ETV Bharat / offbeat

బియ్యప్పిండితో "గుంత పొంగనాలు" - పావుగంటలోనే రెడీ!

దోసె, ఇడ్లీ పిండితో పొంగనాలు రొటీన్​ - ఇలా బియ్యప్పింతో ఓసారి ట్రై చేయండి!

Rice Flour Ponganalu
Rice Flour Ponganalu (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 16, 2026 at 1:14 PM IST

2 Min Read
Choose ETV Bharat

Rice Flour Ponganalu in Telugu : మెజార్టీ పీపుల్​కి పొంగనాలు ఫేవరెట్​ రెసిపీ అని చెప్పొచ్చు! తక్కువ నూనెతో చేసుకునే వీటిని మార్నింగ్​ లేదా ఈవెనింగ్​ టైమ్​లో ఎక్కువగా చేస్తుంటారు. అయితే నార్మల్​గా ఇవి చేయాలంటే దోసె లేదా​ ఇడ్లీ పిండిని వాడతారు. కానీ బియ్యప్పిండితో కూడా కమ్మని పొంగనాలు చేసుకోవచ్చని మీకు తెలుసా? లేదంటే మాత్రం ఈ స్టెప్స్ పాటిస్తూ చేస్తే టేస్ట్​ చాలా బాగుంటాయి. చాలా తక్కువ పదార్థాలతో పావుగంటలోనే రెడీ అవుతాయి. అలాగే ఉల్లి, పచ్చిమిర్చి, క్యారెట్​ వంటివి యాడ్​ చేయడం వల్ల ఎక్ట్రా టేస్ట్ కూడా​ వస్తుంది. బిగినర్స్ కూడా ఈ పద్ధతిలో చేస్తే ఇంటిల్లిపాదీ సూపర్ అనాల్సిందే. మరి లేట్​ చేయకుండా బియ్యప్పిండితో కమ్మని పొంగనాలు ఎలా చేయాలో చూసేయండి.

ఆలూ కాంబో​లో అద్దిరిపోయే "బ్రోకలీ కర్రీ" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

Rice Flour Ponganalu
బియ్యప్పిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యప్పిండి - ఒక కప్పు
  • పెరుగు - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 2
  • అల్లం తరుగు - 1 టీ స్పూన్
  • క్యారెట్ - 1
  • కొత్తిమీర - కొద్దిగా
  • వంటసోడా - చిటికెడు
Rice Flour Ponganalu
పెరుగు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచాలి.
  • ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో కప్పు బియ్యప్పిండి, అర కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి, క్యారెట్ తరుగు, ఒక టీ స్పూన్ అల్లం తరుగు, అర కప్పు నీళ్లను కొద్దికొద్దిగా పోస్తూ పిండిని మిక్స్ చేయాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు, చిటికెడు వంటసోడా వేసి కలపాలి. ఆ తర్వాత పిండిపై మూతపెట్టి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి.
Rice Flour Ponganalu
క్యారెట్ (Getty Images)
  • పది నిమిషాల అనంతరం పిండి మిశ్రమాన్ని మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి గుంత పొంగనాల పెనం పెట్టి హీట్​ చేయాలి.
  • పెనం హీట్​ అయ్యాక నూనె పోసి వేడి చేయాలి. కాగిన నూనెలో కలిపి పెట్టుకున్న పిండిని గరిటె సాయంతో కొద్దికొద్దిగా వేయాలి. అనంతరం మంటను లో టూ మీడియం ఫ్లేమ్​లో ఉంచి పొంగనాలు ఓవైపు కాలిన తర్వాత మరోవైపు టర్న్​ చేస్తూ కాల్చుకోవాలి.
Rice Flour Ponganalu
పచ్చిమిర్చి (Getty Images)
  • ఇలా రెండు వైపులా పొంగనాలు మంచి గోల్డెన్​ కలర్​లోకి వచ్చాక ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి.
  • అంతే బియ్యప్పిండి ఇన్​స్టంట్​గా గుంత పొంగనాలు రెడీ అయినట్లే
Rice Flour Ponganalu
కొత్తిమీర (Getty Images)
  • మిగిలిన పిండిని కూడా ఇలా గుంత పొంగనాలుగా చేసి నచ్చిన చట్నీతో తింటే ఏం టేస్ట్ గురూ అనాల్సిందే!
  • మీరు ఈ పొంగనాలను ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే బియ్యప్పిండి, పెరుగుతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
  • ఈ పద్ధతిని పాటిస్తూ ఓసారి ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది!

నోటికి కొత్త రుచినిచ్చే "టమోటా మెంతి సోయా కర్రీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్​గా చేసేయొచ్చు!

ఇడ్లీ, దోసెల్లోకి "ఘీ కారం పొడి" - కమ్మగా, కారంగా అద్భుతంగా ఉంటుంది!