ETV Bharat / offbeat

కరివేపాకుతో కమ్మని "మసాలా ఎగ్​ ఫ్రై" - సూపర్​ టేస్టీగా ఉంటుంది - అన్నంలోకి అదుర్స్​!

-కరివేపాకు, ఎగ్స్​ కాంబోలో సూపర్​ టేస్టీ కర్రీ - చాలా అంటే చాలా బాగుంటుంది!

Karivepaku Masala Egg Fry
Karivepaku Masala Egg Fry (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 27, 2026 at 7:26 PM IST

3 Min Read
Choose ETV Bharat

Karivepaku Masala Egg Fry: పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినే వంటకాల్లో ఎగ్​ రెసిపీలు ముందు ఉంటాయి. కోడిగుడ్లతో ఫ్రై, పులుసు, బుర్జీ అంటూ ఎన్నెన్నో వెరైటీలు చేస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా కరివేపాకు కాంబినేషన్​లో మసాలా ఎగ్​ ఫ్రై తిన్నారా? లేదంటే మీరు ఓసారి ట్రై చేయండి. సూపర్​ టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా ఎగ్​ ఫ్రై రెసిపీ వేడివేడి అన్నంలోకి కమ్మగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా సులువే. బిగినర్స్​ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా కమ్మని కరివేపాకు మసాలా ఎగ్​ ఫ్రై రెసీపీ ఎలా చేసుకోవాలో చూసేయండి.

Karivepaku Masala Egg Fry
కోడిగుడ్లు (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

మసాలా పొడి కోసం:

  • ధనియాలు - 2 టేబుల్​స్పూన్లు
  • లవంగాలు - 4
  • దాల్చినచెక్క - చిన్న ముక్క
  • యాలకులు - 2
  • రాతి పువ్వు - కొద్దిగా
  • ఎండుమిర్చి - 6
  • వెల్లుల్లి రెబ్బలు - 15
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • గసగసాలు - 1 టీస్పూన్​
  • ఎండుకొబ్బరి పొడి - 2 టీస్పూన్లు
  • కరివేపాకు - 1 కప్పు
Karivepaku Masala Egg Fry
బిర్యానీ దినుసులు (Getty Images)

ఎగ్​ ఫ్రై కోసం:

  • కోడిగుడ్లు - 6
  • నూనె - 8 టేబుల్​స్పూన్లు
  • పసుపు - అర టీస్పూన్​
  • ఆవాలు - 1 టీస్పూన్​
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 3
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టేబుల్​స్పూన్​
  • కారం - 1 టీస్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Karivepaku Masala Egg Fry
ఎండుమిర్చి (Getty Images)

తయారీ విధానం:

  • స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టి కోడిగుడ్లు వేసి మునిగేంతవరకు నీళ్లు పోసి అర టీస్పూన్​ ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
  • ఎగ్స్​ బాయిల్​ అయినాక స్టవ్​ ఆఫ్​ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఈలోపు మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి ధనియాలు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, రాతి పువ్వు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి లో ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
Karivepaku Masala Egg Fry
ఎండు కొబ్బరి (Getty Images)
  • చిల్లీ వేగినాక గసగసాలు, ఎండు కొబ్బరి పొడి వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేయాలి. ఆ వేడికే కొబ్బరి పొడి వేగుతుంది.
  • మసాలా దినుసులు పర్ఫెక్ట్​గా వేగాక తీసి ప్లేట్​లోకి తీసుకుని స్టవ్​ ఆన్​ చేసి కరివేపాకు వేసి లో ఫ్లేమ్​లో వేయించాలి.
  • కరివేపాకు క్రిస్పీగా వేగినాక స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీజార్​లోకి వేయించిన ధనియాల మిశ్రమం, కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
Karivepaku Masala Egg Fry
కరివేపాకు (Getty Images)
  • ఉడికించిన కోడిగుడ్లపై పొట్టు తీసేసి అక్కడక్కడ గాట్లు పెట్టుకుని రెడీగా ఉంచాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలనీ సన్నగా తరిగి పక్కన పెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో గాట్లు పెట్టిన కోడిగుడ్లు, అర టీస్పూన్​ పసుపు వేసి లైట్​గా వేయించాలి.
Karivepaku Masala Egg Fry
ఉల్లిపాయలు (Getty Images)
  • ఎగ్స్​ లైట్​గా కలర్​ మారినాక తీసి ప్లేట్​లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఆవాలు వేసి చిట్లనివ్వాలి. ఆవాలు వేగినాక సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
  • ఉల్లిపాయలు లైట్​గా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
Karivepaku Masala Egg Fry
కొత్తిమీర (Getty Images)
  • ఈలోపు ఫ్రై చేసిన ఎగ్స్​ను సన్నగా, పొడుగ్గా కట్​ చేసుకోవాలి. అల్లం వేగినాక కారం వేసి వేయించాలి.
  • అనంతరం గ్రైండ్​ చేసిన కరివేపాకు పొడి, రుచికి సరిపడా ఉప్పు, కట్​ చేసిన ఎగ్స్​, కొత్తిమీర తరుగు వేసి హై ఫ్లేమ్​లో ఓ రెండు నిమిషాల పాటు కలుపుకుని స్టవ్​ ఆఫ్​ చేసి వేడివేడిగా సర్వ్​ చేసుకుంటే కరివేపాకు మసాలా ఎగ్​ ఫ్రై రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Karivepaku Masala Egg Fry
కరివేపాకు మసాలా ఎగ్​ ఫ్రై (ETV Bharat)

చిట్కాలు:

  • కరివేపాకును ముందుగానే శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకుని ఆ తర్వాత వేయించుకుంటే సరిపోతుంది.
  • ధనియాలను మరీ ఎక్కువగా కాకుండా కాస్త వేడిగా మారేవరకు లేదంటే ఎండు మిరపకాయలు వేగేవరకు వేయించుకుంటే సరి.
  • ఈ కర్రీ కోసం కాస్త నూనె ఎక్కువగానే అవసరం అవుతుంది. లేదంటే పొడిపొడిగా అయ్యి అన్నంలోకి సరిగ్గా మిక్స్​ అవ్వదు.

పండుమిర్చితో "ఉసిరికాయ నిల్వ పచ్చడి" - అద్దిరిపోయే టేస్ట్! - ఎక్కువ రోజులు నిల్వ!

దోశ, ఇడ్లీ పిండి లేదా? - మీ కోసమే ఇన్​స్టంట్ రాగిపిండి "పొంగనాలు"! - టేస్ట్ అద్దిరిపోతాయ్!