ETV Bharat / offbeat

'జీడిపప్పు, కాకరకాయ కారం ఫ్రై' - ఇలా చేశారంటే పిల్లలూ ఇష్టంగా తింటారు!

చేదు తెలియకుండా కాకర కాయ వేపుడు - వేడివేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది!

kakarakaya_recipe_in_telugu
kakarakaya_recipe_in_telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 24, 2026 at 3:56 PM IST

2 Min Read
Choose ETV Bharat

kakarakaya recipe in telugu : జీడిపప్పుతో కలిపి కాకరకాయ ఫ్రై ట్రై చేయండి! పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాకరకాయలు సన్నగా కట్ చేసుకుని వేయించి ఆ తర్వాత ప్రత్యేకంగా కారం తయారు చేసుకుని కలిపి చేశారంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. కాకరకాయ అంటే మొహం తిప్పుకునే వాళ్లు సైతం ఇలాంటి రెసిపీతో కడుపు నిండా తినేస్తారు.

"టమోటా పచ్చడి" ఫ్యాన్స్​కి పండగే - పచ్చిమిర్చితో అద్భుతమైన చట్నీ మీకోసం!

kakarakaya_recipe_in_telugu
kakarakaya_recipe_in_telugu (getty images)

కావాల్సిన పదార్థాలు :

  • కాకరకాయలు - అర కేజీ
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు స్పూన్
  • ధనియాలు - 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర - అర స్పూన్
  • వెల్లుల్లి - 15
  • పచ్చి కొబ్బరి - అర చెక్క
  • ఎండు మిర్చి - 3
  • నూనె - 4 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - అర స్పూన్
  • మినపప్పు - అర స్పూన్
  • జీడిపప్పు - 15
  • కరివేపాకు - 1 రెమ్మ
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 2 స్పూన్లు
kakarakaya_recipe_in_telugu
kakarakaya_recipe_in_telugu (getty images)

తయారీ విధానం :

  • ముందుగా కాకరకాయలను శుభ్రం చేసుకుని అడ్డుకోతలో కట్ చేసుకోవాలి. గుండ్రగా, సన్నగా కట్ చేసుకోవాలి. పండిన కాకరకాయలను పక్కన పెట్టుకోవాలి. గింజలు లేకుండా చక్రాల మాదిరిగా కట్ చేసుకోవాలి. ఇపుడు కాకరకాయ ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకుని ఉప్పు, పసుపు వేసుకుని బాగా పట్టించి మూతపెట్టి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అర గంట తర్వాత ఓ సారి నీళ్లతో కడిగి శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లు లేకుండా బాగా పిండి తీసుకోవాలి.
kakarakaya_recipe_in_telugu
kakarakaya_recipe_in_telugu (getty images)
  • ఇపుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నూనె వేసుకుని కాకరకాయ ముక్కలను వేయించాలి. ముందుగా హై ఫ్లేమ్​లో ఆ తర్వాత సన్నటి మంటపై వేయించాలి. ఇపుడు ఓ మిక్సీలోకి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, ఎండు మిర్చి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి బదులు పల్లీలైనా వాడుకోవచ్చు. బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇపుడు కాకరకాయలు రంగు మారే వరకు వేయించుకోవాలి.
kakarakaya_recipe_in_telugu
kakarakaya_recipe_in_telugu (getty images)
  • గోల్డెన్ కలర్​లోకి వచ్చాక పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మిగిలిన నూనెలో పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకుని దోరగా వేయించాలి. అందులోనే జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు పలుకులు, కరివేపాకు వేసి వేయించాలి.
  • జీడిపప్పు రంగు మారిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన ధనియాలు, కొబ్బరి పొడి వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలపాలి. 2 నిమిషాల తర్వాత వేయించిన కాకరకాయ ముక్కలు వేసుకోవాలి.
  • ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని లో ఫ్లేమ్​లో వేయించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే కమ్మని కాకరకాయం కారం రెడీ! ఈ కాకరకాయ వేపుడు వేడి వేడిగా అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది.

కరకరలాడుతూ నోరూరించే "బీరకాయ గారెలు" - అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేస్తారు!

కరకరలాడే "అటుకుల సమోసాలు" - మైదా లేకుండా సింపుల్​గా ఇలా చేయండి!