ముక్కలుగా కట్​ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ జార్​లో వేసుకొని అస్సలు పలుకు లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్​ చేసుకుని ఒక కప్పు కొలత ప్రకారం పక్కన ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి 2 టేబుల్​స్పూన్ల నెయ్యి వేసి కరిగించాలి. కరిగిన నేతిలో బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్​లో దోరగా ఫ్రై చేయాలి.
Mango Rava Kesari Recipe
Mango Rava Kesari Recipe (Getty Images)
  • రవ్వ మంచిగా వేగిన తర్వాత తీసి ప్లేట్​లోకి వేసుకోవాలి. అదే గిన్నెలో 1 కప్పు రవ్వకు నాలుగు కప్పుల నీరు పోసుకోవాలి.
  • ఆ నీటిలోకి గ్రైండ్​ చేసిన మామిడి గుజ్జు, పంచదార. యాలకుల పొడి వేసి కలిపి మరిగించాలి.
  • పంచదార, మామిడి పూర్తిగా నీటిలో కలిసి వాటర్​ మరుగుతున్నప్పుడు మంటను సిమ్​లో పెట్టి వేయించిన రవ్వను కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించాలి.
Mango Rava Kesari Recipe
Mango Rava Kesari Recipe (Getty Images)
  • రవ్వను పూర్తిగా కలుపుకున్నాక సిమ్​లోనే మధ్యమధ్యలో కలుపుతూ కాస్త నెయ్యి యాడ్​ చేసుకుంటూ దగ్గర పడే వరకు కుక్​ చేసుకోవాలి.
  • ఈలోపు మరో స్టవ్​ మీద చిన్న పాన్​ ఉంచి పావు కప్పు నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. కాగిన నెయ్యిలో జీడిపప్పు వేసి దోరగా వేయించాలి.
  • జీడిపప్పులు సగం మేర వేగినాక కిస్​మిస్​ వేసి గోల్డెన్ బ్రౌన్​ కలర్​ వచ్చేవరకు వేయించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • మిశ్రమం మంచిగా ఉడికి పాన్​కు అంటుకోకుండా ఉన్నప్పుడు వేయించిన జీడిపప్పు, కిస్మిస్​, మరికొంచెం నెయ్యి వేసి కలిపి దింపుకుంటే సరి. ఎంతో రుచికరంగా ఉండి, నోట్లో వేసుకోగానే కరిగిపోయే మామిడి రవ్వ కేసరి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Mango Rava Kesari Recipe
Mango Rava Kesari Recipe (ETV Bharat)

టిప్స్​:

  • బాగా పండిన, తియ్యగా ఉండే మామిడిపండ్లు అయితే రవ్వ కేసరి రుచి మరింత బాగుంటుంది.
  • రవ్వను సిమ్​లో దోరగా వేయించుకోవాలి. లేదంటే రవ్వ సరిగా వేగకపోతే కేసరి అంత రుచిగా ఉండదు.
  • మామిడి పండు తియ్యదనాన్ని బట్టి పంచదారను అడ్జస్ట్​ చేసుకోవాలి. అలాగే ఒకటే కప్పుతో రవ్వ, మామిడిపండు గుజ్జు, పంచదార, నీళ్లు, నెయ్యి తీసుకోవాలి.

ఆలు గడ్డలతో - కరకరలాడే జంతికలు, ఫింగర్ చిప్స్ - ఇలా టేస్టీగా!

మనసు దోచే "మామిడి లస్సీ, మస్తానీ మిల్క్​షేక్​" - ఒక్కసారి తాగితే ఫ్యాన్​ అయిపోతారు!