రాగిపిండితో పసందైన "అప్పాలు" - పాకం పట్టకుండానే పావు గంటలో రెడీ!
రాగిపిండితో సింపుల్‌గా చేసుకునే స్వీట్ రెసిపీ - అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 15, 2026 at 5:09 PM IST
Instant Ragi Appalu in Telugu : ఇండ్లలో వివిధ రకాల తినుబండరాలు చేస్తుంటారు. ఇందులో స్వీట్, హాట్ ఉంటాయి. అయితే ఎప్పుడూ చేసే మిఠాయిలే కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అలాంటి వారి కోసమే ఓ రెసిపీ ఎదురుచూస్తుంది. అదే రాగి అప్పాలు. ఈ స్టెప్స్ పాటిస్తూ చేస్తే క్రిస్పీగా వచ్చి చాలా రుచికరంగా ఉంటాయి. పాకం పట్టాల్సిన పని లేకుండానే దీనిని సింపుల్‌గా చేసుకోవచ్చు. తక్కువ పదార్థాలతో నిమిషాల్లోనే తయారవుతాయి. వీటిని ఒక్కసారి ప్రిపేర్ చేశారంటే 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి! మరి నోరూరించే ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.
జిగురు లేకుండా "బెండకాయ పచ్చడి" - రోటి పచ్చడిలా అద్భుతంగా ఉంటంది!

కావాల్సిన పదార్థాలు :
- రాగిపిండి - ఒకటిన్నర కప్పులు
- గోధుమపిండి - అర కప్పు
- ఎండుకొబ్బరి ముక్కలు - పావు కప్పు
- యాలకులు - 6
- ఉప్పు - చిటికెడు
- నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
- బెల్లం తురుము - ఒక కప్పు
- నెయ్యి - కొద్దిగా
- ఆయిల్ - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం :
- ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా కావాల్సిన పరిమాణంలో ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీజార్‌లో తరిగి ఉంచిన ఎండు కొబ్బరి ముక్కలు, ఆరు యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
- అలాగే మిక్సింగ్ బౌల్లో ఒకటిన్నర కప్పుల రాగిపిండి, అర కప్పు గోధుమపిండి వేసి కలపాలి. ఇందులో గ్రైండ్ చేసిన కొబ్బరి పొడి మిశ్రమం, రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు, చిటికెడు ఉప్పు యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి.

- అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో కప్పు బెల్లం తురుము, అర కప్పు నీళ్లు పోయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కలుపుతూ బెల్లాన్ని కరిగించాలి. పాకం అవసరం లేకుండా బెల్లం పూర్తిగా కరిగాక స్టవ్ ఆఫ్ చేయాలి.
- అనంతరం కలిపి పెట్టుకున్న రాగిపిండి మిశ్రమంలో బెల్లం వాటర్‌ను వేసి పిండిని మీడియం సాఫ్ట్‌గా కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి 15 నిమిషాల పాటు పక్కనుంచాలి.

- పదిహేను నిమిషాల అనంతరం పిండిని మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ప్లాస్టిక్ కవర్ లేదా బటర్ పేపర్ మీద లైట్‌గా నెయ్యి అప్లై చేసి ఒక్కొ ఉండను ఉంచి చేతితో అప్పాల మాదిరిగా చేసి పక్కనుంచాలి.
- మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తయారు చేసుకున్న అప్పాలను కడాయికి సరిపడా వేసి ఒక నిమిషం పాటు అలాగే వదిలేయాలి.

- ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అప్పాలను రెండు వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. అనంతరం వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి.
- అంతే నోరూరించే రాగి అప్పాలు రెడీ అయినట్లే!
- ఈ రాగి అప్పాలను ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 20 రోజుల పాటు నిల్వ ఉంటాయి!
ఆలూ కాంబోలో అద్దిరిపోయే "బ్రోకలీ కర్రీ" - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!
ఆంధ్రా స్టైల్ "పుల్ల గోంగూర పచ్చడి" - ఆమ్లెట్ వేసుకుని తింటుంటే అద్దిరిపోతుంది!

