ETV Bharat / offbeat

బీట్ రూట్​తో చెక్కలు, కొబ్బరితో కోవా! - టేస్ట్​కు ఫిదా అయిపోతారు

- పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా లాగిస్తారు - రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యం - చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు

Coconut Kova and Beetroot
Coconut Kova and Beetroot (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 4, 2026 at 2:37 PM IST

2 Min Read
Choose ETV Bharat

Coconut Kova and Beetroot : ఆరోగ్యానికి బీట్​ రూట్​ ఎంత మేలు చేస్తుందో తెలిసిందే. రక్త హీనతను దూరం చేయడం నుంచి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. కానీ, దీన్ని తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇదే విధంగా కొబ్బరి కూడా హెల్త్​కు ఎంతో మంచిది. కానీ దీన్ని కూడా పచ్చిగా ఎక్కువ తినరు. అందుకే ఈ రెండిటితో తయారు చేసే రెండు సూపర్ స్వీట్లను మీకోసం తీసుకొచ్చాం. మరి, అవి ఎలా తయారు చేయాలి? ఇందుకోసం ఎలాంటి పదార్థాలు కావాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

బీట్​ రూట్​ చెక్కల కోసం కావాల్సిన పదార్థాలు :

  • బీట్‌రూట్‌ తురుము - 1/2 కప్పు
  • బియ్యప్పిండి - 3 కప్పులు
  • పచ్చిమిర్చి - ఐదు
  • అల్లం - చిన్నముక్క
  • ఉప్పు - తగినంత
  • జీలకర్ర - 1 చెంచా
  • కరివేపాకు - 2 రెబ్బలు
  • సగ్గుబియ్యం - 1/2 కప్పు
  • పచ్చి శనగపప్పు - 1/2 కప్పు
  • బటర్‌ - ముప్పావుకప్పు
  • నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా పచ్చి శనగపప్పు, సగ్గుబియ్యం 2 గంటల ముందు నానబెట్టాలి.
  • ఆ తర్వాత అల్లం పొట్టుతీసుకొని, పచ్చిమిర్చితోపాటు మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక బౌల్ లో బియ్యం పిండి, అల్లంపచ్చిమిర్చి పేస్టు, తురిమిన బీట్‌రూట్‌, నానబెట్టుకున్న సగ్గుబియ్యం, బటర్, ఉప్పు, జీలకర్ర, సన్నగా తరిగిన కరివేపాకు, శనగపప్పు వేసుకోవాలి.
  • ఈ మిశ్రమాన్ని పూర్తిగా కలుపుకోవాలి. చపాతీ పిండిని కలుపుకొని ముద్ద చేసుకున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి
  • ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసుకొని, పూరీలు వత్తుకునే ప్రెషర్​లో పెట్టి వత్తుకొని, స్క్వేర్​ షేప్​లో కట్​ చేసుకుంటే సరిపోతుంది.
  • ఆ తర్వాత స్టౌ మీద బాండీ పెట్టుకొని, అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్​ వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అద్దిరిపోయే బీట్​ రూట్​ చెక్కలు సిద్ధమైపోతాయి.

వారెవ్వా అనిపించే గోదారోళ్ల స్వీట్ "పాకుండలు" - ఇలా ఈజీగా చేసుకోవచ్చు!

కొబ్బరి కోవా కోసం కావాల్సిన పదార్థాలు :

  • తురిమిన కొబ్బరి - కప్పున్నర
  • పాలు - కప్పు
  • క్రీమ్ - అరకప్పు
  • చక్కెర - కప్పు
  • పాలపొడి - కప్పున్నర
  • నెయ్యి - చెంచా
  • జామ్‌ - 2 చెంచాలు

తయారీ విధానం :

  • ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి తురుము వేసుకోవాలి. అందులోనే పాలు పోసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి
  • ఇప్పుడు స్టవ్‌ మీద కడాయి పెట్టి, అందులో కొబ్బరి తురుము-పాల మిశ్రమాన్ని వేసుకోవాలి. దాదాపు ఓ 5 నిమిషాలపాటు కుక్​ చేసుకోవాలి
  • అనంతరం క్రీమ్ వేసుకోవాలి. మొత్తం చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే పంచదార వేసుకోవాలి
  • పూర్తిగా కరిగిన తర్వాత పాలపొడి వేసుకొని సిమ్​లో బాగా ఉడికించాలి
  • మిశ్రమం పూర్తిగా దగ్గర అవుతున్నప్పుడు అందులో నెయ్యి వేసి మిక్స్​ చేసుకొని స్టవ్‌ ఆఫ్ చేయాలి
  • కాసేపు చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని కోవా బిళ్లల మాదిరిగా షేప్​ చేసుకుంటే సరిపోతుంది
  • వీటిపైన కొద్దిగా కొబ్బరిపొడి చల్లుకొని, ఓ చుక్క జామ్‌ని మధ్యలో ఉంచితే సూపర్​ టేస్టీ "కొబ్బరికోవా" సిద్ధమైపోతుంది
  • ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీక్కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి

పాకం అవసరం లేని "జొన్న లడ్డూలు" - చాలా టేస్టీగా ఉంటాయి - హెల్త్​కు మంచిది!