ETV Bharat / offbeat

నోరూరించే "అరిసెలు" - పాకం పట్టకుండానే పావు గంటలో రెడీ!

అరిసెలను ఇలా ట్రై చేయండి - ఇంటిల్లిపాదీ వన్స్​మోర్ అంటారంతే!

Ariselu
Ariselu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 22, 2026 at 11:43 AM IST

2 Min Read
Choose ETV Bharat

Instant Ariselu Prepare : అరిసెలను చాలా మంది ఇష్టంగా తింటారు. ఇవి మెత్తగా ఉంటూ నోట్లో వేసుకోగానే కరిగిపోతూ తిన్నాకొద్ది తినాలనిపిస్తాయి. కానీ ఇవి చేయాలంటే బియ్యం నానబెట్టి పిండి పట్టించాలి. ఆ తర్వాత పాకం ప్రిపేర్ చేయాలి. ఒకవేళ పాకం పర్ఫెక్ట్​గా రాకపోతే ఇవి పాడైనట్లే. అయితే ఇకపై ఆ అవసరం లేకుండానే పాకం పట్టే పనిలేకుండానే చాలా సింపుల్​ వీటిని చేసుకోవచ్చు. మొదటి సారి చేసే వారు కూడా ఈ పద్ధతిని పాటిస్తూ పర్ఫెక్ట్​గా చేయొచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.

టమోటాలు ఎండబెట్టకుండానే - అప్పటికప్పుడు చేసుకునే నిల్వ పచ్చడి!

Ariselu
బియ్యప్పిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యప్పిండి - 2 కప్పులు
  • బెల్లం తురుము - 2 కప్పులు
  • యాలకుల పొడి - 2 టీ స్పూన్లు
  • గోధుమపిండి - ఒక కప్పు
  • నెయ్యి - సరిపడా
  • నువ్వులు - 8 టేబుల్ స్పూన్లు
  • ఆయిల్ - డీప్ ఫ్రైకి సరిపడా
Ariselu
గోధుమపిండి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల బియ్యప్పిండి, ఒక కప్పు గోధుమపిండి వేసి కలిపి పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో రెండు కప్పుల బెల్లం తురము, మూడు కప్పుల నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగాక రెండు టీ స్పూన్ల యాలకుల పొడి, నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసి మిక్స్ చేయాలి. (బెల్లం కరిగితే చాలు పాకం పట్టాల్సిన పనిలేదు).
Ariselu
బెల్లం తురుము (Getty Images)
  • ఈ మిశ్రమం బాగా కలిశాక గోధుమపిండిబియ్యప్పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలపాలి. అనంతరం మంటను లో ఫ్లేమ్​లో ఉంచి మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ దీనిని దగ్గరపడే వరకు ఉడికించాలి. పిండి ముద్దలాగా దగ్గరపడి పాన్​ నుంచి సెపరేట్​ అయిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి చల్లారనివ్వాలి.
  • అదేవిధంగా ఓ గిన్నెలోకి నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి పక్కనుంలి.
Ariselu
నెయ్యి (Getty Images)
  • పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసి ఓ మూడు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి. అనంతరం పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి.
  • మరోవైపు స్టవ్​ ఆన్​ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బటర్​ పేపర్​ లేదా పాలిథీన్ కవర్ మీద నెయ్యి అప్లై చేయాలి.
  • ఇప్పుడు ఒక్కొ పిండి ముద్దను తీసుకుని నువ్వులు వేసిన గిన్నెలో ముంచి చేతితో అరిసెల మాదిరిగా చేసి పక్కనుంచాలి.
Ariselu
నువ్వులు (Getty Images)
  • అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె కాగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి కడాయికి సరిపడా అరిసెలను వేయాలి.
  • ఆ తర్వాత అరిసెలను రెండు వైపులా టర్న్ చేస్తూ దోరగా కాల్చి ప్లేట్​లో సర్వ్ చేసుకోవాలి.
  • అంతే నోరూరించే అరిసెలు మీ ముందుంటాయి!
  • అనంతరం వీటిని ఎయిర్​టైట్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే సరి.

ఘుమఘుమలాడే "ఫిష్ కుర్మా" - ఈ పద్ధతిలో చేస్తే జిందగీ ఖుష్ అయిపోద్ది!

బియ్యప్పిండితో "మైసూర్ బోండాలు" - ఇలా చేస్తే క్రంచీగా, గుల్లగా వస్తాయి!