ETV Bharat / offbeat

"ఊటీ"లో మూడు రోజులు గడిపేద్దామా! - IRCTC ఆకర్షణీయమైన ప్యాకేజీ!

IRTC వేసవి ప్యాకేజీ - తక్కువ ధరలో ఆరు రోజుల టూర్

irctc_ooty_tour_package
irctc_ooty_tour_package (Gettyimages)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 14, 2026 at 3:36 PM IST

2 Min Read
Choose ETV Bharat

IRCTC OOTY TOUR PACKAGE : మండు టెండల్లో చాలా మంది టూర్ ప్లాన్ చేస్తుంటారు. వేసవి కావడంతో ఊటీ చల్లదనం ఆస్వాదించాలనిపిస్తుంది. ఈ నేపథ్యంలో IRCTC తక్కువ ధరల్లో ఊటీ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. ఆరు రోజుల ఈ యాత్రలో మూడు రాత్రులు ఊటీలోనే గడిపే అవకాశం ఉంటుంది.

"హైదరాబాద్ టు గోవా" - తేదీలు వెతుక్కునే పన్లేదు - ఇకపై వారంలో ప్రతీ రోజు రైలు!

irctc_ooty_tour_package
irctc_ooty_tour_package (Gettyimages)

ప్యాకేజీ పేరు : అల్టిమేట్ ఊటీ - హైదరాబాద్

  • రవాణా - రైలు, కారు
  • బయల్దేరు స్టేషన్ - సికింద్రాబాద్
  • క్లాస్ 3 ఏసీ, స్లీపర్
  • భోజనం : 3 సార్లు అల్పాహారం
irctc_ooty_tour_package
irctc_ooty_tour_package (Gettyimages)

టిక్కెట్ల ధరలు :

కంఫర్స్ 3ఏసీ : సింగిల్ షేరింగ్ రూ.33,590, డబల్ షేరింగ్ రూ.18,890, ట్రిపుల్ షేరింగ్ రూ.17170, 5-11ఏళ్లలోపు పిల్లలకు విత్ బెడ్ రూ.8,840, పిల్లలకు వితౌట్ బెడ్ రూ.6,490.

స్టాండర్డ్ స్లీపర్ : సింగిల్ షేరింగ్ రూ.31,050, డబల్ షేరింగ్ రూ.16,630, ట్రిపుల్ షేరింగ్ రూ.14,630, 5-11ఏళ్లలోపు పిల్లలకు విత్ బెడ్ రూ.6,300, పిల్లలకు వితౌట్ బెడ్ రూ.3,950.

irctc_ooty_tour_package
irctc_ooty_tour_package (Gettyimages)

ప్రయాణం ఇలా :

  • తొలి రోజు (మంగళవారం) : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.25గంటలకు శబరి ఎక్స్​ప్రెస్ (రైలు నంబర్ 20629) బయల్దేరుతుంది. బీబీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా రాత్రంతా ప్రయాణం ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకున్న వారు బోర్డింగ్ స్టేషన్లు ఎంచుకోవచ్చు.
  • రెండో రోజు (బుధవారం) : రైలు ఉదయం 9.10గంటలకు కోయంబత్తూర్ స్టేషన్ చేరుకుంటుంది. అక్కడ పికప్ చేసుకుని 90కిలో మీటర్ల దూరంలోని ఊటీకి కారులో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ హోటల్​లో చెకిన్ చేసి మధ్యాహ్నం బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్ సందర్శిస్తారు. తిరిగి రాత్రంతా అక్కడే బస చేస్తారు.
  • మూడో రోజు (గురువారం) : ఉదయం అల్పాహారం చేసిన తర్వాత దొడబెట్ట శిఖరంతో పాటు టీ మ్యూజియం, పైకారా జలపాతం సందర్శిస్తారు. రాత్రంతా ఊటీలోనే బస చేస్తారు.
  • నాలుగో రోజు (శుక్రవారం) : ఉదయం అల్పాహారం చేసిన తర్వాత కూనూరు సైట్ సందర్శిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నానికి తిరిగి ఊటీ చేరుకుని రాత్రంతా అక్కడే బస చేస్తారు.
  • ఐదో రోజు (శనివారం) : బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నానికి హోటల్ చెకౌట్ చేసి కోయంబత్తూర్ చేరుకుంటారు. తిరిగి అక్కడి నుంచి మధ్యాహ్నం 3.40గంటలకు శబరి ఎక్స్​ప్రెస్​ (రైలు నంబర్ 20630)లో సికింద్రాబాద్ బయల్దేరుతారు.
  • ఆరో రోజు (ఆదివారం) : ఉదయం 11గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.
irctc_ooty_tour_package
irctc_ooty_tour_package (Gettyimages)

ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణ టికెట్లు, కోయంబత్తూరు నుంచి ఊటీ, సందర్శించే ప్రాంతాలకు కారులో తీసుకెళ్తారు. 3 రాత్రులు నాన్ ఏసీ గదుల్లో బస ఏర్పాటు చేస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.

ఇక లంచ్, డిన్నర్, అదనపు ఆహార ఖర్చులు మీరే భరించాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ఎంట్రీ టికెట్లు, బోటింగ్, హార్స్ రైడింగ్, ఇతర వినోద కార్యక్రమాల ఫీజులు ఎవరికి వారే భరించాలి.

"ఈ పెళ్లి నాకొద్దు" - చీరె నచ్చలేదని వధువు పేచీ - పెళ్లి మండపంలో పెద్ద గొడవ!

అరుదైన పక్షిని చూడాలనుకుంటే 'హంటా వైరస్' మింగేసింది - వెలుగులోకి ఆసక్తికర విషయాలు!