IRCTC బంపర్ ఆఫర్! - 'హైలైట్స్ ఆఫ్ హైదరాబాద్ విత్ శ్రీశైలం'
రామోజీ ఫిలింసిటీతో పాటు శ్రీశైల క్షేత్ర దర్శనం - హైదరాబాద్ మొత్తం చుట్టేసిరావచ్చు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 3:57 PM IST
HIGHLIGHTS OF HYDERABAD WITH SRISAILAM : హైదరాబాద్‌లో ప్రముఖ పర్యటక ప్రాంతాలను కవర్ చేస్తూ, ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకునేలా ఐఆర్సీటీసీ యాత్రను ప్లాన్ చేసింది. 'హైలైట్స్ ఆఫ్ హైదరాబాద్ విత్ శ్రీశైలం' పేరిట ఈ యాత్రను నిర్వహిస్తోంది. టికెట్ ధరలు, యాత్ర వివరాలు. యాత్ర నాలుగు రోజులు, మూడు రాత్రులు ఉంటుంది.
టికెట్ ధరలు :
- ఇద్దరికి : స్టాండర్డ్ రూ. 20,630, కంఫర్ట్ రూ. 23,790
- ముగ్గురికి : స్టాండర్డ్ రూ. 15,000, కంఫర్ట్ రూ. 17,970
- 5-11 ఏళ్ల పిల్లలు బెడ్‌తో స్టాండర్డ్ రూ. 9,420, కంఫర్ట్ రూ. 12,020
- 5-11 ఏళ్ల పిల్లలు బెడ్ లేకుండా స్టాండర్డ్ రూ. 7,560, కంఫర్ట్ రూ. 9,420
"హైదరాబాద్ టు షిర్డీ" - సాయిబాబా భక్తులకు IRCTC బంపర్ ఆఫర్!
నియమనిబంధనలు :
- హోటల్ చెక్-ఇన్ సమయం మధ్యాహ్నం 12 గంటలు, అంతకు ముందుగా చెక్-ఇన్ అనేది గదుల లభ్యతపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.
- పర్యాటకులు హోటల్‌లో బస చేయడానికి ఏదైనా గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలి.
- సందర్శనీయ ప్రదేశాల వేళలను పాటించాలి.
- మొదటి, చివరి రోజు సందర్శనీయ ప్రదేశాల పర్యటన అందుబాటులో ఉన్న సమయంపై ఆధారపడి ఉంటుంది.
- హైదరాబాద్‌లో ఏసీ వసతి
- పేర్కొన్న విధంగా హోటల్‌లో రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం ఉంటుంది.
- శ్రీశైలం, హైదరాబాద్ ప్రయాణలో ఏసీ వాహనం సమకూరుస్తారు.
- ప్రణాళిక ప్రకారం అన్ని ప్రదేశాలు, విహారయాత్రలు ఉంటాయి.
- ప్రయాణ బీమా వర్తిస్తుంది.
- మధ్యాహ్న భోజనం, ఏవైనా అదనపు ఆహారం ఎవరికి వారే భరించాలి.
- రామోజీ ఫిలిం సిటీలో ఎంట్రీ టికెట్లు, భోజనం ఎవరికి వారే భరించాలి.
- శ్రీశైలంలో దర్శన టిక్కెట్లు, టూర్ గైడ్ సేవలు వ్యక్తిగతంగా భరించాలి.

తొలి రోజు : హైదరాబాద్
టికెట్ బుక్ చేసుకున్న వారిని హైదరాబాద్/సికింద్రాబాద్/కాచిగూడ రైల్వే స్టేషన్లలో పికప్ చేసుకుంటారు. హోటల్‌లో చెక్-ఇన్ చేసిన తర్వాత చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ సందర్శన ఉంటుంది. చివరగా హోటల్‌కు తిరుగు ప్రయాణమై అక్కడే రాత్రి భోజనం, బస చేయాల్సి ఉంటుంది.
రెండో రోజు : హైదరాబాద్ టు శ్రీశైలం
ఉదయం 5 గంటలకు హోటల్ నుంచి పికప్ చేసుకుని శ్రీశైలానికి బయల్దేరుతారు. దాదాపు 5గంటల ప్రయాణం ఉంటుంది. మీ స్వంత ఖర్చులతో అల్పాహారం చేయాల్సి ఉంటుంది. మల్లికార్జున జ్యోతిర్లింగ ఆలయం, పరిసర ప్రాంతాల సందర్శన అనంతరం మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రికి హైదరాబాద్ చేరుకుని భోజనం, బస అక్కడే ఉంటుంది.
మూడో రోజు : హైదరాబాద్
హోటల్‌లో అల్పాహారం చేసిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత హోటల్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. రాత్రి భోజనం, బస అక్కడే ఉంటుంది.
నాలుగో రోజు : హైదరాబాద్
హోటల్‌లో అల్పాహారం చేసిన తర్వాత చెక్-అవుట్ చేసి బిర్లా మందిర్ సందర్శిస్తారు. ఆ తర్వాత గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధుల సందర్శన ఉంటుంది. చివరగా సాయంత్రం హైదరాబాద్/సికింద్రాబాద్/కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద డ్రాప్ చేయడంతో యాత్ర ముగుస్తుంది.
- వివరాల కోసం సికింద్రాబాద్‌లోని IRCTC దక్షిణ మధ్య జోన్ కార్యాలయంలో లేదా ఈమెయిల్: bsashidhar5605@irctc.com, pawan5600@irctc.com చేయవచ్చు.
- 8287932229/8287932228, విజయవాడ రైల్వే స్టేషన్ : 8287932312, తిరుపతి రైల్వే స్టేషన్: 8287932317 నంబర్లలో సంప్రదించవచ్చు.
IRCTC సూపర్ టూర్ - 10 రోజుల్లో "సప్త జ్యోతిర్లింగాల" దర్శనం!
రైల్వే అవసరాలన్నింటికీ ఒకే యాప్ - రియల్ టైం సమాచారం దొరికేది ఇక్కడే!

