ETV Bharat / offbeat

అప్పటికప్పుడు చేసుకునే కమ్మని "పెరుగు వడలు" - టేస్ట్​ అద్దిరిపోతాయి!

-పప్పులు నానబెట్టే పనిలేకుండా చేసుకునే రెసిపీ - చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు!

Instant Dahi Vada Recipe
Instant Dahi Vada Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 2, 2026 at 5:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

Instant Dahi Vada Recipe: టిఫెన్స్​లోకి ప్లెయిన్​ వడలు కన్నా దహీ వడలను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే పెరుగు వడలను చేయాలంటే కాస్త టైమ్​ టేకింగ్ ప్రాసెస్​. ముందురోజే పప్పును నానబెట్టి రుబ్బి వడలుగా చేసి ఆ తర్వాత మిగిలిన పని చేయాలి. అయితే ఇకపై ఇదంతా లేకుండా చాలా టేస్టీగా, అప్పటికప్పుడు దహీ వడలు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడం చాలా సింపుల్​. మినప్పప్పు నానబెట్టే పనిలేకుండా శనగపిండితో ఈజీగా చేసుకోవచ్చు. మరి లేట్​ చేయకుండా కమ్మని దహీ వడ ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

పెరుగు తాలింపు కోసం:

  • పెరుగు - 4 కప్పులు
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • ఆవాలు - అర టీస్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • పచ్చిమిర్చి - 2
  • అల్లం ముక్క - చిన్నది
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఎండుమిర్చి - 3
  • పసుపు - పావు టీస్పూన్​
  • ఇంగువు - పావు టీస్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Instant Dahi Vada
Instant Dahi Vada (Getty Images)

వడల కోసం:

  • శనగపిండి - 1 కప్పు
  • గోధుమపిండి - అర కప్పు
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • పచ్చిమిర్చి - 2
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • బేకింగ్​ సోడా - పావు టీస్పూన్​
Instant Dahi Vada
Instant Dahi Vada (Getty Images)

తయారీ విధానం:

  • అల్లం, పచ్చిమిర్చిని మిక్సీజార్​లో వేసి బరకగా గ్రైండ్​ చేసి తీసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
  • ఇవి వేగినాక గ్రైండ్​ చేసిన పచ్చిమిర్చి పేస్ట్​, కరివేపాకు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించాలి.
  • ఇవి కూడా ఫ్రై అయ్యాక పసుపు, ఇంగువ వేసి ఓ నిమిషం వేయించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • వెడల్పాటి మిక్సింగ్​ బౌల్​లోకి పెరుగు తీసుకోవాలి. అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి స్మూత్​గా అయ్యేవరకు మిక్స్​ చేసుకోవాలి.
  • ఇప్పుడా ఆ పెరుగులోకి తాలింపు మిశ్రమం, కొత్తిమీర తరుగు వేసి కలిపి ఫ్రిజ్​లో పెట్టుకోవాలి.
  • మిక్సింగ్​ బౌల్​లోకి శనగపిండి, గోధుమపిండి, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, ఉప్పు, బేకింగ్​ సోడా వేసి ఓసారి మిక్స్​ చేసుకోవాలి.
Instant Dahi Vada
Instant Dahi Vada (Getty Images)
  • అనంతరం కొద్దికొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ గట్టిగా, మరీ లూజుగా కాకుండా పునుగులు వేసుకునేందుకు సరిపడేలా మిక్స్ చేసుకోవాలి.
  • పిండిలో వాటర్​ సరిపోయాయి అనుకున్న తర్వాత ఓ 5 నిమిషాల పాటు ఆపకుండా బీట్​ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె కాగినాక పిండిని కొద్దికొద్దిగా తీసుకుని పునుగుల మాదిరి వేసుకోవాలి. కడాయికి సరిపడా వేగాక మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి వేయించుకోవాలి.
Instant Dahi Vada
Instant Dahi Vada (Getty Images)
  • ఇవి గోల్డెన్​ కలర్​లోకి మారినాక తీసి గిన్నెలోకి వేసుకోవాలి. ఇలానే పిండి మొత్తాన్ని పునుగులు చేసి తీసుకోవాలి.
  • వెడల్పాటి గిన్నెలోకి నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అనంతరం ఆ వాటర్​లోకి వేయించిన పునుగులు వేసి ఓసారి చేతితో కలిపి మూత పెట్టి పావుగంట సేపు అలానే వదిలేయాలి.
  • ఆ తర్వాత ఒక్కక్క వడను నీళ్లు లేకుండా పిండి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని వాటర్​ లేకుండా తీసేసి గిన్నెలోకి సెట్​ చేసుకోవాలి.
  • అనంతరం ఈ వడల మీద కలిపి పెట్టుకున్న పెరుగును మిశ్రమాన్ని వేసి పైన గార్నిష్​ కోసం క్యారెట్​ తురుము, కొత్తిమీర తరుగు వేసి ఓ అరగంట పాటు పక్కన ఉంచాలి.
  • ఆ తర్వాత సర్వ్​ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఇన్​స్టంట్​ పెరుగు వడలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Instant Dahi Vada
Instant Dahi Vada (ETV Bharat)

బ్రెడ్​తో నోరూరించే కస్టర్డ్ స్వీట్ - తియ్య తియ్యగా అద్దిరిపోద్ది!

సండే స్పెషల్​: పుల్లగా, కారంగా "గోంగూర రొయ్యల కూర" - టేస్ట్​ అద్దిరిపోతుంది!