మండే ఎండల్లో ఒంటికి చలువ చేసే "జొన్న అంబలి" - నోటికి రుచిగా, పొట్టకి హాయిగా!
జొన్నలతో సింపుల్‌గా చేసుకునే జావ - ఒక్కసారి తాగారంటే మళ్లీమళ్లీ చేసుకుంటారు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 22, 2026 at 2:29 PM IST
Jonna Ambali Recipe in Telugu : వేసవి రాకముందే భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. క్రమంగా ఎండలు మండుతున్నాయి. దీంతో ఈ సీజన్‌లో అందరూ ఒంటికి చలువ చేసే ఆహార పదార్థాలను ఎక్కువగా తినడానికి లేదా తాగడానికి ఇష్టపడతారు. ఇందులో అంబలి కూడా ఒకటి. దీనిని కొన్నిచోట్ల జావ అని కూడా పిలుస్తారు. కానీ కొందరు దీన్ని తాగడానికి అంతగా ఇష్టపడరు. అయితే ఎప్పుడూ చేసేలా కాకుండా ఈ తీరులో జొన్న అంబలి ప్రిపేర్ చేస్తే పిల్లలు పెద్దలు ఇష్టంగా తాగుతారు. పైగా దీనికోసం ఎక్కువ సమయం కేటాయించాల్సిన పనిలేదు. ఇంట్లో ఉండే పదార్థాలతో నిమిషాల్లోనే తయారవుతుంది. మరి నోరూరించే జొన్న జావ చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
"టమోటా పచ్చడి" ఫ్యాన్స్‌కి పండగే - పచ్చిమిర్చితో అద్భుతమైన చట్నీ మీకోసం!

కావాల్సిన పదార్థాలు:
- జొన్నపిండి - 2 కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా
- ఉల్లిపాయలు - 2
- పచ్చిమిర్చి - 4
- మజ్జిగ- ఒక లీటర్
- కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం:
- ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల జొన్నపిండి వేయాలి. ఇప్పుడు నాలుగు కప్పుల నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి.
- అలాగే రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చిని తరిగి ఉంచాలి.

- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో పది కప్పుల నీళ్లు పోయాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి జొన్నపిండి మిశ్రమాన్ని కొద్దకొద్దిగా వేస్తూ బాగా కలపాలి.
- అనంతరం 10 నిమిషాల పాటు ఈ మిశ్రమం కొంచెం చిక్కబడే వరకూ కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మరో ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసి మూతపెట్టి పది నిమిషాల పాటు పక్కనుంచాలి.

- పది నిమిషాల అనంతరం అంబలిని మరోసారి మిక్స్ చేయాలి. ఇందులోనే ఒక లీటర్ మజ్జిగ, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే తరిగి ఉంచిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి.
- అంతే కమ్మని జొన్న అంబలి సిద్ధంగా ఉంటుంది!

- ఉల్లి,పచ్చిమిర్చి లేకుండానే జొన్న అంబలి తాగినా సూపర్‌గా ఉంటుంది.
- ఈ పద్ధతిని పాటిస్తూ ఇంట్లో చేశారంటే ఇంటిల్లిపాదీ ఒకటికి రెండు గ్లాసులు ఇష్టంగా తాగుతారు!
- మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఓసారి ట్రై చేసి చూడండి.
- మీరు ఈ అంబలిని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకంటే జొన్నపిండితో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
ఘుమఘుమలాడే "ఫిష్ కుర్మా" - ఈ పద్ధతిలో చేస్తే జిందగీ ఖుష్ అయిపోద్ది!
నోరూరించే "దోసకాయ కుర్మా" - అన్నం, చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది!

