ETV Bharat / offbeat

మిగిలిపోయిన ఇడ్లీలతో "బజ్జీలు" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

ఈవెనింగ్ టైమ్​కి సూపర్​ స్నాక్ రెసిపీ - ఇంటిల్లిపాదీ వావ్ అనాల్సిందే!

Idli Bajji
Idli Bajji (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 19, 2026 at 4:08 PM IST

2 Min Read
Choose ETV Bharat

Idli Bajji Making in Telugu : సాధారణంగా ఇండ్లలో టిఫిన్స్​లోకి చాలా మంది మైసూర్​ బోండా, పూరీ, దోసె వంటివి ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మరికొందరు ఇడ్లీ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ కొన్నిసార్లు ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతుంటాయి. వాటిని పడేయాలంటే బాధగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొందరు వీటితో ఉప్మా, చాట్​ లాంటివి ప్రిపేర్ చేస్తారు. ఇవే కాకుండా ఓసారి ఇలా బజ్జీలు చేశారంటే ఈవెనింగ్​ టైమ్​కి పర్ఫెక్ట్​గా సెట్​ అవుతాయి. ఇలా చేసి పెడితే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు! మరి ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

రాగిపిండితో పసందైన "అప్పాలు" - పాకం పట్టకుండానే పావు గంటలో రెడీ!

Idli Bajji
ఇడ్లీలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఇడ్లీలు - 4
  • బియ్యప్పిండి - 2 స్పూన్లు
  • శనగపిండి - 5 స్పూన్లు
  • జీలకర్ర పొడి - అర స్పూన్
  • కారం - అర స్పూన్
  • వాము - అర స్పూన్
  • వంటసోడా - చిటికెడు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆయిల్ - తగినంత
Idli Bajji
శనగపిండి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా నాలుగు ఇడ్లీలను తీసుకొని నిలువుగా ముక్కలుగా కట్ చేసి పక్కనుంచాలి.
  • ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఐదు స్పూన్ల శనగపిండి, రెండు స్పూన్ల బియ్యప్పిండి, అర స్పూన్ కారం వేయాలి. ఇందులోనే అర స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంటసోడా వేసి కలపాలి. ఆ తర్వాత సరిపడా నీళ్లు పోస్తూ పిండిని బజ్జీ పిండి మాదిరిగా బాగా మిక్స్ చేసి ఐదు నిమిషాల పాటు పక్కనుంచాలి.
Idli Bajji
బియ్యప్పిండి (Getty Images)
  • 5 నిమిషాల అనంతరం పిండిని మరోసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత ఇడ్లీ ముక్కలను తయారు చేసుకున్న మిశ్రమంలో ముంచి కాగుతున్న నూనెలో కడాయికి సరిపడా వేయాలి.
  • ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి బజ్జీలను రెండువైపులా టర్న్ చేస్తూ గోల్డెన్​ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఆ తర్వాత వీటిని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఎక్సెస్​ ఆయిల్​ను టిష్యూ పేపర్ పీల్చుతుంది.
Idli Bajji
కారం (Getty Images)
  • అంతే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ బజ్జీలు రెడీ అయినట్లే!
  • ఆ తర్వాత ఈ బజ్జీలపై కాస్త చాట్​​ మసాలా చల్లి సర్వ్ చేసుకుంటే చాలు. వీటిని ఈవెనింగ్ టైమ్​లో టమోటా సాస్‌, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పైన నిమ్మరసం పిండి తింటే ఆహా అనాల్సిందే!
Idli Bajji
ఉప్పు (Getty Images)
  • మీరు ఈ బజ్జీలను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే ఇడ్లీలు, శనగపిండితో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

నోటికి ఏమీ తినబుద్ధి కావట్లేదా? - ఇలా "బీట్​రూట్ రసం" ట్రై చేయండి!

పాతకాలం నాటి "కంద కోడిగుడ్డు పులుసు" - ఈ రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!