ETV Bharat / offbeat

నోటికి కొత్త రుచినిచ్చే "కాకరకాయ వెల్లుల్లి కారం" - చేదు అస్సలే ఉండదు!

కాకరకాయతో సింపుల్​గా చేసుకునే రెసిపీ - వేడివేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది!

Kakarakaya Vellulli Karam
Kakarakaya Vellulli Karam (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 28, 2026 at 3:42 PM IST

2 Min Read
Choose ETV Bharat

Kakarakaya Vellulli Karam : కాకరకాయ పేరు చెప్పగానే చాలా మంది చేదు అనేస్తారు. అలాంటి వారు ఇష్టంగా తినేలా ఓ రెసిపీ ఉంది. అదే కాకరకాయ వెల్లుల్లి కారం. అస్సలు చేదు లేకుండా తిన్నాకొద్దీ తినాలనిపిస్తుంది. ప్రిపేర్​ చేసుకోవడం కూడా సులువే. అంతేకాక ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది! మరి ఈ రెసీపీ ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.

చిటికెలో "మ్యాంగో జ్యూస్" - మండుటెండల్లో కూల్​ కూల్​గా తాగేయండి!

Kakarakaya Vellulli Karam
కాకరకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • కాకరకాయలు - ఒక కేజీ (1000 గ్రాములు)
  • జీలకర్ర - 2 టీ స్పూన్లు
  • ధనియాలు - 4 టీ స్పూన్లు
  • ఆయిల్ - 10 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - 1 టీ స్పూన్
  • కారం - సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు - 50
  • కారం - తగినంత
Kakarakaya Vellulli Karam
వెల్లుల్లి (Getty Images)

తయారీ విధానం :

  • కాకరకాయలను శుభ్రంగా కడిగి కాటన్​ క్లాత్​తో తుడవాలి. ఆ తర్వాత రెండు వైపులా చివర్లు కట్​ చేసి రౌండ్​ షేప్​లో ముక్కలుగా తరిగి ఉంచాలి.
  • అదేవిధంగా మిక్సిజార్​లో నాలుగు టీ స్పూన్ల ధనియాలు, రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే 50 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా కారం వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టాలి.
Kakarakaya Vellulli Karam
కారం (Getty Images)
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్​లో 10 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి కలుపుతూ వేయించాలి.
  • కాకరకాయ ముక్కలు బాగా వేగి గోల్డెన్​ కలర్​లోకి మారాక ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మరో రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారం వేసి ముక్కలకు పట్టేలా బాగా మిక్స్ చేయాలి.
Kakarakaya Vellulli Karam
ధనియాలు (Getty Images)
  • ఈ మిశ్రమం చక్కగా కలిశాక మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఈ క్రమంలో స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అంతే కాకరకాయ వెల్లుల్లి కారం తయారైనట్లే!
Kakarakaya Vellulli Karam
జీలకర్ర (Getty Images)
  • ఈ రెసిపీని ఎయిర్​టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది!

టిప్స్ :

  • కాకరకాయలను కేవలం రౌండ్​ షేప్​లో మాత్రమే కాకుండా పొడుగ్గా కూడా కట్​ చేసుకోవచ్చు.
  • లేత కాకరకాయలు తీసుకుంటే గింజలు తక్కువ ఉండి తొందరగా ఫ్రై అవుతాయి. అంతేకాక మరీ అంత చేదుగా ఉండవు.
  • వెల్లుల్లి కారాన్ని మరీ మెత్తగా గ్రైండ్​ చేస్తే అంత టేస్ట్​ అనిపించదు. కాస్త బరకగా ఉంటేనే తినేటప్పుడు దాని ఫ్లేవర్​ తెలిసి మరింత రుచిగా అనిపిస్తుంది.

టేస్టీ, క్రంచీ "ఓట్స్​ బిస్కెట్స్​" - ఓవెన్ లేకుండానే ఇన్​స్టంట్​గా రెడీ!

నోట్లో వేసుకోగానే కరిగిపోయే "రైస్​ ఖీర్​ పుడ్డింగ్" - సింపుల్​గా ఇంట్లోనే రెడీ!