ETV Bharat / offbeat

కరకరలాడే "రవ్వ మురుకులు" - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

మురుకులను ఓసారి ఇలా ట్రైసి చూడండి - టేస్ట్ సూపర్​గా ఉంటాయి!

Rava Murukulu
Rava Murukulu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 2, 2026 at 2:22 PM IST

2 Min Read
Choose ETV Bharat

Rava Murukulu Making in Telugu : చాలా మంది పిండి వంటల్లో మురుకులను ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు. తక్కువ టైమ్​లో తక్కువ పదార్థాలతో ఎవరైనా ఈజీగా చేసే విధంగా ఉండటంతో వీటిని చేయడానికి మొగ్గుచూపుతారు. ఇవి టేస్ట్​లో కూడా ఏ మాత్రం తీసిపోవు. కారంకారంగా కరకరలాడే వీటిని పిల్లలు, పెద్దలూ ఇష్టంగా తింటారు. ఇవి చేయడానికి మినప్పిండి, శనగపిండిని వాడతారు. ఇలా రోజూ తిన్నా బోర్ కొడుతుంది.

అందుకే ఇవాళ మీకోసం ఓ కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అవే రవ్వ మురుకులు. వీటిని ఇంట్లోనే సింపుల్​గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాక క్రిస్పీగా, గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. వీటిని ఎయిర్​టైట్ డబ్బాలో వేసి పెడితే మెత్తబడకుండా 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి! పిల్లలకు ఇలా చేసి స్నాక్స్ టైమ్​లో పెడితే వారి ఫేవరెట్ ఫుడ్ అవడం ఖాయం! మరీ టేస్టీటేస్టీ రవ్వ మురుకులు ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఆంధ్రా స్టైల్ "పాలకూర పప్పు" - వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే!

Rava Murukulu
బొంబాయి రవ్వ (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ - ఒక కప్పు
  • ఆయిల్ - సరిపడా
  • కారం - 1 టీ స్పూన్
  • వాము - 1 టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బియ్యప్పిండి - 2 కప్పులు
Rava Murukulu
బియ్యప్పిండి (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్​లో రెండు కప్పుల నీళ్లు, రెండు టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. అలాగే ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మరిగించాలి.
  • వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కప్పు బొంబాయి రవ్వను కొద్దికొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత మూతపెట్టి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి.
  • పది నిమిషాల తర్వాత ఈ మిశ్రమంలో రెండు కప్పుల బియ్యప్పిండి వేసి కలపాలి. అనంతరం కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని సాఫ్ట్​గా మిక్స్ చేయాలి.
Rava Murukulu
కారం (Getty Images)
  • అనంతరం మురుకుల గొట్టంలో స్టార్​ షేప్ ఉన్న బిళ్లను ఉంచి ఆయిల్ వేయాలి. ఆ తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఇందులో పెట్టి ఓ ప్లేట్​లో మురుకుల మాదిరిగా వత్తుకోవాలి.
  • అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి కడాయికి సరిపడా మురుకులను వేయాలి.
Rava Murukulu
వాము (Getty Images)
  • అనంతరం మురుకులను రెండు వైపులా టర్న్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత వీటిని ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • అంతే నోరూరించే రవ్వ మురుకులు రెడీ అయినట్లే!
  • ఆ తర్వాత వీటిని ఎయిర్​టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి!
  • మీరు ఈ మురుకులను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే బొంబాయి రవ్వతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.

సరికొత్తగా "ఎండు రొయ్యల పచ్చడి" - ఆ రుచికి మైమరచిపోతారు!

కర్ణాటక స్పెషల్ "క్యాబేజీ కుర్మా" - ఒక్కసారి తిన్నారంటే అదరహో అనాల్సిందే!