ETV Bharat / offbeat

"హైదరాబాద్ టు గోవా" - IRCTC నాలుగు రోజుల ప్యాకేజీ!

ఫ్లైట్ జర్నీ ప్లాన్ చేసిన ఐఆర్​సీటీసీ - టిక్కెట్, టూర్ వివరాలివే

goa_tour
goa_tour (Getty images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 13, 2026 at 11:06 AM IST

2 Min Read
Choose ETV Bharat

Goa Tour planning : అందమైన బీచ్​లు, దేశ, విదేశీ పర్యటకుల సందడితో గోవా పర్యాటకం ఎంతో పేరొందింది. ఇక్కడికి వెళ్లిన ప్రతి పర్యాటకుడు మధుర జ్ఞాపకాలతో తిరిగొస్తుంటారు. కోల్వా కాండోలిమ్, మిరామార్, అంజునా, వర్కా వంటి సముద్ర తీర బీచ్​లు ఎంతో ఉత్సాహాన్నిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది పర్యాటకుల అక్కడికి వెళ్తున్నారు. మీరు సైతం దేశంలోనే పర్యాటకపరంగా ఎంతో అభివృద్ధి చెందిన గోవా వెళ్లాలనుకుంటున్నారా? అయితే, IRCTC టూర్ ప్లాన్ చేసింది. ప్యాకేజీ, ధరలు, పూర్తి వివరాలు ఇవీ.

ఐఆర్​సీటీసీ బంపరాఫర్ - రూ.16 వేలకే అయోధ్య - కాశీ పుణ్యక్షేత్ర యాత్ర!

goa_tour
goa_tour (Getty images)

ప్యాకేజీ : గోవా డిలైట్

  • 3 రాత్రులు, 4పగళ్లు
  • ప్రయాణం : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి
  • ప్రయాణ తేది : సెప్టెంబర్ 9
  • ఫ్లైట్ నంబర్ 6E 905 హైదరాబాద్ నుంచి ఉదయం 11.45 గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 1.05గంటలకు గోవా చేరుకుంటుంది.
  • ఫ్లైట్ నంబర్ 6E 712 గోవా నుంచి మధ్యాహ్నం 1.40 గంటలకు బయల్దేరి 03.05గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
goa_tour
goa_tour (Getty images)

టిక్కెట్ల ధర

  • కంఫర్ట్ సింగిల్ ఆక్యుపెన్సీ రూ.24,640 డబల్ రూ.19,200 ట్రిపుల్ రూ.18,680, 2-11ఏళ్ల పిల్లలకు రూ.15,520 2-4ఏళ్ల పిల్లలకు రూ.9,130
goa_tour
goa_tour (Getty images)

పర్యటన ఇలా

తొలి రోజు : శంషాబాద్​ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిర్ణీత సమయానికి బయల్దేరాల్సి ఉంటుంది. గోవా చేరుకోగానే అక్కడ పికప్ చేసుకుని రోడ్డు మార్గంలో హోటల్​కు తీసుకెళ్తారు. చెకిన్ చేశాక సాయంత్రం లోకల్ మార్కెట్ చూసుకుని తిరిగి హోటల్ చేరుకుంటారు. డిన్నర్, రాత్రి బస అక్కడే ఉంటుంది.

రెండో రోజు సౌత్ గోవా పర్యటన : హోటల్​లో అల్పాహారం చేసిన తర్వాత ప్రయాణం ఉంటుంది. సౌత్ గోవా సైట్ సీయింగ్, ఓల్డ్ గోవా చర్చ్, మ్యూజియం, శ్రీమంగేషి ఆలయం, మిరామార్ బీచ్, మండోవీ నదిపై బోట్ క్రూయీజ్ పర్యటన సాయంత్రం 6నుంచి 7గంటల వరకు గంట సమయం ఉంటుంది. ఆ తర్వాత తిరిగి హోటల్ చేరుకుని డిన్నర్, బస అక్కడే ఉంటుంది.

goa_tour
goa_tour (Getty images)

మూడో రోజు నార్త్ గోవా పర్యటన : ఉదయం అల్పాహారం చేసిన తర్వాత నార్త్ గోవా పర్యటన ఉంటుంది. ఇందులో భాగంగా అగోడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్, వాటర్ స్పోర్ట్స్, అంజునా బీచ్, వగాటర్ బీచ్ తర్వాత చాపోరా పోర్ట్​ సందర్శిస్తారు. తిరిగి హోటల్ గదికి చేరుకుని డిన్నర్, రాత్రి బస అక్కడే ఉంటుంది.

నాలుగో రోజు : ఉదయం అల్పాహారం చేసిన తర్వాత హోటల్ చెక్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎయిర్​ పోర్టుకు చేరుకుంటారు. నిర్ణీత సమయానికి ప్రయాణించి హైదరాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ప్యాకేజీలో అంతర్భాగం : విమాన ప్రయాణ టిక్కెట్లు, హోటల్ లో ఏసీ విడిది, 3 రోజులు అల్పాహారం, డిన్నర్, అంతర్గత ఏసీ రవాణా సదుపాయం ఉంటుంది.

పూర్తి వివరాలకు సికింద్రాబాద్​లోని ఐఆర్​సీటీసీ జోనల్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్లు 040 27702407, 9701360701

"యమునా పుష్కరాల స్పెషల్" - అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర

"జీవితంలో ఒక్కసారైనా చార్​ధామ్​ యాత్ర" - 'IRCTC' ఫ్లైట్ జర్నీ ప్లాన్ ఇదే!