ETV Bharat / offbeat

నిమిషాల్లో తయారయ్యే "కొత్తిమీర రైస్" - కర్రీ అవసరం లేదిక!

రోటిన్​కి భిన్నంగా కొత్తిమీరతో రైస్ చేయండి - తక్కువ పదార్ధాలతో అప్పటికప్పుడు రెడీ!

Kothimeera Rice
Kothimeera Rice (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 4:40 PM IST

2 Min Read
Choose ETV Bharat

Coriander Rice Prepare : రోజూ ఎప్పుడూ చేసుకునే పులావ్​లు, బిర్యానీలు, రైస్ రెసిపీలు తిని బోర్ కొట్టిందా? ఏదైనా కొత్త వంటకాన్ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ సూపర్ రెసిపీ. అదే కొత్తిమీర రైస్. దీన్ని ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్లీమళ్లీ కావాలంటారు. అంతేకాక మంచి మసాలా ఫ్లేవర్​తో ఘుమఘుమలాడుతుంది. సైడ్‌ డిష్‌ లేకుండానే దీన్ని హ్యాపీగా తినేయొచ్చు. ఇది లంచ్, డిన్నర్​లోకి సూపర్ కాంబినేషన్​.

మళ్లీ మళ్లీ తినాలనిపించే "చిక్కుడు కాయ ఫ్రై" - అన్నం, చపాతీల్లోకి అద్దిరిపోతుంది!

Kothimeera Rice
బియ్యం (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
  • బిర్యానీ ఆకు - 1
  • జీలకర్ర - అర టీ స్పూన్
  • పచ్చి బఠాణీలు - పావు కప్పు
  • ఉల్లిపాయ - 1
  • క్యారెట్ ముక్కలు - పావు కప్పు
  • కొత్తిమీర - 1 కప్పు
  • పుదీనా ఆకులు - 1 టేబుల్ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 7
  • పచ్చిమిర్చి - 3
  • లవంగాలు - 4
  • యాలకులు - 2
  • దాల్చినచెక్క - కొద్దిగా
  • పంచదార - అర టీ స్పూన్
  • బియ్యం - ఒకటిన్నర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొంచెం
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్
  • జీలకర్ర పొడి - అర టీ స్పూన్
Kothimeera Rice
పచ్చి బఠాణీలు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా కావాల్సిన పరిమాణంలో క్యారెట్, ఒక ఉల్లిపాయ, మూడు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి.
  • అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఒకటిన్నర కప్పు బియ్యం, సరిపడా నీళ్లు ఉడికించాలి. అన్నం కాస్త పొడిపొడిగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Kothimeera Rice
మసాలా దినుసులు (Getty Images)
  • ఇంకోవైపు స్టవ్ ఆన్​ చేసి పాన్​లో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేయాలి.
  • ఆనియన్స్ రంగు మారిన తర్వాత పావు కప్పు పచ్చి బఠాణీలు, పావు కప్పు క్యారెట్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి వేగనివ్వాలి. అనంతరం మూతపెట్టి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మూడు నిమిషాల పాటు మగ్గించాలి.
Kothimeera Rice
క్యారెట్ ముక్కలు (Getty Images)
  • మరోవైపు మిక్సీజార్​లో కప్పు కొత్తిమీర ఆకులు, ఒక టేబుల్ స్పూన్ పుదీనా ఆకులు, 7 వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అలాగే చిన్నం అల్లం ముక్క, మూడు పచ్చిమిర్చి, నాలుగు లవంగాలు, రెండు యాలకులు, చిన్న దాల్చినచెక్క, అర టీ స్పూన్ పంచదార వేసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బఠాణీక్యారెట్ మిశ్రమంలో వేసి రెండు నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇందులోనే ఉడికించిన అన్నం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర తరుగు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసి మిక్స్ చేయాలి.
Kothimeera Rice
కొత్తిమీర (Getty Images)
  • ఇప్పుడు మూతపెట్టి మంటను లో ఫ్లేమ్​లో ఉంచి ఒక నిమిషం పాటు ఉంచాలి. చివరన కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
  • అంతే వేడివేడి కొత్తిమీర రైస్ సిద్ధమైనట్లే!

"ఎండు చేపల పులుసు" - ఇలా చేస్తే నచ్చని వాళ్లు కూడా ఇష్టంగా తింటారు!

చూడగానే నోరూరించే "జీడిపప్పు హల్వా" - జ్యూసీ జ్యూసీగా అద్దిరిపోతుంది!