తత్కాల్ బుక్ చేస్తున్నారా?- ఈ టిప్స్ ఫాలో అయితే టికెట్ కన్ఫార్మ్!
తత్కాల్ బుకింగ్‌లో ఇబ్బందులా? - ఈ పద్ధతిని ఓసారి ట్రై చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 28, 2026 at 4:54 PM IST
IRCTC Tatkal Ticket Booking Tips : దూర ప్రయాణాలు చేయాలన్నా? పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లాలన్నా? మెజార్టీ పీపుల్ రైలు ప్రయాణానికి ఆసక్తి చూపుతారు. ధర తక్కువగా ఉండటంతోపాటు జర్నీ కూడా సురక్షితంగా ఉంటుందని భావిస్తారు. అందుకే ముందుగానే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఉన్నట్టుండి ప్రయాణం చేయాల్సి వస్తుంది. దీనివల్ల ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం సాధ్యం కాదు. అప్పుడు తత్కాల్ టికెట్ బుక్ చేసుకునేందుకు చూస్తారు.
అయితే తత్కాల్ టికెట్లు దొరకడం అంతా ఈజీ కాదు. కేవలం సెకన్లలోనే హాట్‌కేకుల్లా ఇవి అమ్ముడుపోతుంటాయి. అయితే తత్కాల్ రేసులో ప్రతి సెకనూ కీలకమే. అందువల్ల వీటి బుకింగ్‌కు కేవలం వేగం మాత్రమే కాకుండా సరైన ప్రణాళికా కూడా అవసరమే. ఈ సమస్య నుంచి బయట పడి నిమిషాల్లోనే తత్కాల్ టికెట్లు కన్ఫార్మ్ కావాలంటే ఓసారి ఈ టిప్స్ ట్రై చేయండి.
ఆథార్ అథెంటికేషన్ :
- ఐఆర్‌సీటీసీ తత్కాల్ బుకింగ్ సంబంధించి జులై 1, 2025 నుంచి కొన్ని మార్పులు చేసింది. ఐఆర్‌సీటీసీ అకౌంట్‌తో ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేసింది. ఇది పూర్తి చేసిన వారికి మాత్రమే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్స్‌లో టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కాబట్టి మీ తత్కాల్ టికెట్ ఫాస్ట్‌గా బుక్ అవ్వాలంటే ఆథార్ అథెంటికేషన్ పూర్తి చేసి ఉండాలి.
- తత్కాల్ టికెట్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకునే అవకాశం ఉండదు. ఐఆర్‌సీటీసీ నిబంధనల ప్రకారం జర్నీకి ఒక రోజు ముందు మాత్రమే వీటిని బుక్ చేసుకోవాలి. ఏసీ బెర్తుల కోసం తత్కాల్ ఉదయం పది గంటలకు, నాన్ ఏసీకైతే ఉదయం పదకొండు గంటలకు బుకింగ్స్ మొదలవుతాయి. అందువల్ల చివరి నిమిషం వరకు వేచిచూడకుండా తత్కాల్ విండో ఓపెన్ కావడానికి రెండు మూడు నిమిషాల ముందే రైల్‌వన్ యాప్ లేదా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆఖరి నిమిషంలో లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే టైమ్- ఔట్ ఎర్రర్ నుంచి తప్పించుకోవచ్చు.
మాస్టర్ లిస్ట్ రెడీ చేసుకోవడం :
- తత్కాల్ టికెట్లు త్వరగా బుక్ అవ్వాలంటే ముందుగానే మాస్టర్ లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఇందుకోసం ప్రయాణికుల వివరాలను ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా రైల్‌వన్ యాప్‌లోని మాస్టర్ లిస్ట్‌లో ముందుగానే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా బుకింగ్ సమయంలో నేమ్, ఏజ్ టైప్ చేసే అవసరం తప్పుతుంది. అంతేకాక రిజర్వేషన్ ప్రక్రియను త్వరగా పూర్తవుతుంది. అయితే ఈ మాస్టర్ లిస్ట్‌లో కేవలం నలుగురు ప్రయాణికుల వివరాలను నమోదు చేసుకోవచ్చు.
పేమెంట్ ఆప్షన్లు రెడీగా ఉంచుకోవడం :
- అదేవిధంగా పేమెంట్ ఆప్షన్లు కూడా రెడీగా ఉంచుకోవాలి. వీలైతే ఐఆర్‌సీటీసీ వ్యాలెట్‌ను ఉపయోగించడం వల్ల పేమెంట్ ప్రాసెస్ మరింత ఫాస్ట్‌గా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఐఆర్‌సీటీసీ ఆర్-వ్యాలెట్/ఈ-వ్యాలెట్ లేదా నెట్‌బ్యాకింగ్/యూపీఐ ద్వారా త్వరగా పేమెంట్ అయ్యేలా జాగ్రత్తపడితే టికెట్లు బుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
- తత్కాల్ బుకింగ్‌లో టికెట్లు సెకన్ల వ్యవధిలోనే అయిపోతుంటాయి. అందుకే ఇంటర్నెట్ స్పీడే కాదు. మీ వేగమూ ముఖ్యమే. అలాగే, రైలు నంబర్లు, స్టేషన్ కోడ్‌లను ముందే నోట్ చేసుకోవడం ద్వారా వీటిని వెతికే సమయం కూడా తగ్గుతుంది.
ఫ్యామిలీతో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? - ఇలా ట్రైన్ లేదా కోచ్ మొత్తం బుక్ చేసుకోండి?
రైల్వే ప్రయాణికులకు అలర్ట్! - "విశాఖ-కాకినాడ-చర్లపల్లి" మధ్య ఈ ట్రైన్లు క్యాన్సిల్!

