ETV Bharat / offbeat

కర్ణాటక స్పెషల్ "క్యాబేజీ కుర్మా" - ఒక్కసారి తిన్నారంటే అదరహో అనాల్సిందే!

క్యాబేజీతో ఇలా కర్రీ చేసి చూడండి - వేడివేడి అన్నంతో పాటు పూరీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్​గా ఉంటుంది!

Cabbage Kurma
Cabbage Kurma (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 2, 2026 at 10:25 AM IST

2 Min Read
Choose ETV Bharat

Cabbage Kurma Recipe : క్యాబేజీని చాలా మంది తినడానికి ఇష్టపడరు. ఇక పిల్లలైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇదంటే నచ్చనివాళ్లూ కూడా ఇష్టంగా తినేలా చేసి పెట్టే ఒక సూపర్​ రెసిపీ ఉంది. అదే కర్ణాటక స్పెషల్ క్యాబేజీ కుర్మా. ఒక్కసారి ఈ పద్ధతిలో చేశారంటే మళ్లీమళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. పైగా దీని తయారీకి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. అప్పటికప్పుడు చాలా సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది భోజనంలోకి మాత్రమే కాకుండా చపాతీ, పూరీలోకి సూపర్​గా​ ఉంటుంది. రొటీన్ కర్రీలు తిని బోర్ కొట్టిన వారికి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్​ను అందిస్తుంది. మరి నోరూరించే ఈ క్యాబేజీ కుర్మా ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

ఆంధ్రా స్టైల్ "పాలకూర పప్పు" - వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే!

Cabbage Kurma
క్యాబేజీలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • క్యాబేజీ తరుగు - 300 గ్రాములు
  • పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు
  • పచ్చిమిర్చి - 5
  • వేయించిన శనగపప్పు - 2 టీ స్పూన్లు
  • జీడిపప్పు - 10
  • దాల్చినచెక్క - 1
  • ఆయిల్ - పావు కప్పు
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • కరివేపాకు - కొద్దిగా
  • ఉల్లిపాయ - 1
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • టమోటా - 1
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - పావు కప్పు
  • గరంమసాలా - 1 టీ స్పూన్
Cabbage Kurma
పచ్చికొబ్బరి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పరిమాణంలో క్యాబేజీని తరిగి ఉంచాలి. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమోటాను ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీజార్​లో కప్పు పచ్చికొబ్బరి తురుము, ఐదు పచ్చిమిర్చి, రెండు టీ స్పూన్లు వేయించిన శనగపప్పు వేయాలి. అలాగే 10 జీడిపప్పు, ఒక దాల్చినచెక్క వేసి మెత్తని పేస్ట్​లా గ్రైండ్ చేయాలి.
Cabbage Kurma
అల్లంవెల్లుల్లి పేస్ట్ (Getty Images)
  • అనంతరం స్టవ్ ఆన్ చేసి పాన్​లో పావు కప్పు ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఫ్రై చేయాలి.
  • ఆనియన్స్ వేగాక ఒక టేబుల్ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తరిగి ఉంచిన టమోటా ముక్కలు వేసి కలపి మూతపెట్టి మగ్గించాలి.
Cabbage Kurma
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)
  • టమోటాలు మెత్తబడ్డాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరిజీడిపప్పు పేస్ట్, అర కప్పు నీళ్లు వేసి కలపాలి. అనంతరం మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ వేగనివ్వాలి. ఆ తర్వాత 300 గ్రాముల క్యాబేజీ తరగు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసి ఫ్రై చేయాలి.
  • ఆతర్వాత అర కప్పు నీళ్లు పోసి మిక్స్ చేయాలి. అనంతరం మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి.
Cabbage Kurma
జీలకర్ర (Getty Images)
  • పదిహేను నిమిషాల తర్వాత పావు కప్పు కొత్తిమీర తరుగు, ఒక టీ స్పూన్ గరంమసాలా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే నోరూరించే క్యాబేజీ కుర్మా మీ ముందుంటుంది!

పసందైన "పనీర్ పాయసం" - ఇంట్లోనే ఇలా తియ్యని వేడుక చేసుకోండి!

రాగిపిండితో నోరూరించే "కట్​లెట్స్​" - పిల్లలకు ఇలా చేసి సర్​ప్రైజ్ ఇవ్వండి!