ETV Bharat / offbeat

పులావ్​ టేస్టీగా ఉండాలా? - ఇంట్లోనే "మసాలా పౌడర్​" చేసుకోండి! - రెండు నెలలు నిల్వ!

- మార్కెట్లో కొనే పనిలేకుండా పులావ్​ మసాలా పౌడర్​ - అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

Instant Pulao Masala Powder
Instant Pulao Masala Powder (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 19, 2026 at 11:30 AM IST

2 Min Read
Choose ETV Bharat

Instant Pulao Masala Powder : పులావ్​ పేరు చెబితే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరాల్సిందే. అందుకే చాలా మంది బిర్యానీతో సమానంగా పులావ్​ను ఇంట్లో ప్రిపేర్​ చేసుకుని తింటుంటారు. అయితే, పులావ్​ టేస్టీగా తినేకొద్ది తినాలనిపించేలా ఉండాలంటే అందులో వాడే పదార్థాలు ముఖ్యం. మరీ, ముఖ్యంగా మసాలా అనేది ఈ రెసిపీలో కీ రోల్​ ప్లే చేస్తుంది. అందుకే చాలా మంది బయట నుంచి బ్రాండెడ్​ కంపెనీ మసాలా పౌడర్​ను కొనుగోలు చేస్తుంటారు. అయితే, కొన్నప్పుడు బాగానే ఉన్నా కొన్నిరోజులకు ఘాటు తగ్గడం జరుగుతుంటుంది. ఈ సమస్య లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్​గా పులావ్​ మసాలా పౌడర్ ప్రిపేర్​ చేసుకోవచ్చు. అది కూడా చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా కమ్మని పులావ్​ మసాలా పౌడర్ ఎలా చేసుకోవాలో చూసేయండి.

Instant Pulao Masala Powder
Instant Pulao Masala Powder (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • ధనియాలు - 6 టేబుల్​ స్పూన్లు
  • లవంగాలు - 20
  • దాల్చిన చెక్క - 4 ఇంచ్​లు
  • యాలకులు - 40
  • సోంపు - 2 టేబుల్​ స్పూన్లు
  • అనాస పువ్వులు - 3
  • జాపత్రి - కొద్దిగా
  • మరాఠీ మొగ్గ - 4
  • ఎండుమిర్చి - 5
  • మిరియాలు - 1 టేబుల్​ స్పూన్​
  • జాజికాయ - పావు ముక్క
  • బిర్యానీ ఆకులు - 4
Instant Pulao Masala Powder
Instant Pulao Masala Powder (Getty Images)

తయారీ విధానం :

  • ముందుగా యాలక్కాయలలో ఉండే గింజలు సెపరేట్​ చేసుకోవాలి. పొట్టును పక్కన పెట్టుకోవాలి.
  • అడుగు మందంగా ఉన్న కడాయిలోకి ధనియాలు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకుల గింజలు, సోంపు, అనాస పువ్వులు, జాపత్రి, మరాఠీ మొగ్గ, ఎండుమిర్చి, మిరియాలు, జాజికాయ, బిర్యానీ ఆకులు వేసుకుని అన్ని పదార్థాలను ఓసారి కలుపుకోవాలి.
Instant Pulao Masala Powder
Instant Pulao Masala Powder (Getty Images)
  • స్టవ్​ ఆన్​ చేసి మసాలా దినుసులు ఉన్న కడాయి పెట్టి లో- ఫ్లేమ్​లో కలుపుతూ వేయించాలి. సుమారు 5 నిమిషాల పాటు మగ్గించాలి.
  • మసాలా దినుసులు దోరగా వేగి మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
  • మసాలా దినుసులు పూర్తిగా చల్లారినాక మిక్సీజార్​లోకి వేసి వీలైనంత మెత్తగా మధ్యమధ్యలో ఆపుతూ మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
Instant Pulao Masala Powder
Instant Pulao Masala Powder (Getty Images)
  • ఈ విధంగా గ్రైండ్​ చేసుకున్న పొడిని ఓ ప్లేట్​లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అనంతరం తడిలేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుంటే పులావ్​ మసాలా పౌడర్​ రెడీ.
  • ఇక దీనిని కప్పు బియ్యానికి ముప్పావు స్పూన్‌ పులావ్‌ మసాలా సరిపోతుంది. ఈ ఇన్‌స్టంట్‌ పౌడర్‌తో పనీర్, మష్రూమ్, నవాబీ పులావ్‌.. ఏదైనా చేసుకోవచ్చు.
Instant Pulao Masala Powder
Instant Pulao Masala Powder (ETV Bharat)

చిట్కాలు:

  • మసాలా దినుసులను కేవలం లో-ఫ్లేమ్​లోనే కలుపుతూ వేయించాలి. అలాగే దోరగా వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయిస్తే చేదు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
  • ఈ మసాలా దినుసులను పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్​ చేసుకోవాలి. వేడి మీద అయితే ముద్దలాగా అవుతుంది.
  • అదే విధంగా మసాలా పొడిని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డబ్బాలో స్టోర్​ చేసుకోవాలి. వేడి మీద నిల్వ చేస్తే తేమ వచ్చే అవకాశం ఉంటుంది.
  • ఈ మసాలా పొడి బయట అయితే నెలరోజులు, ఫ్రిజ్​లో అయితే రెండు నెలలపైనే నిల్వ ఉంటుంది.

పిల్లల లంచ్​ బాక్స్​ ఖాళీ అవ్వట్లేదా? - ఇలా "పొటాటో రైస్​" పెట్టండి - సూపర్​గా తింటారు!

అద్భుతమైన రుచితో "ఫ్రూట్​ పాయసం" - ఫ్రూట్​ కస్టర్డ్​ను మించిన టేస్ట్!