ETV Bharat / offbeat

నోరూరించే "చిల్లీ పనీర్ 65" - ఇలా చేస్తే ఒక్క ముక్క మిగల్చరు!

పనీర్​తో ఇంటిల్లిపాదీ మెచ్చే రెసిపీ - ఈ పద్ధతిలో చేస్తే అద్భుతంగా వస్తుంది!

Chilli Paneer 65
Chilli Paneer 65 (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 24, 2026 at 6:20 PM IST

3 Min Read
Choose ETV Bharat

Chicken 65 Recipe in Telugu : ఇండ్లలో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అయినా పిల్లలు, పెద్దలూ కొత్తగా ఏదైనా చేయమని అడుగుతుంటారు. అలాంటి వారికోసమే ఇవాళ ఓ కొత్త రెసిపీని తీసుకొచ్చాం. అదే చిల్లీ పనీర్ 65. కరకరలాడుతూ కమ్మగా ఉండే ఈ స్టార్టర్​ను పిల్లలైతే ముక్క మిగల్చకుండా కమ్మగా, కడుపునిండా తింటారు. మరి ఇక లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా?

బియ్యప్పిండితో "మైసూర్ బోండాలు" - ఇలా చేస్తే క్రంచీగా, గుల్లగా వస్తాయి!

Chilli Paneer 65
పనీర్ ముక్కలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • పనీర్ ముక్కలు - 300 గ్రాములు
  • ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
  • జీలకర్ర పొడి - 2 టీ స్పూన్లు
  • మైదాపిండి - 1 టీ స్పూన్
  • కార్న్​ఫ్లోర్ - 1 టీ స్పూన్
  • పసుపు - 1 టీ స్పూన్
  • కారం - 1 టీ స్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్
  • నిమ్మరసం - 1 టీ స్పూన్
  • ఆయిల్ - సరిపడా
  • పెరుగు - ముప్పావు కప్పు
  • కారం - 2 టీ స్పూన్లు
  • మిరియాల పొడి - 1 టీ స్పూన్
  • రెడ్ చిల్లీ సాస్ - అర టేబుల్ స్పూన్
  • డార్క్ సోయా సాస్ - అర టేబుల్ స్పూన్
  • అల్లంవెల్లుల్లి తరుగు - 2 టేబుల్ స్పూన్లు
  • ఎండుమిర్చి - 5
  • కరివేపాకు - కొద్దిగా
  • ఉల్లిపాయ - 1
  • టమోటా కెచప్ - 1 టీ స్పూన్
  • అరోమాట్ పౌడర్ - అర టీ స్పూన్
  • తేనె - అర టీ స్పూన్
  • పచ్చిమిర్చి - 5
  • కొత్తిమీర - కొద్దిగా
Chilli Paneer 65
ఉల్లిపాయ ముక్కలు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా 300 గ్రాముల పనీర్, ఒక ఉల్లిపాయ, ఐదు పచ్చిమిర్చిని ముక్కలుగా తరిగి ఉంచాలి.
  • ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో తరిగి ఉంచిన పనీర్ ముక్కలు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ మైదాపిండి వేయాలి. అలాగే ఒక టీ స్పూన్ కార్న్​ఫ్లోర్, అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి కలపాలి.
  • ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె కాగిన తర్వాత పనీర్ ముక్కలను వేయాలి. ఆ తర్వాత వీటిని గోల్డెన్​ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి ఓ ప్లేట్​లోకి వేసి చల్లారనివ్వాలి.
Chilli Paneer 65
కారం (Getty Images)
  • ఇంకో గిన్నెలో ముప్పావు కప్పు పెరుగు వేసి గడ్డలు లేకుండా బాగా కలపాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ మిరియాల పొడి, అర టేబుల్ స్పూన్ రెడ్ చీల్లీ సాస్ వేయాలి. అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్​ ధనియాల పొడి, అర టీ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ యాడ్ చేసి మిక్స్ చేయాలి.
  • అనంతరం స్టవ్ ఆన్ చేసి పాన్​లో రెండు టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లంవెల్లుల్లి తరుగు, ఐదు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
Chilli Paneer 65
పెరుగు (Getty Images)
  • ఆనియన్స్ వేగాక రెడీ చేసుకున్న పెరుగు మిశ్రమం, ఒక టీ స్పూన్ టమోటా కెచప్​, ఒక టీ స్పూన్ అరోమాట్ పౌడర్, కొద్దిగా నీళ్లు పోసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న పనీర్ ముక్కలను యాడ్ చేసి మంటను హై ఫ్లేమ్​లో ఉంచి ఫ్రై చేయాలి.
  • ఈ మిశ్రమం వేగిన తర్వాత అర టీ స్పూన్ తేనె, కొద్దిగా కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
Chilli Paneer 65
కరివేపాకు (Getty Images)
  • అంతే ఘుమఘుమలాడే చిల్లీ పనీర్ 65 మీ ముందుంటుంది!
  • మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఓసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి.

కరకరలాడుతూ నోరూరించే "బీరకాయ గారెలు" - అద్భుతమైన రుచిని ఎంజాయ్ చేస్తారు!

ఉల్లి ఆకుతో పసందైన "ఎగ్​ కర్రీ" - అన్నం, చపాతీల్లోకి అద్భుతమైన కాంబో!