మాన్సూన్ మున్నార్ టూర్ - తేయాకు తోటల్లో విహరించేలా IRCTC టూర్ ప్యాకేజీ!
ఐఆర్సీటీసీ మున్నార్ టూర్ - తక్కువ బడ్జెట్లో విహార యాత్ర!

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 3, 2026 at 12:58 PM IST
|Updated : July 3, 2026 at 1:38 PM IST
IRCTC Munnar Tour Packages Price : నైరుతి రుతు పవనాలు, చిరు జల్లులు కురుస్తున్న సమయంలో కేరళలో ప్రకృతి వాతావరణం ఆహ్లాదభరితంగా ఉంటుంది. కనుచూపు మేరలో ఎత్తైన కొండలు, కాఫీ తోటలు, చేతికందేదూరంలో మేఘాలు! ఊహించుకుంటే 'గాల్లో తేలినట్టుందే'! అన్నట్లుగా ఉంటుంది అక్కడి వాతావరణం. దీనికి తోడు కేరళ సంప్రదాయాలు, సముద్ర వెనుక జలాల్లో (లాగూన్లు) ప్రయాణం మిమ్మల్ని సరి కొత్త లోకంలోకి తీసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో IRCTC "కేరళ హిల్స్ &వాటర్" పేరుతో ఓ కొత్త ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. ప్రతి మంగళవారం ఈ ప్యాకేజీ ప్రయాణం అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
ప్యాకేజీ పేరు : కేరళ హిల్స్ &వాటర్
- సందర్శించే ప్రాంతాలు : మునార్, అలెప్పీ/కుమరకోం
- బయల్దేరు స్టేషన్ : సికింద్రాబాద్
- స్లీపర్, 3 ఏసీ - ప్రతి మంగళవారం
"హైదరాబాద్ టు గోవా" - IRCTC నాలుగు రోజుల ప్యాకేజీ!

కంఫర్ట్ 3 ఏసీ : సింగిల్ షేరింగ్ రూ.32400, రూ.18990, ట్రిపుల్ షేరింగ్ రూ.16750, 5-11ఏళ్ల పిల్లలకు రూ.8840, 5-11ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా రూ.8570
స్టాండర్డ్ స్లీపర్ : సింగిల్ షేరింగ్ రూ.29580, రూ.16170, ట్రిపుల్ షేరింగ్ రూ.13940, 5-11ఏళ్ల పిల్లలకు రూ.6420, 5-11ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా రూ.5750
ప్రయాణం ఇలా :
- మొదటి రోజు (మంగళవారం) : సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలు బయల్దేరుతుంది. రైలు నంబర్ 20629 మధ్యాహ్నం 2.45గంటలకు ప్రారంభమై రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
- రెండో రోజు (బుధవారం) : ఉదయం 11.30గంటలకు అలువా స్టేషన్ చేరుకుంటారు. ఐఆర్సీటీసీ సిబ్బంది మిమ్మల్ని పికప్ చేసుకుని 100కిలోమీటర్ల దూరంలోని మునార్ కారులో తీసుకెళ్తారు. అక్కడ హోటల్లో బసచేశాక సాయంత్రం మునార్ టౌన్ వీక్షించి అక్కడే రాత్రి బస చేస్తారు.
- మూడో రోజు (గురువారం) : ఉదయం ఎరవిక్కుళం జాతీయ పార్కు సందర్శన అనంతరం టీ మ్యూజియం, మెట్టుపట్టి డ్యాం ఎకో పాయింట్ సందర్శిస్తారు. తిరిగి మునార్లోనే రాత్రి బస చేస్తారు
- నాలుగో రోజు (శుక్రవారం): ఉదయాన్నే హోటల్ చెకౌట్ చేసి అలెప్పీ బయల్దేరుతారు. దాదాపు 170కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించి అక్కడి సముద్రపు బ్యాక్ వాటర్ వీక్షిస్తారు. రోజంతా అక్కడే ఉల్లాసంగా గడిపే అవకాశం ఉంటుంది. లోకల్ ప్యాకేజీలు మీరు స్వచ్ఛందంగా ఎంచుకోవాలి.(టూర్ ప్యాకేజీలో ఇవి అదనం)
- ఐదో రోజు (శనివారం) : అలెప్పీ నుంచి బయల్దేరి అక్కడికి 60కిలోమీటర్ల దూరంలోని ఎర్నాకుళం చేరుకుంటారు. అక్కడే బోర్డింగ్ సదుపాయం ఉంటుంది. తిరిగి ఉదయం 11.15గంటలకు శబరి ఎక్స్ప్రెస్ (20630)లో తిరుగు ప్రయాణం ఉంటుంది.
- ఆరో రోజు (ఆదివారం) : రాత్రంతా ప్రయాణించిన తర్వాత ఉదయం 11గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటారు.
పూర్తి వివరాలకు IRCTC దక్షిణ మధ్య రైల్వే జోనల్ కార్యాలయం లేదా 8287932229, 9701360701నంబర్లలో సంప్రదించవచ్చు.
జులై 4న "కాశీ, అయోధ్య, బైద్యనాథ్" క్షేత్రాలకు 'ప్రత్యేక రైలు' - రూ.16 వేలు కడితే చాలు!
"ఊటీ"లో మూడు రోజులు గడిపేద్దామా! - IRCTC ఆకర్షణీయమైన ప్యాకేజీ!

