ETV Bharat / offbeat

నోటికి ఏమీ తినబుద్ధి కావట్లేదా? - ఇలా "బీట్​రూట్ రసం" ట్రై చేయండి!

కమ్మని బీట్​రూట్ రసం - వేడివేడి అన్నంలోకి అద్దిరిపోతుంది!

Beetroot Rasam
Beetroot Rasam (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 2:01 PM IST

2 Min Read
Choose ETV Bharat

Beetroot Rasam Making in Telugu : బీట్​రూట్ పచ్చిగా తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ, ఇదంటే నచ్చనివాళ్లూ కూడా ఇష్టంగా తినేలా చేసే ఓ రెసిపీ ఉంది. అదే నోరూరించే బీట్​రూట్ రసం. ఒక్కసారి ఈ స్టెప్స్ పాటిస్తూ చేశారంటే మళ్లీమళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. పైగా దీని తయారీకి ఎక్కువ సమయం కూడా పట్టదు. అప్పటికప్పుడు చాలా సింపుల్​గా తయారు చేసుకోవచ్చు. రొటీన్ పచ్చళ్లు, కూరలు, రసం తిని బోర్ కొట్టిన వారికి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్​ను ఇస్తుంది.

హెల్దీ, టేస్టీ 'స్ప్రౌట్స్ సలాడ్' - బ్యాచిలర్స్ కూడా ఈజీగా, ఫాస్ట్​గా చేసుకోవచ్చు!

Beetroot Rasam
బీట్​రూట్ (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బీట్​రూట్ - 2
  • చింతపండు - 20 గ్రాములు
  • టమోటా - 1
  • ధనియాలు - 1 టీ స్పూన్
  • జీలకర్ర - ఒకటిన్నర టీ స్పూన్
  • మెంతులు - చిటికెడు
  • మిరియాలు - అర టీ స్పూన్
  • ఆయిల్ - 1 టేబుల్ స్పూన్
  • ఆవాలు - పావు టీ స్పూన్
  • వెల్లుల్లి రెబ్బలు - 6
  • ఎండుమిర్చి - 3
  • కరివేపాకు - కొద్దిగా
  • ఇంగువ - చిటికెడు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - అర టీ స్పూన్
  • పసుపు - పావు టీ స్పూన్
  • కొత్తిమీర - కొంచెం
Beetroot Rasam
వెల్లుల్లి (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా గిన్నెలో 20 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. పది నిమిషాల తర్వాత ఇందులో ఒక టమోటా వేసి చేతితో కలపాలి.
  • ఇంకోవైపు మిక్సీజార్​లో ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు మెంతులు, అర టీ స్పూన్ మిరియాలు వేసి గ్రైండ్ చేయాలి.
Beetroot Rasam
చింతపండు (Getty Images)
  • అలాగే రెండు బీట్​రూట్​ను పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీజార్​లో తరిగి ఉంచిన బీట్​రూట్ ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టాలి.
  • ఆ తర్వాత బీట్​రూట్​ మిశ్రమాన్ని వడగట్టి గిన్నెలో వేయాలి. ఇందులో నానబెట్టిన చింతపండు రసం వేసి కలపాలి.
Beetroot Rasam
ఆవాలు, జీలకర్ర (Getty Images)
  • అనంతరం స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె పోయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఇందులోనే ఆరు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, మూడు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేయాలి.
  • ఈ మిశ్రమం వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ధనియాల మిరియాల పొడి, చిటికెడు ఇంగువ వేసి కలపాలి. ఆ తర్వాత బీట్​రూట్ రసం పోయాలి. ఇప్పుడు పులుపుకు సరిపడా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మిక్స్ చేయాలి.
Beetroot Rasam
కారం (Getty Images)
  • ఆ తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి 10 నిమిషాల పాటు మరిగించాలి. పది నిమిషాల అనంతరం కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అంతే ఘుమఘుమలాడే బీట్​రూట్ రసం రెడీ అయినట్లే!
  • వేడివేడి అన్నంలో ఈ రసం వేసి తిన్నారంటే ఇంకో రెండు ముద్దలూ ఎక్కువగానే తింటారు!

ఘుమఘుమలాడే వాసనతో "ఉల్లి సాంబార్​" - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు​!

ఘుమఘుమలాడే బెంగళూరు "దొన్నె బిర్యానీ" - ఇంట్లోనే ఇలా ట్రై చేయండి!