ETV Bharat / offbeat

"యమునా పుష్కరాల స్పెషల్" - అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర

10రోజుల ప్రయాణం - అతి తక్కువ ధరలో IRCTC ప్యాకేజీ

yamuna_pushkaralu_2026
yamuna_pushkaralu_2026 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 2, 2026 at 12:34 PM IST

2 Min Read
Choose ETV Bharat

yamuna pushkaralu 2026 : యమునా నది పుష్కరాలు పురస్కరించుకుని IRCTC అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర ప్రత్యేక ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్​ ద్వారా ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్ క్లాస్ లో ప్రయాణం సాగించవచ్చు. మొత్తం పది రోజుల ఈ యాత్రలో ఆరు ప్రధాన క్షేత్రాలు దర్శించే అవకాశం ఉంది. ఇందులో పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్ దర్శించుకోవచ్చు అని IRCTC వెల్లడించింది.

"జీవితంలో ఒక్కసారైనా చార్​ధామ్​ యాత్ర" - 'IRCTC' ఫ్లైట్ జర్నీ ప్లాన్ ఇదే!

యాత్రలో ప్రధానాంశాలు

  • యాత్ర పేరు అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్
  • వ్యవధి 9 రాత్రులు, 10 రోజులు
  • యాత్ర ప్రారంభం : జూన్ 3
  • దర్శనీయ ప్రాంతాలు : పూరి, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్
  • బోర్డింగ్ స్టేషన్లు : కాజీపేట జంక్షన్, వరంగల్, ఖమ్మ, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్ల కోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం.

టికెట్ ధరలు (అన్ని పన్నులు కలిపి)

  1. ఎకానమీ స్లీపర్ : పెద్దలకు రూ.16,700, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.15,600
  2. స్టాండర్డ్ 3 ఏసీ : పెద్దలకు రూ.26,100, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.24,800
  3. కంఫర్ట్ 2 ఏసీ : పెద్దలకు రూ.34,100, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.32,500

దర్శించుకునే ఆలయాలు

  1. పూరీ : జగన్నాథ్ టెంపుల్, కోణార్క్ సూర్య దేవాలయం
  2. బైద్యనాథ్ ధామ్​ : బాబా బైద్యనాథ్ ఆలయం
  3. వారణాసి : కాశీ విశ్వనాథ్ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణదేవి ఆలయాలు, గంగాహారతి
  4. అయోధ్య : రామజన్మ భూమి, హనుమాన్గరి
  5. ప్రయాగరాజ్ : త్రివేణి సంగమం (యమునా పుష్కరాలు)

యాత్ర ఇలా

  • మొదటి రోజు ఉదయం 9గంటలకు సికింద్రాబాద్​లో రైలు బయల్దేరుతుంది. కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ మీదుగా ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు పూరీ చేరుకుని జగన్నాథ దర్శనం చేసుకుంటారు.
  • మూడో రోజు ఉదయం కోణార్క్ సూర్యదేవాలయం చేరుకుంటారు.
  • నాలుగో రోజున బాబా బైద్యనాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఉంటుమది.
  • ఐదో రోజు బనారస్ చేరుకుని అక్కడ నైట్ స్టే ఉంటుంది.
  • ఆరో రోజు కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటారు. అదే రోజు సాయంత్రం గంగాహారతి వీక్షించి అక్కడే రాత్రి బస చేస్తారు.
  • ఏడో రోజున రామ జన్మభూమి అయోధ్య సందర్శిస్తారు.
  • ఎనిమిదో రోజున పవిత్ర యమునా నదిలో పుష్కర స్నానం ఉంటుంది. సాయంత్రం తిరుగు ప్రయాణం ఉంటుంది.
  • తొమ్మిదో రోజున అర్ధరాత్రి లోగా గుడి వాడ చేరుకుంటారు.
  • పదో రోజున ఉదయం 9గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు.

పూర్తి వివరాలకు ఐఆర్​సీటీసీ సికింద్రాబాద్ - 9701360701, విజయవాడ - 9281030714, తిరుపతి, విశాఖపట్నంలోని కార్యాలయాల్లో సంప్రదించవచ్చు.

"హైదరాబాద్ టు విశాఖ, అరకు" - బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో IRCTC టూర్ ప్యాకేజీ

"మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్" - IRCTC జ్యోతిర్లింగాల యాత్ర!