ETV Bharat / offbeat

శనగపిండితో "దోసెలు" - పప్పు రుబ్బే పని లేకుండానే అప్పటికప్పుడు రెడీ!

రోజూ అవే దోసెలు ఏం తింటారు - ఓసారి ఇలా కొత్తగా ట్రై చేయండి!

Besan Dosa
Besan Dosa (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 3, 2026 at 2:34 PM IST

2 Min Read
Choose ETV Bharat

Besan Dosa Making in Telugu : అందరి ఇండ్లలో శనగపిండి కామన్​గా ఉంటుంది. చాలా మంది​ ఈ పిండితో బజ్జీలు, పకోడీలు, మురుకులు అంటూ వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అయితే కేవలం ఇవి మాత్రమే కాకుండా దీనితో నిమిషాల్లోనే క్రిస్పీ దోసెలు చేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి పప్పులు నానబెట్టి రుబ్బే పనిలేకుండానే ఇవి తయారవుతాయి. ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​కి​ ఏం చేయాలో తోచనప్పుడు ఇవి పర్ఫెక్ట్​ ఆప్షన్​. అంతేకాక వీటిని చేయడానికి ఎక్కువ టైమ్​ కూడా పట్టదు. ఒక్కసారి ఇలా చేసి పెడితే పిల్లలు, పెద్దలూ ఒకటికి రెండు ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.

ఉల్లి, వెల్లుల్లి లేకుండానే "దహీ కిచిడీ" - ఒక్కసారి తింటే టేస్ట్​కు ఫిదా!

Besan Dosa
శనగపిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - 2 కప్పులు
  • పచ్చిమిర్చి - 2
  • ఉల్లిపాయలు - 4
  • క్యారెట్ - 2
  • టమోటాలు - 2
  • పసుపు - అర టీ స్పూన్
  • కారం - అర టీ స్పూన్
  • వాము - అర టీ స్పూన్
  • మిరియాల పొడి - అర టీ స్పూన్
  • జీలకర్ర - 1 టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఇంగువ - 4 చిటికెడ్లు
  • కొత్తిమీర - కొద్దిగా
  • ఆయిల్ - తగినంత
Besan Dosa
టమోటా ముక్కలు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా నాలుగు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి, రెండు టమోటాలను తరిగి ఉంచాలి. అనంతరం వీటిని మిక్సీజార్​లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
  • ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసుకున్న ఉల్లిపచ్చిమిర్చి మిశ్రమం, రెండు కప్పుల శనగపిండి వేసి కలపాలి. ఇందులోనే అర టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అదేవిధంగా అర టీ స్పూన్ వాము, నాలుగు చిటికెడ్ల ఇంగువ, కొద్దిగా కొత్తిమీర తరుగు యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి.
Besan Dosa
క్యారెట్ (Getty Images)
  • అనంతరం తగిన్నని నీళ్లు పోస్తూ పిండిని దోసె పిండి కన్సీస్టెన్సీ వచ్చేలా కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. పది నిమిషాల తర్వాత పిండిని మరోసారి మిక్స్ చేయాలి.
  • ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దోసె పాన్​ పెట్టాలి. పెనం హీట్ అయ్యాక పిండిని గరిటెతో తీసుకొని దోసె మాదిరిగా పోయాలి. ఆపైన ఆయిల్ వేసి మూత పెట్టాలి.
Besan Dosa
జీలకర్ర (Getty Images)
  • రెండు నిమిషాల తర్వాత దోసెను మరోవైపు టర్న్​చేస్తూ కాల్చుకోవాలి. దోసె రెండువైపులా చక్కగా కాలిన తర్వాత ప్లేట్​లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మిగిలిన పిండితో సింపుల్​గా దోసెలు ఇలా వేసుకుంటే సరిపోతుంది.
  • అంతే శనగపిండితో వేడివేడి దోసెలు మీ ముందుంటాయి!
Besan Dosa
వాము (Getty Images)
  • ఈ దోసెలను పల్లీ లేదా టమోటా లేదా పుదీనా చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది!
  • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది.

మసాలా ఘాటుతో అద్దిరిపోయే "మటన్ దో ప్యాజా" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

చింతపండు లేకుండానే "చేపల పులుసు" - ఇలా చేసి తింటే జిందగీ ఖుష్ అయిపోద్ది!