ETV Bharat / offbeat

రాగిపిండితో మృదువైన "ఇడ్లీలు" - పిండి రుబ్బకుండానే అప్పటికప్పుడు ప్రిపేర్​ చేసుకోవచ్చు!

రాగిపిండితో ఇడ్లీలు - సింపుల్​గా ఇలా చేయండి టేస్ట్ అద్దిరిపోతాయి!

Ragi Idli
Ragi Idli (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 1, 2026 at 10:06 AM IST

2 Min Read
Choose ETV Bharat

Ragi Idli Recipe in Telugu : ఉదయాన్నే తేలికగా ఉండే బ్రేక్​ఫాస్ట్​ తినాలనుకునే వారికి ఇడ్లీలు మంచి ఆప్షన్!​ అయితే మాములుగా వీటిని చేయాలంటే పప్పు నానబెట్టి రుబ్బాలి. ఆ తర్వాత రవ్వ కలిపి పులియబెట్టి వీటిని చేయాలి. దీనికి టైమ్ ఎక్కువగా పడుతుంది​. ఈ నేపథ్యంలోనే చాలా మంది వారానికి సరిపడా ఇడ్లీ పిండి రుబ్బి ఫ్రిడ్జ్​లో స్టోర్​ చేస్తుంటారు! అయితే సమయానికి కొన్ని సార్లు పిండి అయిపోతే చాలా మంది కంగారు పడుతుంటారు.

ఇడ్లీలు ఎలా చేయాలని మదనపడుతుంటారు. అందుకే మీకోసం పిండి ముందే ప్రిపేర్​ చేసే పనిలేకుండా ఇన్​స్టంట్​గా ఇడ్లీలు చేసుకునే రెసిపీని తీసుకొచ్చాం. ఇలా రాగిపిండితో ఇడ్లీలు చేశారంటే ఎంతో మెత్తగా రుచికరంగా వస్తాయి. వీటిని చేయడానికి పెద్దగా సమయం కూడా పట్టదు. నిమిషాల్లోనే వేడివేడిగా తయారు చేసుకోవచ్చు. ఇక పిల్లలు, పెద్దలైతే చట్నీ అవసరం లేకుండానే వీటిని ఒకటికి రెండు ఇష్టంగా లాగిస్తారు. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

న్యూ ఇయర్​ వేడుకల్లో "సింపుల్ స్వీట్" ట్రై చేయండి - ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకోండి!

Ragi Idli
రాగిపిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • రాగిపిండి - ఒక కప్పు
  • బొంబాయి రవ్వ - ఒక కప్పు
  • పెరుగు - ఒక కప్పు
  • వంటసోడా - 1 టీ స్పూన్
  • ఉప్పు - తగినంత
  • నెయ్యి - సరిపడా

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం మిక్సింగ్ బౌల్లో కప్పు రాగిపిండి, కప్పు బొంబాయి రవ్వ వేసి కలపాలి. ఇందులోనే కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ వంటసోడా యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇప్పు సరిపడా నీటిని కొద్దికొద్దిగా పోస్తూ ఇడ్లీ పిండి మాదిరిగా కలపాలి. అనంతరం పిండిపై మూతపెట్టి 15 నిమిషాల పాటు పక్కనుంచాలి.
  • పదిహేను నిమిషాల తర్వాత పిండిలో కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్స్ చేయాలి.
Ragi Idli
పెరుగు (Getty Images)
  • ఇంకోవైపు స్టవ్​ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో సరిపడా నీళ్లు పోసి మరిగించాలి. ఈలోపు ఇడ్లీ ప్లేట్స్​ మీద కొద్దిగా నెయ్యి అప్లై చేసి పిండిని వేయాలి.
  • ఇడ్లీ పాత్రలో ప్లేట్స్​ ఉంచి మూత పెట్టాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
  • ఇడ్లీలు ఉడికిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
Ragi Idli
బొంబాయి రవ్వ (Getty Images)
  • ఐదు నిమిషాల తర్వాత వేడివేడి రాగి ఇడ్లీలను ప్లేట్​లోకి సర్వ్ చేసుకోవాలి.
  • ఈ రాగి ఇడ్లీలను మీకు నచ్చిన చట్నీ లేదా, సాంబార్​తో తింటే సూపర్​ అనాల్సిందే.
  • ఇలా చేసి పెడితే పిల్లలు ఒకటి రెండు ఎక్కువగా తింటారు. అంతేకాక వారికి ఫేవరెట్​ రెసిపీగా మారుతుంది.
  • మీరు రాగి ఇడ్లీలను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే రాగిపిండి, బొంబాయి రవ్వతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

"సింపుల్, టేస్టీ కేక్ రెసిపీ" - ఇంట్లోనే ఇలా చేస్తే "బేకరీ కేక్" దండగ అంటారు!

ఘుమఘుమలాడే "వెజిటేరియన్స్ స్పెషల్ రెసిపీ" - న్యూ ఇయర్ వేడుకల్లో ఇలాంటి ఫుడ్ ఆస్వాదించండి!