ETV Bharat / offbeat

రోజూ అవే దోసెలు, ఇడ్లీలు ఏం తింటారు? - కాస్త వెరైటీగా "ఇడియప్పం" ట్రై చేయండి!

బియ్యప్పిండితో కేరళ స్టైల్ టిఫిన్ రెసిపీ - ఇలా చేశారంటే ఎవరైనా సూపర్ అనాల్సిందే!

Idiyappam
Idiyappam (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 6, 2026 at 12:05 PM IST

2 Min Read
Choose ETV Bharat

String Hoppers Making in Telugu : నార్మల్​గా బ్రేక్​ఫాస్ట్​లోకి చాలా మంది వడ, ఇడ్లీ, బోండా, దోసె, పూరీ వంటివి ఎక్కువగా చేస్తుంటారు. అయితే రెగ్యులర్​గా ఒకే రకమైన టిఫిన్స్​ తినాలన్నా కొందరికి నచ్చదు. ఇక పిల్లలు, పెద్దలైతే ఏదో ఒక కొత్త రెసిపీ చేయమని అడుగుతుంటారు. ఈ నేపథ్యంలోనే గృహిణులు వెరైటీగా ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈరోజు ఓకొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే కేరళ స్టైల్ ఇడియప్పం.

ఈ పద్ధతిలో చేశారంటే ఇంటిల్లిపాదీ ఇంకోసారి చేయమని అడుగుతాయి. అంతేకాక తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు దీన్ని ప్రిపేర్ చేయోచ్చు. ఈ రెసిపీకి ఆయిల్ కూడా అవసరం లేదు. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. మీ ఇంటికి బంధువులు లేదా స్నేహితులు వచ్చినపప్పుడు ఈ విధంగా చేసి వారిని ఆశ్చర్యపరచండి. కొత్తగా చేసేవారు కూడా ఈ పద్ధతిలో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి నోరూరించే ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా రెడీ చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

కరకరలాడే "వెన్న మురుకులు" - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

Idiyappam
బియ్యప్పిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యప్పిండి - 300 గ్రాములు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నెయ్యి - కొద్దిగా

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో 500 ఎంఎల్ నీళ్లు పోయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ నెయ్యి వేసి మూతపెట్టి వాటర్​ను మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచాలి.
  • ఇంకోవైపు మిక్సింగ్ బౌల్లో 300 గ్రాముల బియ్యప్పిండి వేయాలి. ఇందులో వేడి నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ గరిటెతో కలపాలి. అనంతరం చేతులకు కొద్దిగా తడి అంటించి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి.
Idiyappam
ఇడ్లీ పాత్రలపై పిండిని ఈ విధంగా వత్తుకోవాలి (ETV Bharat)
  • ఇప్పుడు జంతికల గొట్టంలో సన్న హోల్స్​ ఉన్న కారప్పూస బిళ్ల పెట్టి నెయ్యి అప్లై చేయాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పిండిని అందులో వేసి మూతపెట్టాలి.
  • ఇంకోవైపు ఇడ్లీ ప్లేట్స్​కు నెయ్యి అప్లై చేయాలి. ఇప్పుడు పిండిని ప్లేట్స్​పై కింద ఫొటోలో చూపిన కొద్దికొద్దిగా వత్తుకోవాలి.
Idiyappam
నెయ్యి (Getty Images)
  • మరోవైపు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్​ పెట్టి మూతపెట్టాలి. ఇప్పుడు ఆరు నిమిషాల పాటు మంటను హై ఫ్లేమ్​లో, 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్​లో ఉంచి ఉడకనివ్వాలి.
  • ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూడు నిమిషాలు తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి.
  • ఇక అంతే వేడివేడి ఇడియప్పం రెడీ అయినట్లే!
  • వేడివేడి ఇడియప్పంలను ఏదైనా స్పైసీ కర్రీ లేదా మీకు నచ్చిన చట్నీ వేసి తింటే సూపర్ అనాల్సిందే!
  • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలకు ఫేవరెట్ బ్రేక్​ఫాస్ట్​గా మారుతుంది.
  • మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఓసారి ట్రై చేయండి.

స్పైసీ "ఎగ్ ఫ్రైడ్ రైస్" - ఇలా ట్రై చేస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ టేస్ట్ ఇంట్లోనే!

క్రిస్మస్ స్పెషల్ "చాక్లెట్ కేక్" - ఓవెన్ లేకుండానే అప్పటికప్పుడు రెడీ!