ETV Bharat / offbeat

బెండకాయలతో ఇంటిల్లిపాదీకి నచ్చే "పచ్చడి​"- ఇలా మిక్సీ పట్టి చేస్తే సూపర్ టేస్ట్!

బెండకాయతో సింపుల్​గా చేసుకునే రెసిపీ - ఈ పద్ధతిలో చేస్తే చేస్తే నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

Bendakaya Pachadi
Bendakaya Pachadi (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 5:26 PM IST

2 Min Read
Choose ETV Bharat

Bendakaya Pachadi Recipe in Telugu : బెండకాయతో కర్రీ, ఫ్రై, పులుసు, లాంటివి చేస్తుంటారు. ఇందులో పచ్చడి కూడా ఒకటి. ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కాస్త భిన్నంగా ఓసారి ఇలా బెండకాయలను మిక్సీ పట్టి పచ్చడి చేశారంటే ఇంటిల్లిపాదీ కమ్మగా, కడుపునిండా తింటారు. దీని తయారీకి ఎక్కువ టైమ్ కూడా పట్టదు. కొత్తగా చేసే వారు కూడా ఈ స్టెప్స్ పాటిస్తూ క్విక్​గా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీని ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఇడ్లీ, దోసెల్లోకి "ఘీ కారం పొడి" - కమ్మగా, కారంగా అద్భుతంగా ఉంటుంది!

Bendakaya Pachadi
బెండకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బెండకాయలు - 500 గ్రాములు
  • పచ్చిమిర్చి - 15
  • టమోటాలు - 8
  • నూనె - 6 స్పూన్లు
  • కరివేపాకు - కొద్దిగా
  • చింతపండు - కొంచెం
  • ధనియాలు - 2 స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • జీలకర్ర - 2 స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • వేయించిన పల్లీలు - 30 గ్రాములు
  • కొత్తిమీర - కొద్దిగా
  • తాలింపు దినుసులు - రెండు స్పూన్లు
  • కరివేపాకు - కొంచెం
  • ఎండుమిర్చి - 4
Bendakaya Pachadi
టమోటాలు (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా అర కిలో బెండకాయలు, ఎనిమిది టమోటాలు, 15 పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్​లో మూడు స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసి కలపాలి. ఆ తర్వాత మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి.
  • బెండకాయ ముక్కలు చక్కగా వేగాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి బెండకాయ ముక్కలను ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
Bendakaya Pachadi
కరివేపాకు (Getty Images)
  • ఇదే పాన్​లో రెండు స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు వేసి ఫ్రై చేయాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా చింతపండు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు మూతపెట్టి టమోటాలు మెత్తబడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ వేయించాలి.
  • ఈ మిశ్రమం మంచిగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
Bendakaya Pachadi
పచ్చిమిర్చి (Getty Images)
  • అనంతరం మిక్సీజార్​లో ఆరు వెల్లుల్లి రెబ్బలు, రెండు స్పూన్ల జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 30 గ్రాములు వేయించిన పల్లీలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయాలి. ఇందులోనే వేయించిన బెండకాయ ముక్కలు, టమోటాపచ్చిమిర్చి మిశ్రం యాడ్ చేసి కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి.
  • మరోవైపు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక స్పూన్ నూనె వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక రెండు స్పూన్ల తాలింపు దినుసులు, నాలుగు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేయాలి.
Bendakaya Pachadi
వెల్లుల్లి (Getty Images)
  • ఇప్పుడు తాలింపును గ్రైండ్ చేసి పెట్టుకున్న బెండకాయ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేయాలి.
  • అంతే సరికొత్త రుచితో బెండకాయ పచ్చడి మీ ముందుంటుంది!

ఘుమఘుమలాడే "మష్రూమ్ కర్రీ" - కొత్త వాళ్ల కోసం సింపుల్ పద్ధతి!

నోటికి కొత్త రుచినిచ్చే "టమోటా మెంతి సోయా కర్రీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్​గా చేసేయొచ్చు!