న్యూయార్క్ ఎన్నికల్లో 'కోమటిరెడ్డి సరిత' - మద్దతు ప్రకటించిన "ట్రంప్"
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ! - ఎవరీ కోమటిరెడ్డి సరిత?

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 20, 2026 at 3:25 PM IST
Komatireddy Saritha : న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి మరో మూడు నెలల్లో జరగనున్న ఎన్నికల్లో కోమటిరెడ్డి సరిత పోటీ చేయనున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న ఆమెకు ఆ పార్టీ అధ్యక్షుడైన ట్రంప్ తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. సరిత అమెరికా దేశ భక్తురాలని, ఆమెకు మద్దతు తపలకడం తనకు గర్వంగా ఉందన్నారు. ఆమె నాయకత్వంలో న్యాయవ్యవస్థ బలపడుతుందని, ఆర్థిక వ్యవస్థను సరిత అభివృద్ధి చేస్తారని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారని పేర్కొన్నారు. ఇంతకూ కోమటిరెడ్డి సరిత ఎవరు? న్యూయార్స్ అటార్నీ జనరల్ పదవి ఎన్నికల బరిలో ఆమె ఎలా పోటీ చేస్తున్నారు?
యువత పెళ్లికి భయపడడానికి కారణాలివే! - సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి!
న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవి ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి లెటిటియా జేమ్స్ ప్రత్యర్థి కోమటిరెడ్డి సరిత. భారత సంతతికి చెందిన సరిత అక్కడే న్యాయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తండ్రి డాక్టర్ హనుమంత్ రెడ్డి, కార్డియాలజిస్ట్ కాగా, తండ్రి డాక్టర్ గీతా రెడ్డి రుమటాలజిస్ట్. తెలంగాణకు చెందిన ఈ దంపతులు వృత్తిరీత్యా 1980 దశకంలో అమెరికాలో వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. సరిత న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో పుట్టినప్పటికీ, తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా మిస్సోరీలో పెరిగారు. 41 ఏళ్ల సరితకు నలుగురు సంతానం.
అల్ ఖైదా, ఐసిస్ కేసులను విచారించి
కోమటిరెడ్డి కవిత హార్వర్డ్ కాలేజ్ అండ్ లా స్కూల్ నుంచి పట్టభద్రురాలయ్యారు. యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో క్లర్క్‌గా ఆమె ప్రయాణం ప్రారంభం కాగా, కొలంబియా లా స్కూల్లో లెక్చరర్‌గానూ పనిచేశారు. ఆ తరువాత ఫెడరల్ ప్రాసిక్యూషన్ బాధ్యతలు చేపట్టి ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మనీలాండరింగ్, మోసం, విదేశీ ప్రభుత్వ అవినీతి తదితర కేసులు విచారించారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా పనిచేస్తున్న సమయంలో అల్ ఖైదా, ఐసిస్, మెక్సికన్ డ్రగ్ కార్టెల్స్‌కు సంబంధించిన కేసులను సమర్థంగా ఎదుర్కొన్నారు. డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్(డీఈఏ)కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గానూ పనిచేసిన సరిత ప్రస్తుతం 'హోల్జ్‌మన్ వోగెల్' అనే న్యాయ సంస్థలో భాగస్వామిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయిలో అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ నుంచి నామినేషన్ పొందిన తొలి తెలుగు అభ్యర్థిగానూ చరిత్ర సృష్టించిన ఆమెకు ట్రంప్ మద్దతు దక్కింది.
రాత్రిపూట ఈ 'పొరపాట్లు' చేస్తున్నారా? - విడాకులకు కారణం కావొచ్చు జాగ్రత్త!
కళ్ల ముందే ఉన్నా కనిపించని 'ముక్కు' - దీని వెనుక దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

