ETV Bharat / offbeat

"పిజ్జాలాంటి దోసె" - గ్రైండర్​తో పనే లేదు!

ఇన్​స్టెంట్ బ్రేక్ ఫాస్ట్ - అప్పటికప్పుడు పిండి కలుపుకొని రెడీ చేసుకోవడమే!

instant_dosa_batter_recipe
instant_dosa_batter_recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 22, 2026 at 3:10 PM IST

2 Min Read
Choose ETV Bharat

INSTANT DOSA RECIPE IN TELUGU : దోసెలు వేయడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముందు రోజుగా పప్పు, బియ్యం నానబెట్టుకుని గ్రైండ్ చేసి పులియబెట్టిన తర్వాత దోసెలు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇలాంటి దోసెలు అప్పటికప్పుడు టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మామూలు దోసెలకంటే ఎంతో రుచిగా ఉండే ఈ దోసెలు టమోటా చట్నీ లేదా ఉరగాయచట్నీతో కూడా తినేయొచ్చు. కొత్తగా కావాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన చట్నీ ట్రై చేసి చూడండి.

పుట్నాలతో కరకరలాడే "పప్పు ఉండలు" - పంటికి అతుక్కోకుండా ఇలా ట్రై చేయండి!

instant_dosa_batter_recipe
instant_dosa_batter_recipe (Getty images)

కావల్సిన పదార్థాలు :

  • బియ్యం పిండి - కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మిరియాల పొడి - అర టీ స్పూన్
  • జీలకర్ర పొడి - అర టీ స్పూన్
  • ఉల్లిపాయ - 1
  • క్యారెట్ తురుము - 1
  • పచ్చిమిర్చి తురుము - 1
  • కొత్తిమీర తురుము - కొద్దిగా
instant_dosa_batter_recipe
instant_dosa_batter_recipe (Getty images)

చట్నీ కోసం :

  • పల్లీలు - అర కప్పు
  • పచ్చి కొబ్బరి - అర కప్పు
  • నూనె - 1 టేబుల్ స్పూన్
  • పచ్చిమిర్చి - 2
  • జీలకర్ర - అర స్పూన్
  • ఉల్లిపాయలు - 1
  • వెలుల్లి - 6
  • కరివేపాకు - 1 రెమ్మ
  • చింతపండు - చిటికెడు
  • ఉప్పు - తగినంత
  • పచ్చి కొబ్బరి - అర కప్పు
  • పల్లీలు - అర కప్పు
  • పుట్నాల పప్పు - అర కప్పు

పోపు కోసం :

  • నూనె - 1 స్పూన్
  • పచ్చి శనగపప్పు - 1 స్పూన్
  • ఎండుమిర్చి - 2
  • మినప్పప్పు - అర స్పూన్
  • జీలకర్ర - అర స్పూన్
  • ఆవాలు - అర స్పూన్
  • కరివేపాకు - 1 రెమ్మ
instant_dosa_batter_recipe
instant_dosa_batter_recipe (Getty images)

తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్​లోకి కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అంటే దాదాపు 50 గ్రాముల పిండి వేసుకుని రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని పిండి ఉండలు కట్టకుండా నీళ్లు పోసుకుని విస్కర్​తో బాగా కలుపుకోవాలి.
  • ఇపుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము వేసుకుని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఈ లోగా చట్నీ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకుని నూనె వేడెక్కగానే ఉల్లిపాయలు, వెలుల్లి కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుని వేయించాలి. ఆ తర్వాత చల్లార్చుకుని మిక్సీలోకి తీసుకోవాలి. అందులోనే చింతపండు, ఉప్పు, అర కప్పు పచ్చి కొబ్బరి, అర కప్పు వేయించిన పల్లీలు, జీలకర్రతో పాటు పుట్నాల పప్పుకూడా వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • చట్నీలోకి పోపు కోసం చిన్న కడాయిలో నూనె వేసుకుని వేడెక్కగానే పచ్చి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత వేడి వేడి పోపును చట్నీలో కలుపుకుంటే సరిపోతుంది.
  • ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని కాస్త నూనె వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దోసె పిండి ఓ సారి కలుపుకొని దోసె వేసుకోవాలి. ఇలా వేసుకున్న దోసె అంచులు కాలిన తర్వాత అట్ల కాడతో తీసుకోవాలి.

ఎప్పుడూ ఒకేరకం పులావ్ బోర్​ కొడుతుందా? - "ఉడుపి హోటల్ వెజ్ పులావ్" ట్రై చేయండి!

టెంపుల్ స్టైల్ "మిరియాల పులిహోర" - ఇలా చేస్తే కమ్మగా, కడుపునిండా తినేస్తారు!